గురువు గారికి నమస్కారములు....మీ ఫోన్ లో కనిపించకుండా పోయిన ఫోటోలు తిరిగి కనిపించాయా? లేకపోతే గూగుల్ సెర్చ్ లో బ్యాకప్ ఆప్షన్ ప్రెస్ చేయండి. డిలేటయినవి తిరిగి వస్తాయి. మరి మీ ఫోన్ లో ఆ ఆప్ వుందో లేదో చూడండి. " గూగుల్ సెర్చ్ "
ఆంజనేయ శర్మ గారూ, 'How to recover deleted files in Android phone ' అని వెదకితే కొన్ని పరిష్కారాలు కనిపించాయి. కానీ అందుకు కంప్యూటర్ అవసరం ఉంటుంది. ఇంటికి వెళ్లిన తర్వాత ప్రయత్నిస్తాను. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గురుమూర్తి ఆచారి గారూ, సంతోషం. ముందుగా నేనా పాదాన్ని 'నీతులు జెప్పెడు వారలు' అని ఇవ్వాలనుకున్నాను. కాని ఎవరైనా శార్దూలాన్ని వ్రాస్తారేమో అని మార్చాను. ఆ పని మీరు చేశారు. పద్యం బాగున్నది. అభినందనలు
గురువు గారికి నమస్కారములు....మీ ఫోన్ లో కనిపించకుండా పోయిన ఫోటోలు తిరిగి కనిపించాయా? లేకపోతే గూగుల్ సెర్చ్ లో బ్యాకప్ ఆప్షన్ ప్రెస్ చేయండి. డిలేటయినవి తిరిగి వస్తాయి. మరి మీ ఫోన్ లో ఆ ఆప్ వుందో లేదో చూడండి.
రిప్లయితొలగించండి" గూగుల్ సెర్చ్ "
నీతుల్ జెప్పెడు వారలు
చేతలలో జూపబోరు చిత్రం బిదియే
లోతుగ పరిశీలించిన
బూతుల చరితున్నవీరు భువిలో కొల్లల్
ఆంజనేయ శర్మ గారూ,
రిప్లయితొలగించండి'How to recover deleted files in Android phone ' అని వెదకితే కొన్ని పరిష్కారాలు కనిపించాయి. కానీ అందుకు కంప్యూటర్ అవసరం ఉంటుంది. ఇంటికి వెళ్లిన తర్వాత ప్రయత్నిస్తాను.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములండి గురువు గారు.....నా ఫోన్ లో గూగుల్ సెర్చ్ అనే అప్లికేషన్ వుంది దానిలో బ్యాకప్ ఆప్షన్ తో డిలేటెడ్
తొలగించండిఫో టోలు తిరిగి వస్తాయి.
నీతుల్ జెప్పెడి వారలు
రిప్లయితొలగించండిగోతులు ద్రవ్వుచును మిగుల గోప్యము నుండన్
రాతలు మార్చెడి నేరుపు
చేతల యందునను త్రోయు శీవపు కాటున్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినీతుల్ జెప్పెడి వారలు
రిప్లయితొలగించండిజేతలలో జూపరార్య! చెప్పుటవరకే
నీతులనుపయో గింతురు
నీతినిబాటించకున్న నేరముగాదే?
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
నీతుల్ జెప్పెడు వారలు
రిప్లయితొలగించండిచేతలలో జూపినంత జేజే యనుచున్
జాతియె పొగుడును, వారే
ఖ్యాతిని పొందుచు నిలుతురు ఘనులై భువిలో.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
నీతుల్ జెప్పెడి వారలు
రిప్లయితొలగించండిదాతలుగా కానుపించి ధర్మము లేకన్
గోతులు ద్రవ్వెడి నేతలు
జాతికి నష్టంబు గాదె జన్మకు ఫలమా?
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
..... .......................
{ గురువుగారికి ప్రణామములు సమస్యా
పాద నిర్మాణమునకు భ౦గము వాటిల్లకు౦డా
శార్దూలము వ్రాస్తున్నాను
మన్ని౦చ గలరు }
నీతుల్ జెప్పెడు వార ల౦దరును దుర్నీతి క్రియా భ్రష్టులే
గోతుల్ దీసెడు ధూర్తలే | నియమమున్ గుర్తి౦చి వర్తి౦చు మో
యీ ! తృణ్య౦బని యె౦చుమా పరధన౦. బీవెప్డు | క్రోధిల్లకన్
చాతుర్య౦బున. మాటలాడి చనుమా శా౦తస్వభావ౦బునన్ ! !
{ తృణ్యము = గడ్డితో సమానము , గడ్డికుప్ప }
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
..... .......................
{ గురువుగారికి ప్రణామములు సమస్యా
పాద నిర్మాణమునకు భ౦గము వాటిల్లకు౦డా
శార్దూలము వ్రాస్తున్నాను
మన్ని౦చ గలరు }
నీతుల్ జెప్పెడు వార ల౦దరును దుర్నీతి క్రియా భ్రష్టులే
గోతుల్ దీసెడు ధూర్తలే | నియమమున్ గుర్తి౦చి వర్తి౦చు మో
యీ ! తృణ్య౦బని యె౦చుమా పరధన౦. బీవెప్డు | క్రోధిల్లకన్
చాతుర్య౦బున. మాటలాడి చనుమా శా౦తస్వభావ౦బునన్ ! !
{ తృణ్యము = గడ్డితో సమానము , గడ్డికుప్ప }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిసంతోషం. ముందుగా నేనా పాదాన్ని 'నీతులు జెప్పెడు వారలు' అని ఇవ్వాలనుకున్నాను. కాని ఎవరైనా శార్దూలాన్ని వ్రాస్తారేమో అని మార్చాను. ఆ పని మీరు చేశారు. పద్యం బాగున్నది. అభినందనలు
నీతుల్ జెప్పెడివారలు
రిప్లయితొలగించండిగోతులనే తీయుచుంద్రు కోరికలడరన్
ఖ్యాతిని పొందుదు రెపుడును
నీతినిజాయిలపైన నిలబడువారల్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినీతుల్ జెప్పెడు వారలు
రిప్లయితొలగించండిజాతికి శ్రేయమ్ముఁ గూర్చు జ్ఙానులు చూడన్!
జేతల నాచరణంబుల
రీతిగఁ బాటించి చూప ప్రీతిని గూర్చున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినీతుల్ జెప్పెడివారలు
రిప్లయితొలగించండిగోతులనే తీయుచుంద్రు కోరికలడరన్
ఖ్యాతిని పొందుదు రెపుడును
నీతినిజాయి తి లపైన నిలబడువారల్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
.నీతుల్ జెప్పెడి వారలున్ గనిన?సాన్నిధ్యాన సంతోషమే
రిప్లయితొలగించండిదాతల్ ధర్మము దక్షతల్ నిలుపకన్ దారిద్ర్యమే జూడగా
గోతుల్ ద్రవ్వెడి దుష్టమానవుల నాక్రోశంబు మాన్పించకన్
కోతుల్గోర్కెల రీతి సాగుటగులే |కొండంత నండుండినన్.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీరు కూడా శార్దూలాన్ని వ్రాసినందుకు సంతోషం. పద్యం బాగున్నది. అభినందనలు.
1నీతులు జెప్పెడి వారలు
రిప్లయితొలగించండికోతలు కోయుచు వెనుకనె గోతులు తవ్వన్
చేతులు ముడుచుకు నుండక
చేతలతో బుద్ధిచెప్ప శ్రీమతి మెచ్చున్
2.నీతులు జెప్పెడి వారలు
తాతల కాలపు కథలను తరచుగ జెప్పన్
చేతల చూపు మటంచును
నేతల ప్రశ్నించు వేళ నీరస మేలన్
3నీతులు జెప్పెడి వారలు
ఖ్యాతిని తెచ్చెడు పనులను కష్టంబనకన్
ప్రీతిన్ చేయుచు నుండగ
జాతియె నెమ్మితొ నుతించు జయజయ మనుచున్.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
నీతుల్ జెప్పెడివారలు
రిప్లయితొలగించండినేతలుగా మారినారు నేరుపు తోడన్
చేతలు చేయింతురకట!
జీతము లిచ్చుచు పగతుర జీర్ణము జేయన్
నీతుల్ జెప్పెడివారలు
రిప్లయితొలగించండిగోతులు తీయుచు వెనుకనె గొప్పగు రీతిన్
మేతలు మేపుచు జనులకు
చేతులు త్రిప్పుచు సభలను సీటులు గెలుతుర్