18, నవంబర్ 2015, బుధవారం

పద్యరచన - 1067

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

26 కామెంట్‌లు:

  1. నామము పెట్టి పరులకెగ
    నామము పెట్టంగ దలచి నావో! బాలా!
    నీ ముద్దు మోము గాంచిన
    నేమాత్రము శంక కలుగ నేరదు కదరా!

    రిప్లయితొలగించండి
  2. అందము చిందులు వేయుచు
    సందడి చేయగను నీవు సంధ్యను వార్చన్
    చందన నామము నుదుటను
    జందెము వలెగళ మందు జపమాల యటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      చివరిపాదంలో గణదోషం. ‘జందెము వలె గళమునందు...’ అనండి.

      తొలగించండి
    2. అందము చిందులు వేయుచు
      సందడి చేయగను నీవు సంధ్యను వార్చన్
      చందన నామము నుదుటను
      జందెము వలెగళ మునందు జపమాల యటన్

      తొలగించండి
  3. 1.తొందరెందుకయ్య తుంటరి బాలుడా
    సమయ మిపుడు గాదు సంధ్య వార్చ
    ఉపనయనము పిదప నొదలుము యర్ఘ్యము
    కర్మసాక్షి కీవు కాంక్ష తోడ

    2.సంప్రదాయములను చంటివారికి నేర్ప
    భావి తరము లెల్ల బాగు పడును
    మనదు సంస్కృతులను మనమె రక్షించిన
    హర్షచిత్తు డగుచు హరియు మెచ్చు.
    3.చిఱుత నగవు తోడ చిందులు వేయుచు
    మూడు నామములను ముచ్చటగను
    నుదుట నుంచి బోసినవ్వులు రువ్వేటి
    ముద్దు పాపని గన మోహ మయ్యె/ముద్దు హెచ్చె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పద్యంలో ‘ఒదలుము’ అనడం గ్రామ్యం. ‘ఉపనయనము పిదప నొనర నర్ఘ్య మిడుము’ అనండి.
      రెండవ పద్యంలో ‘మనదు’ సాధుప్రయోగం కాదు. ‘మన సుసంస్కృతులను’ అనండి.
      మూడవపద్యం మూడవపాదంలో యతి తప్పింది. ‘నుదుట నుంచి రువ్వెనుర బోసినవ్వులు’ అందామా?

      తొలగించండి
  4. మిత్రులందఱకు నమస్సులు!

    భూసురుం డాయెఁ బాపఁడు భాసురముగ!
    మంత్ర మర్థమ్ము కాని సంభాషణముల
    నే పురోహిత వృత్తిని నెఱపఁగానొ
    వేచియుండె నమాయిక వేషమునను!

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులు!

    నిన్నటి దిన మింటియందు విద్యుదాటంకమును, నంతర్జాలావరోధమును నన్ను నిరోధింపఁగ నాలస్యముగ నా పద్యమునుం బ్రకటింపఁగలిగినందులకు మన్నింపుఁడని వేడుకొనుచు...

    నేనొక పూలమొక్క కడ నిల్చి, సుమాలనుఁ జేరు తుమ్మెదల్
    తేనియ లానుటల్ గనఁగఁ, దేఁటి యదొక్కతె పల్కె "నో కవీ!
    వీనుల విందొనర్చు మము వెక్కసమైన కుతూహలమ్ముతోఁ
    గానఁగ నేలొకో? మది వికారమగున్ మము బోంట్ల తేంట్ల దుః
    ఖానుభవానురూప యుత గాథలు! నిత్యము భుక్తి కోసమై
    గాన మొనర్చుచున్ వెతలఁ గాంచుచుఁ బూవుల తేనెఁ గూర్చఁగన్
    మేనులు డస్సిపోయెను! నిమేషము కూడ విరామ మెద్ది? యీ
    దీనులఁ జూచి మీ కవులు తేనెలు చిందెడి కావ్యమందు స
    మ్మానిత గానకోవిదుల మంచును, వేలుగఁ బేర్లు పెట్టి, మా
    మేనిని నున్న నల్లఁదన మెంతటి యంద మటంచుఁ బల్కి, మీ
    మానసమందు సంతసము మంజు మనోహర మౌనటుల్ భళా
    న్యూనత లేక సెప్పెదరు నొవ్వును నెవ్వరుఁ జూడ రియ్యెడన్!
    మానవు లిద్ది కానకయె మా నవ రూప వికాస సౌష్ఠవ
    మ్మౌనని కావ్యమందుఁ బరమాద్భుత రీతినిఁ గూర్తు రేల? స
    న్మానము లందునట్లు బహుమాన్యము లిచ్చుట లేలకో కవీ?
    కానము మేము! మమ్ముఁ బొడఁగాంచక పొమ్మిట నుండి వేగమే!
    మేనిఁ గలట్టి శోభఁ దలమే యిట వర్ణన సేయ మీకు! మా
    మానసమందు క్షోభఁ దరమా యిఁక వర్ణన సేయ మీకు? మ
    మ్మీ నవలోక కర్తలుగ నెప్పుడు భావన సేయకుండఁగన్
    మేనిని వంచి మ్రొక్కెదము మిక్కిలిగన్ దయచేసి పొమ్ము! మే
    మీ ననలున్ బ్రియుల్ ప్రియల మెప్పుడుఁ గా మయ! భోజనానికై
    మానితమౌ గమమ్ముల సమంచిత రీతులఁ బూవుఁబోండ్ల పూఁ
    దేనియ బొట్లుబొట్లుగను తీపిరుచుల్ గ్రహియింప నెట్టులో
    వాని ముఖస్థ చుంబన సువాసనఁ గ్రోలెదమయ్య మేమిఁకన్!
    గాన, మమున్ హసింపక, సుఖాలనుఁ గ్రోలుచు నుంటిమంచు మీ
    రే నవకావ్యమున్ వెలయనే వల దింకను మానుఁ" డంచనన్
    నేనును దాని మాటలను నెమ్మదిఁ దాలిచి నింటి కేఁగితిన్
    దేనెల సోనలన్ గుఱియు తేఁటి గముల్ మదిలోన నాడఁగన్!!

