6, నవంబర్ 2015, శుక్రవారం

సమస్య - 1847 (ముండా యని పిలువుమనుచు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ముండా యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు. 

37 కామెంట్‌లు:


  1. శ్రీగురుభ్యోనమః

    అండగ నిలచుచు బ్రోచును
    కొండొకచో భయము కలిగి కోరి బజింపన్
    దండము లిడుచున్ "శ్రీరా
    ముండా" యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్.

    కాశీ యాత్రలో ఉన్న గురువుగారికి శుభాభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      ధన్యవాదాలు.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. దండుగ మోసపు జగతిని
    మండెడు యవినీతి నిదుర మత్తున మునుగన్
    కుండల సారాయె దొరకు య
    ముండా యనిపిలువు మనుచు ముదితయె జెప్పెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. 'సారా దొరకు య....' అనండి.

      తొలగించండి
  3. అండను గోరుచు నిత్యము
    భండుల పరిమార్చు శివకు భక్తిగ నెపుడున్
    దండములిడి గొల్చుచు చా
    ముండా యని పిలువ మనుచు ముదితయె జెప్పెన్!!!

    రిప్లయితొలగించండి
  4. ఓ అభాగ్యురాలి ఆవేదన:

    దుండగుని శీల చోరుని
    దండించిన నేరమనుచు దండన లేలా?
    చండుని జంపితినని చా
    ముండా! యని పిలువమనుచు ముదితయె జెప్పెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి సమస్యకు నా సవరించిన పద్యము తిలకించగోర్తాను.

    మాటునఁ గపిఁ జంప మర్యాద కాదయా
    రామ యనిన నోరు ఱాతిరోలు.
    మాటున మృగ హింస మర్యాద నిక్కంబు
    స్వానుజసతి హారి వాలి కాదె
    [నా రామచంద్ర శతకమందలి పద్యము:
    మాటున మృగ హింస మర్యాద నిక్కంబు
    స్వానుజసతి హారి వాలి ధర్మ
    హీనుని విదళింపఁ హీనమనదగునే
    రాగ దయ్య బ్రోవ రామ చంద్ర]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ సవరించిన పూరణ, స్వీయ శతక పద్యం బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. కుండను వ్రక్క లొనర్చిరి
    భండనమున మగడుజచ్చె పడపడి నాకున్
    ముండన జేసిరి శిర మిక
    ముండా! యని పిలువమనుచు ముదితయె జెప్పెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. కుండను వ్రక్క లొనర్చిరి
    భండనమున మగడుజచ్చె పడపడి నాకున్
    ముండన జేసిరి శిర మిక
    ముండా! యని పిలువమనుచు ముదితయె జెప్పెన్!

    రిప్లయితొలగించండి
  8. దండన భయమున భండన
    గండరగండడ తిరయముగ నరిగె నాసూ
    నుండ తనిని వేగమ సో
    ముండా యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దండన భయమున బండడు
      గండరగండడ తిరయముగ నరిగె నాసూ
      నుండ తనిని వేగమ సో
      ముండా యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. గురువు గారికి నమస్సుమాంజలులు మీ ప్రయాణము సుఖమై సుఫలమై దిగ్విజయముగా కొనసాగు చున్నందులకు సంతోషము...మీ యాత్రా విశేషములను త్వరలోనే మాకు పంచగలరని భావిస్తున్నాను...మీరు యాత్రాసమయంలో ప్రసిద్ధ క్షేత్రములలో దిగిన ఫోటోలని ముఖచిత్రమున నుంచగలరని కోరుతున్నాను

    చండీ చాముండేశ్వరి
    కొండల రాయని తనయకు కోపంబొచ్చెన్
    చండీ యనకుడి నను చా
    ముండాయని పిలువు మనుచు ముదితయె చెప్పెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇక నా యాత్ర సాఫీగా కొనసాగుతున్నది. విచారించవలసిన విషయం ఏమంటే ఈ ఉదయం నా ఆండ్రాయిడ్ ఫోన్ నుండి ఫోటోలు వీడియోలు డిలీట్ అయ్యాయి. వాటిని రికవర్ చేయడ మెలాగో తెలియదు. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మిత్రులు ఎవరైనా సలహా ఇస్తే బాగుంటుంది.

      తొలగించండి
    2. వాటంతట నవే డిలేటవుతే తిరిగి వాటికవే మళ్ళీ ప్రత్యక్షమవుతాయనుకుంటాను చూడండి ఉదయం కల్లా వచ్చేస్తాయి

      తొలగించండి
  10. మెండుగ సంపదలున్నను
    దండిగ ధనముండినను యిల తన బంధువులన్
    నిండుగ మరువక శ్రీచా
    ముండా యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్.
    2.అండను గోరుచు వేసవి
    యెండ సమయమున చరించు యేకాకియు,పాం
    థుండగు యనాథుఁ శ్రీ రా
    ముండా యని పిలువుమనుచు ముదితయె చెప్పెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. 'దండిగ ధనముండిన నిల దన బంధువులన్' అనండి.
      రెండవ పూరణలో అనాథు తర్వాత అరసున్న అవసరం లేదు.

      తొలగించండి
  11. పెండిలి కోరిన యు వకుని
    గూండా గిరి విడచిపెట్టి కూరిమి తోడన్
    మెండగు భక్తి సతము రా
    ముండా యని పిలువు మనుచుము దితయె చెప్పెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. అండాళూ ! వింటివ యిది
    ముండా యనిబిలువమనుచు ముదితయె చెప్పెన్
    ముండాపదమదిపలుకుట
    రండలకేజెల్లుగాని రాదది మనకున్

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ చివరి పాదంలో గణదోషం. కొడుకా+అభియాన్.... అన్నచోట నుగాగమం రాదు. 'కొండంతగ ధైర్య ముండు కొడుకా యనియెన్' అనండి.

      తొలగించండి

  14. గు రు మూ ర్తి ఆ చా రి
    .............................


    చ౦డ త్రిశూలమున నీ
    ము౦డము ఖ౦డి౦తు , మహిష ముష్కర. ! యీ చా
    ము౦డ యెదుట. నిలిచెదవె ? య
    ము౦డా యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్

    రిప్లయితొలగించండి
  15. మెండుగ నిన్నే దలచును
    అండగ నభిమానముంచి నానందముతో
    నిండగు జీవనమునఛా
    ముండా యని పిలువు మనుచు ముదితయు చెప్పెన్
    2.అండీయనిబిలువక చా
    ముండాయని పిలువుమనుచు ముదితయు చెప్పెన్
    అండగ నీప్రేముండగ
    కొండంతధైర్యముండు కొడుకా యనియెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      సవరించినందుకు సంతోషం. కానీ 'కొండంతగ ధైర్య....' అంటేనే గణదోషం తొలగిపోతుంది.

      తొలగించండి
  16. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    చండామార్కులు శిష్యుని
    దండిం చెడి రీతిగాక తగు ప్రేముడి తో
    నుండుడ నెడి మాతృక చా
    ముండా యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్.

    రిప్లయితొలగించండి
  17. చక్కని పూరణలు చేసిన మిత్రులందరికీ అభినందనలు.

    పండరి మీ పేరే గద
    పండూయని మిమ్మనెదను పతిదేవా ! నా
    కుండిన పేరేగా చా
    ముండా! యని పిలువమనుచు ముదితయె జెప్పెన్!

    రిప్లయితొలగించండి
  18. దండిగ హొయలొలికించుచు
    మెండుగ నాటకములాడి మేటిగ నీదౌ
    చండాలపు ప్రియురాలిని
    ముండా! యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్ 😊

    రిప్లయితొలగించండి
  19. ముదిత భర్తకు:

    పండుగ పూటను ప్రొద్దునె
    చండాలపు తిట్లు తిట్టు సైతానత్తన్
    దండిగ దొబ్బులు పెట్టుచు
    ముండా యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్

    రిప్లయితొలగించండి