10, నవంబర్ 2015, మంగళవారం

సమస్య - 1851 (కల్లుపాకలోఁ బురుషసూక్తము...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కల్లుపాకలోఁ బురుషసూక్తముఁ బఠించె.

46 కామెంట్‌లు:

  1. పల్లె కోవెల యందొక పండి తుండు
    సూక్తులను జెప్ప వెడలెను సోద్దె మనగ
    పలుక రానట్టి అజ్ఞుడు వచ్చి రాక
    కల్లు పాకలోఁ బురుష సూక్తముఁ బఠించె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      అయ్యవారిని అనుకరించిన అజ్ఞుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. గురువు గారికి ప్రణామములు, కాశీయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసుకున్నందులకు అభినందనలు. అక్కడి ఆవనూనె తో చేసిన పదార్థ భోజనము మనకు కాస్త అనారోగ్యమునకు హేతువు కావచ్చును కాస్త జాగ్రత్తగా వుండాలండి వారం రోజులు

    ఢాం! డమాఢమ ఢమడమా! ఢమడమఢమ
    భీకరటపాసు మోతలు పెచ్చురిల్లె
    కల్లుపాకలో! బురుష సూక్తముఁ బఠించె
    శర్మ, ధనలక్ష్మి పూజలో శ్రద్ధ తోడ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      నాకు, మా ఆవిడకు గొంతు చెడింది. జలుబు, దగ్గు... ఒంటినొప్పులతో కొద్దిగా జ్వర లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి కారణం నీటిమార్పు అనుకొన్నాము. మీరు చెప్పేదాకా తెలియదు... ఇది ఆవనూనె ప్రభావమని. తగిన జాగ్రత్తలు తీసుకొంటాము. ధన్యవాదాలు.
      కల్లుపాకలో టపాసుల మ్రోత... పూజలో పురుషసూక్తము... విరుపుతో చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
  3. పురి హితమును కాంక్షించు నరవరుండు
    దేవళమ్మును చేరి, ప్రతిధ్వనింప
    నూరినందెల్లరిండ్లలో నూరి బయట
    కల్లు పాకలోఁ, బురుష సూక్తముఁ బఠించె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఊకదంపుడు గారూ,
      కల్లుపాకతో సహా ఊరంతా ప్రతిధ్వనించే విధంగా గుళ్ళో (బహుశా మైకులో) పురుషసూక్త పఠనం... బాగుంది మీ పూరణ. అభినందనలు.
      మొదటిపాదంలో గణభంగం. పుర హితమ్మును.. అంటే సరి. నరవరుండు భూసురుండు అయితే?

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారు.
      సవరించిన పద్యము:
      పుర హితమ్మును కాంక్షించు భూసురుండు
      దేవళమ్మును చేరి, ప్రతిధ్వనింప
      నూరినందెల్లరిండ్లలో నూరి బయట
      కల్లు పాకలోఁ, బురుష సూక్తముఁ బఠించె.

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      నిజమే! దీపావళినాడు అన్ని దుకాణాలలో ధనలక్ష్మీపూజలు చేయిస్తారు కదా! మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వా రొనరించు నర్చనమున’ అనండి. ‘ఒనరించెడు+అర్చన+అందు=ఒనరిచెడు నర్చన యందు’ అవుతుంది.

      తొలగించండి
    2. ఊరుకూరంత జరిపిరి యుత్సవములు
      భూరి వేడ్కతో ధనలక్ష్మి పూజ లనుచు
      కల్లు పాకలోఁ బురుష సూక్తముఁ బఠించె
      బ్రాహ్మణుండట శ్రద్ధతో వ్రతము నెరపె

      తొలగించండి
    3. విరించి గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. మూర్ఖులెల్లరు తాగుచు పోవుచుండ
    పండుగ దినము లందున భయము లేక
    కల్లు పాకలో;పురుష సూక్తము పఠించె
    పండితుడు చెంత నున్న దేవాలయాన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
      ‘తాగుచు మురియుచుండ’ అంటే బాగుంటుంది.

      తొలగించండి

  6. గు రు మూ ర్తి ఆ చా రి
    ..................................

    { హల్లో ! త్రాగిన వానిని చుల్కనగా
    చూడవద్దు }

    త్రాగక మునుపు బుధ్ధావతార మెత్తి
    కల్లు పాకలో బురుష సూక్తము పఠి౦చె ;
    పీకల వరకు త్రాగిన. పిమ్మట నిక :-
    చక్కగా రోడ్డు వె౦బడి సాగకు౦డ.
    తూలుచు , బురద గు౦టలో దొర్లి పడుచు ,
    ధన్యు డయ్యె వరాహావ తార మెత్తి ! !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      త్రాగక ముందు, త్రాగిన తరువాత మానవుని ప్రవర్తన గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. పాకలను పందిళుల వేసి భవ్యముగను
    యజ్ఞపురుషుని నెలకొల్పి యజనమునను
    వేదవిధి పూజనము జేసి విప్రు ' డోర్వ
    కల్లు ' పాకలో బురుషసూక్తము పఠించె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      యజ్ఞవాటికలో పురుషసూక్తాన్ని పఠింపజేసిన పూరణ మీ సర్వతోముఖ ప్రతిభను చాటుతున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. మత్తుకున్ బానిసై నట్టి మాని యొకడు
    మధువునధికమ్ముగాగొని మధురముగను
    కల్లుపాకలోఁ బురుషసూక్తముఁబటించె
    కులము వారెల్ల కనుగొని కలతఁజెంద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మత్తుకున్ ' అనరాదు. మత్తునకున్ సాధురూపం.' బానిస+ఐనట్టి' అన్నప్పుడు యడాగమం వస్తుంది. 'మత్తునకు బానిస యయిన' అనండి.

