7, నవంబర్ 2015, శనివారం

సమస్య - 1848 (భరణమ్మును బొందె వధువు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భరణమ్మును బొందె వధువు భాగ్య మటంచున్.
ఈ సమస్యను పంపిన భాగవతుల కృష్ణారావు గారికి ధన్యవాదాలు. 

32 కామెంట్‌లు:

  1. శరణని వేడిన విడువడు
    మరణమె నీకిక గతియని మైకము నందున్
    దరిజేరు దారి దోచక
    భరణమ్మును బొందె వధువు భాగ్య మటంచున్

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. గురువు గారికి ప్రణామములు.... ప్రస్థుతము మీరు యెక్కడ వున్నారు? అంతా కుశలమనే భావిస్తున్నాను

      సమస్యాపూరణము.

      సిరులును సద్గుణ శీలము
      కరుణయు కలిగిన వరుడు సుగాత్రుడు మెచ్చన్
      వర మనుచును పతి యనునా
      భరణమ్మును బొందె వధువు భాగ్యమటంచున్

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      ప్రస్తుతం కాశీలోనే ఉన్నాము. వేకువ జాముననే వెళ్ళి వారాహీ దేవిని, ఆ తర్వాత విశ్వేశ్వరుని దర్శించుకున్నాము. ఈ సాయంత్రం తిరుగు ప్రయాణం.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనెడు+ఆభరణ' అన్నప్పుడు అనెడు నాభరణ మవుతుంది. అక్కడ 'పతి యను నా|భరణమ్మును' అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువు గారూ
      ముందు పతియను నాభరణమ్మ నే వ్రాసాను కానీ యేదో సంశయము తో మళ్ళీ పతి యనెడు ఆభరణమ్ము....పతియనెడాభరణమనీ మార్చాను

      మీ సూచనను పాటించి సవరీస్తానండి.

      తొలగించండి
  4. విరులును సిరులును జతగా
    తరుణీ మణికిట జగతిన తరగని దౌయా
    వరమేదన పతి తనకా
    భరణమ్మును బొందె వధువు భాగ్యమటంచున్
    2.అరణముగా పొందిన ముత్తెపు
    భరిణిన్ కుంకుమను నింపి పయనంబవగా
    చరణములకుమట్టెల యా
    భరణమ్మును బొందె వధువు భాగ్యమటంచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'జగతిని' అనండి.
      రెండవ పూరణలో మొదటి పాదంలో గణదోషం. 'అరణముగ నందు ముత్యపు' అనండి.

      తొలగించండి

  5. *గు రు మూ ర్తి ఆ చా రి *

    చరణములకు మట్టియలును ,
    కురుల౦దు విరులును , నుదుట కు౦కుమ. , మెడలో
    సురుచిర మ౦గళ సూత్రా
    భరణమ్మును పొ౦దె వధువు భాగ్య మట౦చున్

    రిప్లయితొలగించండి
  6. అరకొర సంసారంబది
    భరణమ్శునునీయలేని బ్రదుకులె యగుటన్
    భరమైనను నీయగమరి
    భరణమ్మును బొందె వధువు భాగ్యమ టంచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. పరిణయవేడుకలందున
    మురిపెముతో నత్తగారు ముద్దుగ నీయన్
    సరణిగ పెట్టుకొనెడి యా
    భరణమ్మును బొందె వధువు భాగ్యమటంచున్!!!

    రిప్లయితొలగించండి
  8. హరువిల్లు విరచ రాముడు
    దరహాసముఁ జేసి సీత దండను వైచెన్!
    పరిణయ వేదిన్ మౌల్యా
    భరణమ్మును బొందె వధువు భాగ్యమటంచున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      విరచ అన్నచోట ద్రుంచ అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
      హరువిల్లుఁ ద్రుంచ రాముఁడు
      దరహాసముఁ జేసి సీత దండను వైచెన్!
      పరిణయ వేదిన్ మౌల్యా
      భరణమ్మును బొందె వధువు భాగ్యమటంచున్!

      తొలగించండి
  9. వరలక్ష్మీ వ్రతమున నొక
    పరి యాత్మ ప్రదక్షిణమ్ము వందనమిడగాన్
    కర క౦కణములు కటకా
    భరణమ్మును బొందె వధువు భాగ్య మటంచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. కరుణయె తన్వికి వరమగు
    మరువని దౌ పెళ్లి నాటి మమతలు జూడన్
    అరుదగు మంగళ సూత్రా
    భరణమ్మును బొందె వధువు భాగ్య మటంచున్.

    రిప్లయితొలగించండి
  11. కరుణయె తన్వికి వరమగు
    మరువని దౌ పెళ్లి నాటి మమతలు జూడన్
    అరుదగు మంగళ సూత్రా
    భరణమ్మును బొందె వధువు భాగ్య మటంచున్.

    రిప్లయితొలగించండి
  12. కరమగుమక్కువ తోడుత
    వరియించగనత్తకొడుకు, వైవశ్యముతో
    వరుడిచ్చినట్టి కంఠా
    భరణమ్మునుబొందె వధువు భాగ్యమటంచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. పరిణయ సమయము నందున
    వరియించినవాడు తొడగె బరమోన్నతమౌ
    మిరిమిట్లు గొలుపు వజ్రా
    భరణమ్మును బొందె వధువు భాగ్యమటంచున్

    రిప్లయితొలగించండి
  14. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    ఇరు సంధ్యల మద్యము నకు
    పరుగెత్తెడి వాడు వరుడు భగవత్కృప స
    త్పురుషుండయి సతికిడె నా
    భరణమ్మును ; బొందె వధువు భాగ్య మటంచున్

    రిప్లయితొలగించండి

  15. *గు రు మూ ర్తి ఆ చా రి *

    చరణములకు మట్టియలును ,
    కురుల౦దు విరులును , నుదుట కు౦కుమ. , మెడలో
    సురుచిర మ౦గళ సూత్రా
    భరణమ్మును పొ౦దె వధువు భాగ్య మట౦చున్

    రిప్లయితొలగించండి
  16. అరచుచు కరచుచు చరచెడి
    వరునిక భరియింపలేక పరపతి తోడన్
    మురిపించు విడాకులతో
    భరణమ్మును బొందె వధువు భాగ్య మటంచున్

    రిప్లయితొలగించండి
  17. వరుడైనను మరునాడునె
    తరుముచు కొట్టగ మగడిని తత్తర బిత్తై
    పరువును పెట్టుచు పారగ
    భరణమ్మును బొందె వధువు భాగ్య మటంచున్

    రిప్లయితొలగించండి