    రిప్లయితొలగించండి
  6. ఏమందును బాలక నిను
    వామనునిగ దోచినావు వార్చుచు సంధ్యన్
    మామనసుల దోచితివిక
    నా మాతయె నీకు జ్ఞానమందించునుగా !

    రిప్లయితొలగించండి
  7. ఉద్దరిణి చేత బట్టుకు
    బుద్ధిగ నాసీనుడైన బుడుతను గనరే
    ముద్దుల మోమున సొంపుగ
    దిద్దిన నామమ్ము తోడ దీపిలు చుండెన్!!!

    రిప్లయితొలగించండి
  8. బాలశివుడవనుకొన్నను
    ఫాలమ్మున నామమట్లు పలకదు రామా?
    బాలరఘురాము డనుకొనఁ
    బోలదు నీ దేహమట్లు భువనేశ్వరుడా?

    రిప్లయితొలగించండి
  9. సంధ్యా వందన బాలా
    నింధ్యుడు వామన నిభుండు నింకను చదువుల్
    సంధ్యల చిక్కడు జూడగ
    వింధ్యా పర్వత నివాస విబుధుండేమో

    రిప్లయితొలగించండి
  10. విష్ణు బూజించు వారిని వైష్ణవులుగ
    బరిగ ణిo తురు గద మఱి బాలు డచట
    మూడు నామాల తోడన ముద్దు లొలుకు
    చుండె జూ డుడా చిత్రము సూరి !మఱియు
    వార్చు చుండెను సంధ్యను బాగు గాను

    రిప్లయితొలగించండి
  11. సంధ్య వార్చగలేని-సాహసవంతుల
    ----బుద్దిని మాన్పు ప్రబుద్దుడీవె|
    కట్టుబొట్టును మాను-కలియుగవాసుల
    ------పట్టును మాన్పగ చట్టమీవె
    కంఠహారము నందు –కమనీయ రుద్రాక్ష
    -----మహిమను బంచెడి మాన్యుడీవె|
    గంట,నుద్దరణి ప్రకంపనలను బంచి
    -----పరమాత్మ తత్వపు బాలుడీవె|
    నేటిబాలుడే రేపటి నీతిపరుడు|
    భక్తి భావాలుపురిగొల్పు యుక్తిపరుడు.
    యూహ కందగజేసెడి మోహపరుడు.
    ముద్దు మోమును గన సమ్మోహుడీవె|
    2.నవ్వెడి మోముకు నామాలు దిద్దంగ
    ----చిలిపిగ గనుపించు చిన్ని కృష్ణ|
    రుద్రాక్ష మాలయే రూపంబు నన్ జేర
    -----శివునిగా గనిపించు చిన్నిబాల|
    సంధ్యవందనమెంచు –సాధు పుంగవుడవ?
    -----భగవంతు నెంచెడి –బ్రహ్మ పుత్ర|
    కలికాల మందున విలువలు దెలియక
    ----------సంస్కరణంబులు సాకుబాల|
    బాల్య యవ్వన వృద్దుల పనులు జరుగు
    నవ్వు రువ్వంగ|”భక్తుల నటనగాక
    కల్మషాలనుగాంచని కలిమిబలిమి
    కానుపించునుబాలకా కళలవిందు|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      నిన్న ప్రయాణంలో ఉండి వెంటనే స్పందించనందుకు మన్నించండి.
      మీ రెండు సీసపద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. బాలభానునిఁబోలెడు బాలకుండు
    నిలువుబొట్టునిడి నుదుట నీటుగాను
    జపపు మాలను ధరియించి తపన తోడ
    సంధ్య వార్చ నడరుచుండె సంతసముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  13. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ..................................

    ఫాలమున పు౦డ్రముల దిద్ది ప౦చ. కట్టె ,
    యె౦త నిష్ఠా గరిష్ఠు౦డయి , కా౦తు లెసగ
    చిన్ని బాలుడు కనిపి౦చు చున్నవాడొ !
    పువు పరీమళి౦చును తాను పుట్ట గా నె !

    రిప్లయితొలగించండి