20, నవంబర్ 2015, శుక్రవారం

సమస్య - 1860 (కావ్యమును లిఖించె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కావ్యమును లిఖించెఁ గత్తితోడ.

42 కామెంట్‌లు:

  1. కత్తి వంటి దైన ఘంటమ్ము ననుతొల్లి
    కావ్యమును లిఖించెఁ గత్తి తోడ
    కాగి తమ్ము పైన కవనమ్ము సులువైన
    తెలుగు భాష కొరత వెలుగు కనము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదం అర్థం కాలేదు.

      తొలగించండి
    2. గురువులకు నమస్కారములు
      పూర్వపు రోజుల్లో అంతకష్ట పడి గంటములతో తాటి యాకులమీద ప్రబంధ కావ్యాలు వ్రాసేవారు గదా , ఇప్పుడు ఎంతో సులువుగా కలములు , కాగితాలు దొరుకుతుంటే రాసేవాళ్ళున్నా అసలు తెలుగే మరుగున పడిపోతోంది . అని నాఉద్దేశ్యము . అదన్నమాట . అసల్ సంగతి . పొరబడితే ఏముంది ? మన్నించడమే మరి .

      తొలగించండి
  2. తొడను గొట్ట చాలు తొలుగు ప్రాణమనుచు
    సమర సింహముగను సంచరించి
    సీమ సందులందు చిత్రమ్ముగా రక్త
    కావ్యమును లిఖించెఁ గత్తితోడ!!

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో గణదోషం. ‘పద్దతులన్నియు’ అనండి. ‘దేవరాయ’ అని ప్రత్యయం లేకుండా వ్రాశారు. అక్కడ ‘కృష్ణరాయ ఘనుడు’ అందామా?

      తొలగించండి
  4. కలము చేత బట్టి కమనీయ మైనట్టి
    కావ్యమును లిఖించె గత్తి తోడ
    కదన రంగ మేలె ఘనుడురా రాయలు
    ఆంధ్ర భోజు డయ్యె ననఘు డతడు

    రిప్లయితొలగించండి
  5. చిన్నతనము లోన చెలికానికే పంప
    హృదయచిత్రమపుడు మదిని తలచి
    వ్రేలు గాటుబెట్టి వేడి రక్తమునద్ది
    కావ్య, మును లిఖించెఁ గత్తితోడ.

    రిప్లయితొలగించండి
  6. అంద మైన కృతియగాముక్త మాల్యద
    కావ్యమును లిఖించె గత్తి తోడ
    శత్రు వులకు సింహ స్వప్నమై నిలిచిన
    కృష్ణ దేవ రాయ కీర్తి ఘనము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కృతిగ నాముక్తమాల్యద’ అనండి.

      తొలగించండి
    2. కృష్ణరాయ విభుడు కీర్తినందుచు తాను
      కావ్యమును లిఖించె ;కత్తి తోడ
      సమరములను జేసి సాధించె రాజ్యమ్ము
      అష్ట దిగ్గజముల నాదరించె.

      తొలగించండి
    3. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ..................................

    { పూర్వ కవులు కత్తి గ౦ట మను సాధనము వాడే వారు. దానికి ఒక వైపు తాటియాకులను
    కత్తరి౦ప. చిన్న. కత్తి మరియొక వైపు వ్రాయడానికి గ౦టము ఉ౦డేవి . }

    గ౦టము గొని పూర్వ కవి యపూర్వ గతిని
    కావ్యమును లిఖి౦చె కత్తి తోడ
    తాటి యాకు లన్ని నీటు జేసి ;
    యతడు " కత్తి గ౦ట " మను సాధనము వా డె

    రిప్లయితొలగించండి
  8. [కావ్యానికి శబ్దార్థ గాంభీర్యములు; రణమునకు నిగూఢ వ్యూహరచన కాల్బల సంపద ముఖ్యమని సూచన.]
    సరళ రీతి యల్ప జనమనోవిదిత ని
    గూఢ భావ గతుల గూర్పులమరఁ
    గఠిన పద బలసహకార భీకర రణ
    కావ్యమును లిఖించెఁ గత్తితోడ.


    కీర్తి కాముడగుచు కృష్ణానదీతీర
    వాసి కత్తి భూమి పండితుండొ
    కనికి నీయ ముదము గని వదాన్యుని వంశ
    కావ్యమును లిఖించెఁ గత్తితోడ.
    [కత్తి భూమి= 17 ఎకరాల నేల కృష్ణా జిల్లాలో]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. నవర సముల తోడ నన్నెచోడు డిల ను
    కావ్య మునులి ఖించె, గత్తి తోడ
    పనస పండు కోసి పంచుము తొనలను
    దినగ నవియ యుండు దీ య గాను

    రిప్లయితొలగించండి
  10. సమస్య
    *గు రు మూ ర్తి ఆ చా రి *
    ............... ............. ....................