      తొలగించండి
  9. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు
    అపార+అచంచల+ఆసక్తిన్ = అపారాచంచలాసక్తి; "శ" పడింది "స" కి బదులు చూసుకోలే దు.
    రేయింబవల్లు + ఇద్దరన్ =రేయింబవల్లిద్ధరన్ అని వ్రాసా ను. ఇది సరియైనదేనా తెలుప గోర్తాను.
    ముందు పూజార్తినై యార్తితో అనే వ్రాసి మార్చాను. “వేవారుం దవనామ” బాగుంది,మార్చాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      రేయింబవల్లిద్ధరన్' సరియైన ప్రయోగమే. నేనే పొరబడ్డాను. మన్నించండి.

      తొలగించండి
  10. మార్గ గమన పరిశ్రాంత పురుషు డొకడు
    సద్విజుండు విమల గుణ సత్తముండు
    గనియె నొక పాక నచ్చట కలవు కడు న
    కల్లుపాకలోఁ బురుషసూక్తముఁ బఠించె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. మనుజు డొకడు... అనండి.
      'నకల్లు'.....?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు సవరణ కు ముందు పూరణ పంపాను పొరపాటున.
      నకలులు = కాపీలు
      మార్గ గమన పరిశ్రాంత మనుజు డొకడు
      సద్విజుండు విమల గుణ సత్తముండు
      గనియె నొక పాక నచ్చట కలవు కడు న
      కల్లుపాకలోఁ బురుషసూక్తముఁ బఠించె.

      తొలగించండి
  11. తప్ప త్రాగును నిత్యము తంగ వేలు
    కల్లు పాకలో, ,పురుష సూక్తము పఠిం చె
    గర్భ గుడిలోన రమభావ గర్భి తముగ
    భక్తు లందఱు మెచ్చగ రక్తి గాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిశ్రీ సత్తిబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ, మూడవ పాదాలలో గణదోషం. 'కల్లు నమృత మనుచు ద్రాగి...., మద్యమును గ్రోలెడి...' అనండి.
      అయినా పురుషసూక్తం సంస్కృతంలో ఉంది కదా! దివిజులకు సంస్కృతం రాకుండా ఉంటుందా?

      తొలగించండి
  13. పవనతనయుని గుడిలోన పాకలందు
    వేద పఠనమ్ము నేర్పుచు సాధకులకు
    పంచసూక్తముల్ దెల్పుచు పఠియె, గుంత
    కల్లు, పాకలో బురుషసూక్తము బఠించె !!!



    రిప్లయితొలగించండి
  14. దేవిపౌరాణికాంశాలుదెలుపుచు,పునకల్లు
    పాకలో”బురుష సూక్తము బఠించె
    భక్తి శ్రద్దగ పదిమంది వచ్చిజేర
    ఇంటియజమాని దినచర్య నిష్టబడుచు.{పూరణంలో పునకల్లుఒకగ్రామము}

    రిప్లయితొలగించండి
  15. తెలుగు పలుకుట రానట్టి దేబె యొకడు
    కల్లునమృతమనుచుద్రాగి ఘొల్లు మనుచు
    మధ్యమును గ్రోలెడి జనుల మధ్య జేరి
    కల్లు పాకలోఁ, బురుష సూక్తముఁ బఠించె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిశ్రీ సత్తిబాబు గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. వేద పాఠశాల వెలసి విద్య నేర్ప
    నిత్య నియమాను సారాన సత్యమైన
    భత్య మట్లుగ వినుచును వటువు|”ఆనె
    కల్లు”.పాకలో పురుష సూక్తము పఠించె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ ‘ఆనెకల్లు’ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ ‘ఆనెకల్లు’ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    మద్య మమ్మకమున కనుమతులనిడగ
    పరమ నిష్టాగరిష్టుడౌ పండితుండు
    నరిగి గుడికని సేవించ మరగి యిప్ప
    కల్లు,పాకలో పురుష సుక్తముబఠించె

    రిప్లయితొలగించండి
  18. కల్లు సేవించ నేర్చిన కపిలశాస్త్రి
    తండ్రి బలవంత పెట్టగ దారి మార్చి
    గుడిని కూర్చున్న మనసేమొ కొలువుఁ జేయ
    కల్లు పాకలోఁ బురుష సూక్తముఁ బఠించె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      తనువు గుడిలో, మనస్సు కల్లుపాకలో... చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
  19. మద్యమమ్మ సర్కారనుమతి నొసంగ
    కల్లుసీసాల నర్చించి ఘనము గాను
    పూజ జేయుచు విప్రుడు స్ఫూర్తి మెరయ
    కల్లుపాకలో పురుష సూక్తము బఠించె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      కల్లుపాకలో పూజ.. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి