25, నవంబర్ 2015, బుధవారం

సమస్య - 1865 (కఠినచిత్తులు గద...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కఠినచిత్తులు గద కన్నవారు.

40 కామెంట్‌లు:

  1. పదునెనిమిది నెలలు పైబడినంతనే
    తెండు మాకడ కని తెఱువ బడులు
    పంపుచుండి రకట పసిబాలలనుఁ గన
    కఠినచిత్తులు గద కన్నవారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఊకదంపుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నిజమే... ఇప్పుడు వాడవాడలా ప్రీస్కూల్ అనీ, ప్లేస్కూల్ అనీ (బేబీ సిట్టర్ అనీ) రకరకాల పేర్లతో శిశువులను చేర్చుకుంటున్నారు.

      తొలగించండి
  2. గురువు గారికి నమస్కారములు.....నాన్న గారి ఆరోగ్యమెలా వుంది? కోలుకుంటారు.... గాబరా వద్దండి.

    అత్తారింటి ఆరళ్ళకు బాధపడుతున్న ఒక అమ్మాయి ఆవేదనగా ఊహించి చేసిన పూరణము

    పెండ్లి జేయుటొ కటె పెనుభార మని యెంచి
    కాసులిచ్చి వరుని కాళ్ళు గడిగి
    మర్మమెరుగ నట్టి మగని తో పంపేరు
    కఠిన చిత్తులు గద కన్న వారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      ధన్యవాదాలు. నాన్నగారి ఆరోగ్యం అలాగే ఉంది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. కన్న ప్రేగు మమత కనలేరు తలిదండ్రి
      జన్మనిచ్చి తమను సాకి పెంచ
      ముదిమిజేరునాడు ముసలింట జేర్తురు
      కఠిన చిత్తులు గద కన్న, వారు?

      తొలగించండి
    2. shashima.with.ekalamu గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మొన్న కూడా మీ రేదో పూరణ చేసినట్టున్నారు. నాన్నగారితో హాస్పిటల్లో ఉండి అప్పుడు వ్యాఖ్యానించలేదు. మిమ్మల్ని ఏమని సంబోధించాలి?
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. గురువు గారూ, ధన్యవాదాలు నమస్కృతులు.
      నాన్పగారికి త్వరగా స్వస్థత చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
      నా పేరు శశికాంత్ మల్లప్ప నా ప్రొఫైల్ నామధేయం శశి మధురిమకు సంక్షిప్త రూపంగా పెట్టానేమో గుర్తులేదు.
      పిమ్మట బ్లాగర్ దర్శించింది నామమాత్రం.
      ఈ మధ్య తమ్ముడు రవికాంత్ మల్లప్ప మీ బ్లాగు లో పద్యాలు పూరించగా చూసి నేనునూ ప్రచురించ మొదలిడితిని
      శంకరాభరణం బ్లాగు సభ్యులందరుకు నమస్కృతులు

      తొలగించండి
    4. శశికాంత్ మల్లప్ప గారు స్వాగతము. వందనములు..

      తొలగించండి
    5. శశికాంత్ మల్లప్ప గారూ,
      ధన్యవాదాలు, స్వస్తి!

      తొలగించండి
    6. శశికాంత్ మల్లప్ప గారికి హృదయపూర్వక స్వాగతం

      తొలగించండి
  4. పుస్తె ముడిని వేసె పురుషో త్తముండని
    గుడ్డి గాను బంపు గొఱ్ఱె వోలె
    కటిక వాని వెంట కట్నకా నుకలిచ్చి
    కఠిన చిత్తులు గద కన్న వారు

    రిప్లయితొలగించండి
  5. చిత్త మందు ప్రేమ చిగురించు వారికే
    యలుక కలుగు గాదె యలమటింతు
    రు పితృవరులు గొట్టి త్రోవ దప్పుసుతులఁ
    గఠిన చిత్తులు గద కన్నవారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గురూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. కొంతమంది ఈ మధ్య పసికందులను కని చెత్తకుప్పల్లో పారవేసిన సంఘటనల ఆధారంగా,

    బాధ్యతలను మరిచి భయమన్నది విడిచి
    బరితెగించిదిరిగి ప్రసవమొంది
    పారవేసిరంట పసిబిడ్డలను యెంత
    కఠినచిత్తులు గద కన్నవారు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవికాంత్ మల్లప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బిడ్డలను + ఎంత ' అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ' పసిబిడ్డలఁ దామెంత... ' అనండి.

      తొలగించండి
  7. కన్నబిడ్డ భవిత కడు మిన్నగానుండ
    కోరుకొందు రిలను కూర్మితోడ
    దాచి వుంతు రెల్ల తమవారికే కారు
    కఠినచిత్తులు గద కన్నవారు.
    2.కలిమి లేము లందు కలతలు బడనీక
    సంతు మేలుకోరి సంతసమును
    యొసగ తపన బడుచు యూరక తిట్టిన
    కఠిన చిత్తులు గద కన్నవారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పద్యంలో 'సంతసమ్ము | నొసగ తపన బడుచు నూరక తిట్టిన' అనండి.

      తొలగించండి

  8. *గు రు మూ ర్తి ఆ చా రి *
    ............................

    కఠిన చిత్తులు గద >> కన్న. వారు గడి౦చి
    నట్టి ధనము దుర్ వ్యయ౦ బొనర్చి ,
    వారి కన్న. మిడక , బయటికి గె౦టెడు
    వా రు || వారి కన్న. పసులు మేలు ! !



    ి

    రిప్లయితొలగించండి
  9. ఆడ పిల్ల బుట్ట నాసుపత్రి దరిన
    కుప్ప తొట్టి లోన కూలవేసి
    యింటి లక్ష్ముల నిల హింసల పాల్జేయు
    కఠిన చిత్తులు గద కన్నవారు !!!

    రిప్లయితొలగించండి
  10. ముర్రుపాలిడరేల?మురిపాలురావమ్మ
    -----కఠిన చిత్తులుగద కన్నవారు
    నడకనేర్వక –బడివిడువక బంపెడి
    ----కఠినచిత్తులుగద కన్నవారు
    తల్లిదండ్రి మమత తగులక పెళ్లిళ్ళు|
    -----కఠిన చిత్తులుగద కన్నవారు
    తరుగని యాశచే తర్కంబు బెంచెడి
    -----కఠినచిత్తులుగద కన్నవారు
    ప్రేమగనలేక పరకన్య ప్రేమబంచ
    జంటదొరుకగ తలిదండ్రి వెంటరాక
    పెళ్లిజరిగిన వెతలేల పెద్దవారె
    కఠిన చిత్తులుగద కన్నవారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ సీసపద్యం బాగున్నది. అభినందనలు.
      ఎత్తుగీతిని తేటగీతిగా వ్రాసారు. సమస్య పాదం ఆటవెలది.

      తొలగించండి
  11. జన్మనిచ్చినట్టి జననీ జనకులే
    పెంచు ప్రేమలోన భేదముంచి
    ముద్దులోకరి కిచ్చి గుద్దులొకరికీయ
    కఠినచిత్తులు గద కన్నవారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదం చివర గణదోషం.

      తొలగించండి
  12. .చదువుకొనెడి వేళ ,సంస్కార మందున
    వ్యసన బాధలన్ని వాలినపుడు
    మంచి బెంచబూని –వంచన మాన్పగ
    కఠిన చిత్తులుగద కన్నవారు

    రిప్లయితొలగించండి
  13. తల్లిదండ్రి గూర్చి తలచని తనయులు
    కఠిన చిత్తులు గద , కన్న వారు
    పండు జీవిత గుది బండ లనుచు నెంచి
    యింటినుండి నేడు గెంటు చుం డ్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘జీవిత గుడిబండ’ అని సమాసం చేయరాదు. ‘పండు బ్రతుకున గుదిబండ...’ అనండి.

      తొలగించండి
  14. అర్ధమును గడించ నద్దె గర్భమునకు
    నిచ్చగించి బిడ్డ నిచ్చి వదలి
    పరుల వోలె ధరణి బ్రతికెడు వారలు
    కఠినచిత్తులు గద కన్నవారు.

    రిప్లయితొలగించండి
  15. గురువుగారికి నమస్కారం. నా ఈ క్రింది పూరణ గమనించి తప్పులు సరిచేయగలరు. నాన్నగారి ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని ఆశిస్తున్నాను.

    ఆ.వె: తనువు నిచ్చి పెంచు తల్లియె నల్లము
    నడక నడత నేర్పు నాన్న విషమై
    వయసు మీరు వారు బరువని విడచిరి
    కఠినచిత్తులు గద, కన్నవారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేదుల సుభద్ర గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తల్లియె యల్లము... నాన్న విషమె’ అనండి.

      తొలగించండి
  16. కేజి క్లాసు లనిన పీజీలు గానెంచి
    పసిడి మనసు లందు పట్టు పట్టి
    విద్య నేర్పు బడుల విధమును మెచ్చెడు
    కఠిన చిత్తులు గద కన్నవారు.

    పాలు మరువ నట్టి పసిబాలురను దెచ్చి
    పాఠశాలలోన పాశవికముగ
    బాల్యమును హరించి బంధిసే యుచునుంద్రు
    కఠిన చిత్తులుగద కన్నవారు

    రిప్లయితొలగించండి
  17. మా వాచ్మన్ సంసారం:

    అమ్మ పెట్టదింత అడుగ నీయదు ముష్టి
    నాన్న తాగి తన్నె నిన్న నేడు
    కరుణ లేదు సుంత కన్నీరు మున్నీరు
    కఠినచిత్తులు గద కన్నవారు

    రిప్లయితొలగించండి