30, నవంబర్ 2015, సోమవారం

సమస్య - 1870 (మావిచిగురుఁ దినెను....)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ... 
మావిచిగురుఁ దినెను మధుకరమ్ము
(మా నాన్నగారి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నది. దినదినగండంగా గడుస్తున్నది. రోజంతా హాస్పిటల్ లోనే ఉంటున్నాను. అందువల్ల మీ పూరణలను, పద్యాలను నిశితంగా పరిశీలించలేకపోతున్నాను)


19 కామెంట్‌లు:

  1. శంకరయ్య గురుదేవులకు మీకు పితృ వియోగము కలిగినండుకు చి౦ తిస్తున్నాను నా సంవేదన, సహానుభూతి మీతండ్రి గారు పుణ్యాత్ములు కార్తీక సోమవారమునాడు శివసాయుజ్యము చెందారు పునర్భవము లేదు.వారికి నాస్రద్దాంజలి ఘటిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. సమస్య
    గు రు మూ ర్తి ఆ చా రి ి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    శ్రీ క౦ది శ౦కరయ్య గారికి మరియు
    శ్రీ మిస్సన్న గారికి ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  3. గురువుగారూ మీ కు కలిగిన పితృ వియోగమునకు చింతిస్తున్నాను. మీ తండ్రిగారు ధన్యులు....పరిపూర్ణ జీవితాన్ని ఆస్వాదించారు. మీ లాంటి ఉత్తములైన కుమారున్ని పొందారు. కార్తీక సోమవారము రోజున శివసాయుజ్యమొందారు.... వారు ఇక లేరనే బాధ మాత్రమే మీకు మిగిలింది.
    జాతస్యహి ధృవో మృత్యుః అన్న విషయం తెలియని దెవరికి అయినప్పటికీ

    జాహ్నవనెడు నదియు జన్మనిచ్చిన తండ్రి
    జనన మొంది నట్టి జన్మభూమి
    జనని మరియు జూడ జగదీశ్వరుండును
    ఉర్వి లోన మారు నుండ వవియు.

    మీకు మీ కుటుంబ సభ్యులెల్లరులకు నా ప్రగాఢ సానుభూతి ని తెలియజేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. కార్తీక సోమవారము పుణ్య దినమున స్వర్గస్థులైన మీ తండ్రి గారు పుణ్యాత్ములు. పరిపూర్ణ జీవితాన్ననుభవించి మానవ కర్తవ్యాలన్నీ పూర్తి చేసి దివంగతు లైనారు. పితృవియోగము భరింప రానిదే. మీరు ధైర్యము వహించి మీ కుటుంబ సభ్యులకు ధైర్యము చెప్పాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

    జననీ జనకుల పదములు
    వనజ భవాంఛిత పవిత్ర పాద సదృశముల్
    అనవర తారాధ్యార్హ క
    మనీయ కోమల కుసుమ సమానమ్ము లిలన్

    రిప్లయితొలగించండి
  5. గౌరవీయులగుశ్రీ కందిశంకరయ్యగురువర్యులకు తండ్రి వియోగముభరించ లేనిదే దైవాజ్ఞ|
    భరించలేని బాధాకరమే మీకు మీకుటుంబసభ్యులకునాయొక్క ప్రగాడసానుభూతిని తెలుపుకుంటున్నాను

    రిప్లయితొలగించండి
  6. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    కార్తీక సోమవారము శివైక్య మ౦దిన
    మీ పితృ దేవులకు ఆత్మ శా౦తి
    కలుగాలని కోరు కొను చున్నాను

    రిప్లయితొలగించండి
  7. కోయిలమ్మ తుష్టి కొమ్మపై కూర్చుండి
    మావిచిగురు దినెను , మధుకరమ్ము
    ముదమున గొనుచుండె పుష్పరసము తాను
    ప్రకృతి దృశ్యము కడు పరవశమిడె zee

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. తిక్త మావి చిగురు తినెను కోయిల పంచ
    మస్వరమున కూసె మధురముగను
    తీపి తినిన యింట తీయును గోతులు
    మానవుండు మేలు మరచువాడు

    రిప్లయితొలగించండి
  10. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    కార్తీక సోమవారము శివైక్య మ౦దిన
    మీ పితృ దేవులకు ఆత్మ శా౦తి
    కలుగాలని కోరు కొను చున్నాను

    రిప్లయితొలగించండి
  11. కోయిలమ్మ చూడు కొమ్మ మీదనయుండి
    మావిచివురుదినెను , మధుకరమ్ము
    చక్కగానుగ్రోలె చిక్కని తేనెను
    పూల పైన వ్రాలి పూజ! యచట

    రిప్లయితొలగించండి
  12. నమస్కారములు
    ఇప్పుడే చూసాను . నాన్నగారి ఆత్మకు శాంతి చేకూరాలని , భగవంతుని వేడుతూ .అక్క

    రిప్లయితొలగించండి
  13. చైత్ర మిపుడు మావి చిగురించె కోయిల
    మావిచిగురుఁ దినెను, మధుకరమ్ము
    పూవు పూవు దిరిగి పూదేనె గ్రోలెను
    పరవ సించె బ్రకృతి ప్రమద మొప్ప.

    రిప్లయితొలగించండి
  14. ” కదలనట్టి కొమ్మకున్నగానకోయిలమ్మ తా
    మదన మావిచిగురుదినెను”|మధుకరమ్ము చింతతో
    కదులుచున్న మల్లెపూల కామవాంచ దీర్చగా?
    అదునుజూచినాట లాడె నాశపాశమందునే|

    రిప్లయితొలగించండి
  15. కవిమిత్రులారా,
    ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మా నాన్నగారి దహన సంస్కారం పూర్తి అయింది. నాన్నగారికి పుణ్యగతులు లభించాలని ఆకాంక్షిస్తూ సానుభూతిని తెలిపిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    మీ తండ్రి గారి మరణ వార్త అత్యంత దు:ఖమయం .
    వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శోక తప్త హృదయంతో
    మీకు సానుభూతి నంద జేస్తున్నాను .

    రిప్లయితొలగించండి
  17. ఆమని యరుదెంచె అవనిలో,పికమట
    మావి చిగురు దినెను;మధుకరమ్ము
    మరులు గొనుచు విరుల మధువును గ్రోలంగ
    పరవశమ్ము నొందె ప్రకృతి యెల్ల.

    రిప్లయితొలగించండి
  18. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికిం గలిగిన పితృవియోగమునకుఁ జింతించుచు వారికి నా ప్రగాఢ సానుభూతిఁ దెలియఁజేయుచున్నాను. వారి తండ్రిగారు కీ.శే. శ్రీ కంది వీరస్వామి గారి యాత్మ కా భగవంతుఁడు శాంతిని జేకూర్చుఁగాక!

    పదియు నొక్కండ్రు సంతాన బలిమిచేత
    వాసిఁ గనిన వీరస్వామి పఱగ దివికి
    నేఁగె! ఋణము సెల్లెను గాన నేఁగెఁ గాదె!
    వారి యాత్మయె శాంతినిఁ బడయుఁ గాత!!

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  19. గురువు గారూ,
    మీ తండ్రి గారికి ఉత్తమగతులు కలగాలని ప్రార్ధిస్తున్నాను
    మీకు కలిగిన లోటు మాటలకందనిది...
    ధైర్యముగా ఉండండి.

    రిప్లయితొలగించండి