ఆంజనేయ శర్మ గారూ, చెడిన గొంతు ఇంకా బాగుపడలేదు. ఒంటినొప్పులు పూర్తిగా తగ్గలేదు. డాక్టర్ వ్రాసిన మందులు వేసుకుంటున్నాను. మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘విద్య గుడుచు’ అన్నచోట ‘విద్య గఱచు’ అంటే బాగుంటుందేమో?
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘నాయకులవ’ అన్నదానిని ‘నాయకులయి’ అనండి. ‘కాగా’ అనే అర్థంలో మీరు ‘అవ’ను ప్రయోగించారు. అవ అనేది అవ్వకు రూపాంతరం. చెడు అనే అర్థంలో సంస్కతంలో అవ్యయం (అవగుణం, అవలక్షణాలు). రెండవ, మూడవ అని సంఖ్యాపూరణార్థక విశేషం.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిచెడిన గొంతు ఇంకా బాగుపడలేదు. ఒంటినొప్పులు పూర్తిగా తగ్గలేదు. డాక్టర్ వ్రాసిన మందులు వేసుకుంటున్నాను.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘విద్య గుడుచు’ అన్నచోట ‘విద్య గఱచు’ అంటే బాగుంటుందేమో?
గురువు గారికి నమస్కారములు....ప్రయాణ బడలిక తీరిందని భావిస్తాను....ఆ విశ్వనాథుని పరిపూర్ణ కృపాకటాక్షములు సదా మిమ్మంటిపెట్టుకుని వుండాలని కోరుకుంటున్నాను.
తొలగించండిసంస్కరింపగ లేనట్టి చదువు లయ్యె
గుణముల కొలమానమనవగుణము పెరిగి
చూచి రాతల వ్రాయించు చోద్యము గన
విఫణి విద్యాలయమునందు విద్య గఱచు
నేటి బాలలే రేపటి నేరగాండ్రు
దూర దర్శిని నేర్పును దురిత ములను
రిప్లయితొలగించండివేలు బోసిన కొనలేని విద్య లందు
వెకిలి చేస్టల గురువుల మకిలి గనుచు
నేఁటి బాలలే రేఁపటి నేర గాండ్రు .
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘చేస్టలు’ ... టైపాటు.
దూర దర్శిని నేర్పును దురిత ములను
తొలగించండివేలు బోసిన కొనలేని విద్య లందు
వెకిలి చేష్టల గురువుల మకిలి గనుచు
నేటి బాలలే రేపటి నేర గాండ్రు
నాటి నేరస్తు లందరూ నాయకులవ
రిప్లయితొలగించండిదమననీతిని ధూర్తత నమలు జేసి
జనుల దోచు కొనంగను చదువు నేర్ప
నేటి బాలలే రేపటి నేరగాండ్రు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నాయకులవ’ అన్నదానిని ‘నాయకులయి’ అనండి.
‘కాగా’ అనే అర్థంలో మీరు ‘అవ’ను ప్రయోగించారు. అవ అనేది అవ్వకు రూపాంతరం. చెడు అనే అర్థంలో సంస్కతంలో అవ్యయం (అవగుణం, అవలక్షణాలు). రెండవ, మూడవ అని సంఖ్యాపూరణార్థక విశేషం.
గురువుగారి వివరణకు ధన్య వాదములు
తొలగించండిసవరించిన పద్యము
నాటి నేరస్తు లందరూ నాయకులయి
దమననీతిని ధూర్తత నమలు జేసి
జనుల దోచు కొనంగను చదువు నేర్ప
నేటి బాలలే రేపటి నేరగాండ్రు
కల్ల నిజముల దెల్పని తల్లి తండ్రి,
రిప్లయితొలగించండిబ్రతుకువిద్యను నేర్పని బడినిగురువు,
బాలహక్కుల మరచిన ప్రభుత యున్న
నేఁటి బాలలే రేఁపటి నేరగాండ్రు.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చలన చిత్రములను గని చదువు లెల్ల
రిప్లయితొలగించండివీడి మంచిని విడుచుచు వేషములను
మార్చి నేర్చు చున్నారిట మాయలెన్నొ
నేటి బాలురెరేపటి నేరగాండ్రు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నేర్చుచున్నారిట’ అన్నారు. మీరు అమెరికాలో ఉన్నారు కదా! ‘ఇట’ అంటే అమెరికాలోనా?
తొలగించండిచదువు సంధ్యలు లేకుండ చవట లవలె
రిప్లయితొలగించండిగ్రామగ్రామాలు దిరుగుచు గనక దారి
జీవ నోపాధి కొఱకు నై చేయ దొంగ
తనము ,నగుదురు కదమఱి తప్ప కుండ
నేటి బాలలే రేపటి నేర గాండ్రు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సంస్కరించని పిల్లల చదువు, టీవి ,
రిప్లయితొలగించండితల్లి దండ్రుల , గురువుల తప్పు నడక
వీనిలో మార్పులికనైన లేని యెడల
నేఁటి బాలలే రేపటి నేరగాండ్రు.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బాల లతి సున్నితులు నిష్కపటులు నిర్మ
రిప్లయితొలగించండిలులు వివృత హృదయులు పెద్దలు నుడివిన య
టులె చరింతురు గాదె యిటు లన దగునె
నేఁటి బాలలే రేపటి నేరగాండ్రు.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండినేర చరితము గలిగిన నేత యొకడు
" బాలలే గద రేపటి పౌరులు + అనక
నేటి బాలలే రేపటి నేర గా౦డ్ర "
ట౦చు , పాఠశాలసభలో ననియె ; న౦త.
నవ్వి ర౦దరు || దాగునే నైజ గుణము ?
దుష్టనీతి దుర౦ధరల్ దొరలు మనకు !
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(+)సంధి గుర్తులు పెట్టనవసరం లేదని గమనించండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ నాల్గు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మూడవపద్యం మూడు పాదాలు ఆలవెలదిలో, నాల్గవపాదం తేటగీతిలో ఉన్నాయి.
కన్నపిల్లలుఁ జేసెడు కాని పనుల
రిప్లయితొలగించండిమొదటె తల్లిదండ్రులుఁ దిద్ది బుద్ధి నేర్పి
మంచి జేసిన మెచ్చెదమనిన, కారు
నేఁటి బాలలే రేపటి నేరగాండ్రు!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిన్నపిల్లల బడులన్ని జైలు లవ్వ
రిప్లయితొలగించండినాటపాటలు నీ టిలో మూటలాయె
తాతతండ్రుల బంధము తరగిపోవ
నేటిబాలలే రేపటి నేరగాండ్రు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గార్కి నమస్సులు . నిన్నటి పద్యం లో మీ సవరణ కు ధన్యవాదాలు .
రిప్లయితొలగించండినేటి సేల్ఫీలు హేకింగ్లు నెట్లు కతన
గుప్త విషయము లందున గుట్లు లాగి
క్షణము లోన నకృత్య ముల్ శతము జేయు
నేఁటి బాలలే రేపటి నేరగాండ్రు.
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు కందిశంకరయ్యగారికివందనములతోసవరణజేసినపూరణ
రిప్లయితొలగించండిమాటనేర్వని బాలుర మానసంబు
తల్లిపాలట్లు ని స్వార్థమల్లుజూడ
డబ్బిపాలనువాడెడి దర్పమట్లు
నీతి నిలువలు లేనట్టినిధులకొరకు
ఆశపాశాలునేర్పిన అలుపులేక
నేటిబాలలె రేపటి నేర గాండ్రు.
2.నేటిబాలలె రేపటి నేర గాండ్రు
ఎందు కౌదురు?శిక్షన లెరుగకున్న
తల్లిదండ్రియు గురువుల తలపులందు
లాభ మాశించ? పిల్లలు లోభులేగ.
3.వెట్టిచాకిరు లందునే వెతలుబెంచి
ఇంట మమతలుపిల్లలకంటబడక
బడికి వెళ్లకచదువు,ను విడుచువారె
నేటి బాలలే రేపటి నేరగాండ్రు.
4.పలుకు లందించగ –పదభూష ణంబులు
--------అమ్మనాన్న ,గురువు లందజేయ
విద్య విలువనేర్పు విజ్ఞాన వంతులు
-----గురువు-లమ్మబడక కరుణ జూప
నీతి నియమమెల్ల నిష్టూర మందున్న
----ధర్మ మార్గాములెల్ల దరికిజేర్చ
సంఘ సంస్కరణంబు సాగించు పద్ధతుల్
-----విద్యార్థి దశలందు విశద బరచ
నేటి బాలలే రేపటి నీతిపరుల
టన్న సత్యంబు నిత్యంబునణచి వేసి
లాభ లోభత్వ మందున లౌక్య ముంచ?
నేటిబాలలే రేపటి నేరగాండ్రు.