1, నవంబర్ 2015, ఆదివారం

సమస్య - 1842 (బ్రాహ్మణుండు మాంస....)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
బ్రాహ్మణుండు మాంసభక్షకుండు. 

42 కామెంట్‌లు:

విరించి చెప్పారు...

మానవాళి కతడు మార్గదర్శిగ నిల్చు
వేద విద్యలందు విదురుడతడు
పురము హితము గోరు పూజ్యుడతడు, | కాదు
బ్రాహ్మణుండు మాంస భక్షకుండు

జిగురు సత్యనారాయణ చెప్పారు...

బ్రాహ్మనుండొకండు బ్రహ్మరాక్షసుడయ్యె
కోపమొందిన ముని శాపమునిడ
జంతువులను జనులఁ జంపుచు తినసాగె
బ్రాహ్మణుండు మాంసభక్షకుండు!!

కంది శంకరయ్య చెప్పారు...

ఆంజనేయ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

sailaja చెప్పారు...

వేదవిద్య లెల్ల సాధన జేయుచు
సాత్త్వికుండు దినును శాకములను
పైడి వెండి తోడ పనులు జేసెడి విశ్వ
బ్రాహ్మణుండు మాంసభక్షకుండు !!!

కంది శంకరయ్య చెప్పారు...

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

భూమి సురుడు యన్న భువిలోన దైవమే
బ్రాహ్మణుండు మాంస భక్షకుండు
కాడు;శుభములొసగు కార్యములకు నెల్ల
నాంది పలుకు చుండు నయము తోడ.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులందఱకు నమస్సులు!

భువిని జనుల యందములనుఁ బెంచఁగ నెప్డు
తనదు జీవితమునుఁ దలలఁ గలుగు
కేశసంస్కరణలకే వ్యయించెడు నాయి

బ్రాహ్మణుండు మాంసభక్షకుండు!

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

స్నేహమునకు లేవు చిన్న,పెద్దలనుచు
ప్రాణమిత్రులైరి పాఠ శాల
శాకపాకములను చప్పరించి దినెడు
బ్రాహ్మణుండు, మాంసభక్షకుండు.

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
A.Satyanarayana Reddy చెప్పారు...

పప్పుకూడుతోడ పరవశించుచు నుండు
బ్రాహ్మణుండు, మాంస భక్షకుండు
శాకములను తినుచు సంప్రాప్తిని గొనడు
నాల్క లాగుచుండ నంజు పైకి

gurumoorthy చెప్పారు...

*గు రు మూ ర్తి ఆ చా రి *
.... ....................., .

' బోర్డు ' చూ డ. ఉడిపి భోజనాలయ మట.
దాని ' ఓన ' రేమొ కానె కాదు --
బ్రాహ్మణు౦డు ; మా౦స భక్షకు౦డు గద. ఛీ !
దొ౦గ వేస. మేల. దుడ్డు కొరకు ?

.. ....... .......
దుడ్డు : డబ్బు

Unknown చెప్పారు...

శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

శాస్త్రముల పఠించి శాకహారమెగోరు
బ్రాహ్మణుండు ;మాంస భక్షకుండు
మాంస మొకటెకాక మత్స్యములను గూడ
నారగించ నెపుడు గోరుచుండు

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

కుంభసంభవుండు గురుభూధరాతిశ
యాపహార్యగస్త్యు డసురుని యజ
వేష ధారిని తినె విప్రవరుండన
బ్రాహ్మణుండు మాంసభక్షకుండు.

subbarao చెప్పారు...

యజ్ఞ యాగ ములను విజ్ఞత గా జేయు
బ్రాహ్మణుండు ,మాంస భక్ష కుండు
బ్రాహ్మ ణే త రుడగు పార్ధ సారధి గారు
మాంస భక్ష ణ మ్ము మంచి గాదు

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

విందు భోజనంపు విస్తృత యేర్పాట్ల
నన్ని రకముల నుంచి యాదరించ
హాజరైరి యచట నాజన్మ మిత్రులౌ
బ్రాహ్మణుండు, మాంస భక్షకుండు

కంది శంకరయ్య చెప్పారు...

గుండు మధుసూదన్ గారూ,
మీ నాయి బ్రాహ్మణుని పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
కామాతో సమస్యకు చక్కని పరిష్కారం చూపించారు. మంచి పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు కామేశ్వరరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

భూసారపు నర్సయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Unknown చెప్పారు...

మిత్రులు సహదేవుడుగారూ.. రెండవపాదములో టైపు పొరపాటుజరిగింది గమనించవలసినదిగా కోరుచున్నాను.

gurumoorthy చెప్పారు...

*గు రు మూ ర్తి ఆ చా రి *
.... ....................., .

' బోర్డు ' చూ డ. ఉడిపి భోజనాలయ మట.
దాని ' ఓన ' రేమొ కానె కాదు --
బ్రాహ్మణు౦డు ; మా౦స భక్షకు౦డు గద. ఛీ !
దొ౦గ వేస. మేల. దుడ్డు కొరకు ?

.. ....... .......
దుడ్డు : డబ్బు

Unknown చెప్పారు...

అందరికి నంస్కారములు.
బ్రహ్మతత్వమెరుగు; ప్రజలమేలునుగోరు
బ్రాహ్మణుండు;మాంసభక్షకుండు
రాచబిడ్డ;తాను రాజ్యమ్మునేలుచు
ప్రజలబాగుకొరకు పాటుబడును.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
A.Satyanarayana Reddy చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
A.Satyanarayana Reddy చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
A.Satyanarayana Reddy చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

బ్రాహ్మణుండు మాంస భక్షకుండై పోయె
బ్రాహ్మనత్వమ కడు భార మంచు
నీట గలిపి మంచి నియమమాచారముల్
కులము నుండి వాడు తొలిగి పోయె

కంది శంకరయ్య చెప్పారు...

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భూమిసురుడు + అన్న' అన్నప్పుడు యడాగమం రాదు. 'భూమిసురు డటన్న' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Unknown చెప్పారు...

.నీతినిష్ట లందునియమాల యందుండు
బ్రాహ్మణుండు |మాంస బక్షకుండు
జంతుబలులు గోరు కంతులయందున
నాల్క రుచుల కొరకు నాగరికుడు.{శైలజ గారికి వందనచందనాలతోవిన్నపము
మాంస బక్షణ విశ్వ బ్రాహ్మణులుచేయరు .స్వతహాగాశాఖా హారులు అన్నిజాతులు
అవగాహన లేక నేర్చుటవలన కొందరి అనుకరణ అందరికివర్తించదని మనవి పూరణ
కొరకు మీఆలోచనకొంత సబబుగాదని నావిన్నపము}

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

నరసయ్యగారికి ధన్యవాదములు తెలుపుకొంటూ సవరించిన పద్యం:
విందు భోజనంపు విస్తృత యేర్పాట్ల
నన్ని రకములుంచి యాదరించ
హాజరైరి యచట నాజన్మ మిత్రులౌ
బ్రాహ్మణుండు, మాంస భక్షకుండు

కంది శంకరయ్య చెప్పారు...

సహదేవుడు గారూ,
విస్తృత యేర్పాట్లు.... అని సమాసం చేయరాదు. 'విరివిగా నేర్పాట్లు' అందామా?

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
విందు భోజనంపు విరివిగా నేర్పాట్లు
నన్ని రకములుంచి యాదరించ
హాజరైరి యచట నాజన్మ మిత్రులౌ
బ్రాహ్మణుండు, మాంస భక్షకుండు