    గురువర్యా అదివరకు ప౦పిన పద్యములో
    .....................................................ో
    ప్రయాణము చేస్తూ వ్రాయుట వలన పొరపాటు
    జరిగినది. క్షమి౦చ౦డి.
    ............................................
    పాదములను సవరి౦చి ప౦పుచున్నాను
    .......................................... ........

    { పూర్వ కవులు కత్తి గ౦ట మను సాధనము వాడే వారు.దానికి ఒక వైపు తాటి యాకుల గోయుటకు కత్తి మరియొక వైపు పద్యములు వ్రాయుటకు వలయు గ౦టము ఉ౦డేవి }

    క త్తి గ౦టము గొని కవి యపూర్వ గతిని
    కావ్యమును లఖి౦చె ; కత్తి తోడ
    నతడు కోసె తాటి యాకుల --- తర్వాత
    పద్దెములను వాటి పైన. వ్రాసె ె

    రిప్లయితొలగించండి
  11. తిక్కన శ్రమకోర్చి స్థిర చిత్తమున తాను
    కావ్యము రచియించె , కత్తితోడ 
    యుద్దమును సలిపెను యోధుడౌ తిక్కన
    పత్నిచేసినట్టి యత్నమునను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కావ్యమును రచించె’ను ‘కావ్యము రచియించె’ అన్నారు. ఛందోభావాలలో మార్పు లేదనుకోండి.

      తొలగించండి
    2. కావ్యమును లిఖించెఁగత్తితోడ - సవరణ చేశాను. ధన్యవాదములు.

      తొలగించండి
  12. రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘పోకడ+అందు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.

      తొలగించండి
  13. గురువుగారికివందనము సవరించిన పూరణం
    20.11.15.సమస్య-కృష్ణరాయఘనుడు తృష్ణగ నిష్టతో
    కావ్యమును లిఖించె|గత్తితోడ
    యుద్ధకౌశలమున-పద్ధతులన్నియు
    రణమునందు జూపె రాజుగాన.

    రిప్లయితొలగించండి
  14. 2లోకపోకడగని లోపంబు మాన్పగ
    కావ్యమును రచించె |కత్తిబట్టి
    దుష్టతత్వ మున్న దునుముట కష్టమే
    కత్తికంటె కలము కరుకుగాన.

    రిప్లయితొలగించండి
  15. .సత్యయూహలందు సరిపడు రీతిగ
    కావ్యమును లిఖించె .కత్తిబట్టి
    నరక సంహరణము సాగించు చందాన
    కృష్ణు డల్లె మాయ కీడుమాన్ప

    రిప్లయితొలగించండి
  16. గురువుగారికి నమస్కారం. నా ఈ క్రింది పూరణ పరిశీలించి తప్పులు తెలియచేయగలరు. కత్తి అనే మాటకి 'అక్షరం' అనే పర్యాయ పదముంది కనక ఆ భావనలో రాశాను.
    ఆ.వె:
    రాయ నెంచె నతడు రమ్యమౌ పద్యము
    పాటు పడెను పదము పలుక కమరి
    పలుకు కలికి దయను పరికించి నంతనే
    కావ్యమును లిఖించె గత్తి తోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేదుల సుభద్ర గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వ్రాయనెంచె’ అనండి. అక్షరానికి కత్తి అన్న పర్యాయపదం ఉన్నా అది అంత ప్రసిద్ధం కాదు కదా!

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారు. సవరిస్తాను. అవునండి. కత్తి అనగానే కదనరంగాన్ని మాత్రమే తలపించేలా కాకా మరో విధంగా రాస్తే బావుంటుందేమో నని అలా రాసాను.

      తొలగించండి
    3. వ్రాయనెంచె నతడు రమ్యమౌ పద్యము
      పాటు పడెను పదము పలుక కమరి
      పలుకు కలికి దయను పరికించి నంతనే
      కావ్యమును లిఖించె గత్తి తోడ

      తొలగించండి
  17. చిఱుత ప్రాయమందె శ్రీనాథకవిరాజు
    కావ్యమును లిఖించె, గత్తి తోడ
    కదనరంగమందు కొదమసింగమువోలె
    రిపుల నణచు నృపుడు లిప్త లోన!!!

    రిప్లయితొలగించండి
  18. అడవి లో బృహత్కథావళి సత్కవి
    యల పిశాచి భాష నతని రక్త
    నాళములను కోసి తాళపత్రములపై
    కావ్యమును లిఖి౦చె కత్తి తోడ

    రిప్లయితొలగించండి
  19. శేష శాస్త్రి మెచ్చి శివభారతమనెడు
    కావ్యమును లిఖించె, కత్తితోడ
    నాశయమ్ముగల్గి హైందవ ధర్మమ్ము
    నా శివాజి నిల్పెననుచు దెల్ప

    రిప్లయితొలగించండి
  20. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    గడియారం వేంకట శేషశాస్త్రి గారి ప్రస్తావతో మీ పూరణ ఉత్తమంగా, సమర్థంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి