26, నవంబర్ 2015, గురువారం

సమస్య - 1866 (గంగాసుతుఁ డాలమున...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గంగాసుతుఁ డాలమున శిఖండినిఁ జంపెన్.

40 కామెంట్‌లు:

  1. మనషి బ్రతుకు మనసులేకున్న చచ్చినదానితోసమానం
    భీష్మునిచావుకుశిఖండిఈర్ష్యపగలేకారణం వాటినిశిఖండి
    లోయున్నభీష్ముడుచంపినట్లేగద |అన్నభావాననాపూరణ
    దొంగగ దూరిన ఈర్ష్యను
    అంగాంగములందునున్నదాపగ మదిలో
    క్రుంగగజేసెనుమనసును
    గంగాసుతుడాలమునశిఖండిని జంపెన్.

    రిప్లయితొలగించండి
  2. భంగపడె దన యెదుట గని
    గంగాసుతుడాలమున శిఖండిని, జంపెన్
    పొంగిపొరలు పౌరుషమును
    గాంగేయుడు స్వేచ్ఛ మరణ కాంక్షితు డతడున్

    రిప్లయితొలగించండి

  3. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఛ౦దము = " మ ధ్యా క్క ర. "

    స౦గర మ౦దు త్యజి౦చె శస్త్రముల్ వీక్షి౦చి న౦త >>
    గ౦గాసుతు౦ "డాలమున" - శిఖ౦డిని |చ౦పెన్ గిరీటి
    గా౦గేయు , నిదె సమయ మని | కాకున్న శక్యమే యతని
    క్రు౦గి౦ప ? భారత గాధకున్ సూత్రధారి మురారి !
    .........................................

    అ న్వ య ము = గ౦గా సుతు౦డాలమున శిఖ౦డిని వీక్షి౦చి న౦త స౦గరమ౦దు త్యజి౦చె శస్త్రముల్
    ............................................

    { ఆలము = త.వి. = రణము , ఉ పే క్ష

    ఆలము = దే.వి.= ఉ పే క్ష ,అ శ్ర ధ్ధ. }
    ..................................................
    ..
    శిఖ౦డిని చూచిన భీష్ముడు యుధ్ధము చేయ. న శ్ర ధ్ధ . వహి౦చెను

    రిప్లయితొలగించండి
  4. భీష్ముడు రణరంగము లో శిఖండి ని జూచి అస్త్ర సన్యాసము చేసిన (బాణాన్ని చంపి.) సందర్భము:

    అంగన గబుట్టి యంబయె
    గాంగేయు వధింపగన్ శిఖండిగ నిలువన్
    భంగయశుడు గానేరక
    గంగాసుతుఁ డాలమున శిఖండినిఁ జంపెన్.
    [(రెండవ) శిఖండి = బాణము ]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గురూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఉత్తరార్ధంలో అన్వయం లోపించినట్లుంది.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. శిఖండి (ఒకప్పుడు ఆడది గనుక) తో యుద్ధము చేయడము తన కీర్తికి భంగమని తన బాణాన్ని చంపుకున్నాడని నా భావము. శిఖండి యనగా బాణమని కూడా అర్ధముంది కదా.

      తొలగించండి
  5. 5.కం:సింగము వోలెను దూకుచు
    సంగరమున ధనువు దాల్చి శత్రువులను నె
    ల్లంగూల్చుచు క్రోధంబున
    గంగా సుతుడాలమున శిఖండిని జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      సమస్యా పరిష్కారం కాలేదు. శిఖండిని భీష్ముడు చూపలేదు కదా!

      తొలగించండి
  6. గంగాధరుడే వరమిడ గల్గెను తానం
    బే గర్వము ఖర్వమునవ భీష్మునకున్ స్త్రీ
    కాగన్ సుతుడై ద్రుపునకు కానగనెట్లున్
    గంగాసుతుడాలమున శిఖండిని జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శశికాంత్ మల్లప్ప గారూ,
      మీరు వ్రాసిన పద్యం ఛందస్సు ఏమిటో అర్థం కావడం లేదు.

      తొలగించండి
    2. గురువు గారూ పై వృత్తం శక్వరి ఛందానికి చెందిందని
      అంతర్జాలంలో గ్రహించి వ్రాసాను
      నడక: త జ న భ గగ
      యతి: 10వ అక్షరం
      ఇంతకు మించి అవగాహన లేదు

      ఇదే భావంలో కంద పద్యం ఈ క్రింది విధంగా

      గంగాధరుడే వరమిడ
      నాగతి యంబే జన్మించెనపుడునసువులు బాపన్
      కాగను ఎవ్విధమనదగు
      గంగాసుతుడాలమున శిఖండిని జంపెన్

      తొలగించండి
    3. శశికాంత్ గారూ,
      విశేష చ్ఛందాల పట్ల మీకున్న ఆసక్తి సంతోషం కలిగించింది. శక్వరిలో పూరణ బాగున్నది. కానీ ప్రాస తప్పింది.
      కందంలోను ప్రాస తప్పింది. అంతేకాకుండా రెండవ పాదంలో గణదోషం.

      తొలగించండి
    4. గురువు గారూ ప్రాస ఎక్కడో తెలుపగలరు

      గంగాధరుడే వరమిడ
      నాగతి జన్మొందెనంబ యసువులు బాపన్
      కాగను ఎవ్విధమనదగు
      గంగాసుతుడాలమున శిఖండిని జంపెన్

      ప్రాస మినహాయించి మిగతాదంతా ఆమోద యోగ్యమా తెలుప గలరు

      తొలగించండి
    5. రెండు, మూడు పాదాలలో ప్రాస తప్పింది. అనుస్వారంతో కూడిన ప్రాసాక్షరం (ంగ) ఉంటే మిగిలిన పాదాల్లోను అటువంటి అక్షరమే ఉండాలి.

      తొలగించండి
    6. ధన్యవాదాలు సరి చేయడానికి ప్రయత్నిస్తాను

      తొలగించండి
    7. గంగాధరుడే వరమిడ
      నంగన జన్మొందె దునుమనంబయె భీష్మున్
      భంగి యదేమగునిట్లన
      గంగాసుతుడాలమున శిఖండిని జంపెన్

      తొలగించండి
  7. క్రుంగిన మానసమున గనె
    గంగాసుతుఁ డాలమున శిఖండినిఁ; జంపెన్
    సంగరమందు నభీష్టము,
    చెంగలిగల కత్తి వదలి చేరగ మాతన్.

    రిప్లయితొలగించండి
  8. క్రుంగిన మానసమున గనె
    గంగాసుతుఁ డాలమున శిఖండినిఁ; జంపెన్
    సంగరమందు నభీష్టము,
    చెంగలిగల కత్తి వదలి చేరగ మాతన్.

    రిప్లయితొలగించండి

  9. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఛ౦దము = " మ ధ్యా క్క ర. "

    స౦గర మ౦దు త్యజి౦చె శస్త్రముల్ వీక్షి౦చి న౦త >>
    గ౦గాసుతు౦ "డాలమున" - శిఖ౦డిని |చ౦పెన్ గిరీటి
    గా౦గేయు , నిదె సమయ మని | కాకున్న శక్యమే యతని
    క్రు౦గి౦ప ? భారత గాధకున్ సూత్రధారి మురారి !
    .........................................

    అ న్వ య ము = గ౦గా సుతు౦డాలమున శిఖ౦డిని వీక్షి౦చి న౦త స౦గరమ౦దు త్యజి౦చె శస్త్రముల్
    ............................................

    { ఆలము = త.వి. = రణము , ఉ పే క్ష

    ఆలము = దే.వి.= ఉ పే క్ష ,అ శ్ర ధ్ధ. }
    ..................................................
    ..
    శిఖ౦డిని చూచిన భీష్ముడు యుధ్ధము చేయ. న శ్ర ధ్ధ . వహి౦చెను

    రిప్లయితొలగించండి
  10. సంగరమున భీష్ముఁదునుమ
    రంగమునకుదిగ శిఖండి రయమున, కనుచున్
    భంగము కాగ తన యునికి
    గంగాసుతుఁడాలమునశిఖండినిఁజంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. అంగూషములు వదలె, గని
    గంగాసుతుఁడాలమున శిఖండిని , జంపెన్
    కంగు తినిపించి రిపులకు
    సంగరముల గెలిచె గాదె శాంతనవుండే!!!

    రిప్లయితొలగించండి
  12. పొంగు శిఖండిని వదలెను
    గంగాసుతుఁ డాలమున, శిఖండినిఁ జంపెన్
    సంగరమున ద్రౌణియ సుల
    బంగా భయభీతుని వెదకి పటుతర యుక్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. ‘సులభంగా భయభీతు వెదకి...’ అనండి.

      తొలగించండి
    2. పొంగు శిఖండిని వదలెను
      గంగాసుతుఁ డాలమున, శిఖండినిఁ జంపెన్
      సంగరమున ద్రౌణియ సుల
      బంగా భయభీతు వెదకి పటుతర యుక్తిన్

      తొలగించండి
  13. భంగపడెను పార్దునిచే
    గంగాసుతు డాలమున, శిఖండిని జంపెన్
    తుంగిని ద్రౌణి యె నెదిరి౦
    పంగను ద్రౌపది పుత్రుల
    పరిమార్చు నెడన్
    తుంగి =రాత్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. .కం:సింగము వోలెను దూకుచు
    గంగా సుతుడాలమున శిఖండిని జంపెన్
    రంగుగ యనుటన్ కల్లయె
    సంగరమున వానిని గని శస్త్రము వీడెన్.

    రిప్లయితొలగించండి
  15. .కం:సింగము వోలెను దూకుచు
    గంగా సుతుడాలమున శిఖండిని జంపెన్
    రంగుగ యనుటన్ కల్లయె
    సంగరమున వానిని గని శస్త్రము వీడెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘రంగుగ ననుటన్’ అనండి.

      తొలగించండి
    2. మంగా! భీష్ముడెగద మరి
      గంగాసుతుడాలమున శిఖండీని చంపెన్
      చెంగావిములుకుతోడన
      గంగాసుత! కావుమనుచుగలవర మొందన్

      తొలగించండి
  16. బెంగాలున మోడి వెడలి
    సింగారముతో మమతను సిగ్గున ముంచెన్...
    రంగా! ఇది యెట్లన్నన్:
    గంగాసుతుఁ డాలమున శిఖండినిఁ జంపెన్

    రిప్లయితొలగించండి