సూర్యనారాయణ గారు తమ ఏకైక కుమారుడు ‘పవన్’ ఏదో వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పారు. అతడు అల్పాయుష్కుడన్న విషయం వారికి తెలుసు. మనసులో గూడుకట్టుకున్న విషాదంతో ఇంతకాలం ఎంత క్షోభను అనుభవించారో? గతమాసం ఆ అబ్బాయి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు కూడా. ఆ సందర్భంగా ఆ తండ్రి కుమారునికి ధైర్యం చెప్తూ వ్రాసిన పద్యం ఇది...
అన్నెము పున్నెమ్మెరుగని
నిన్నీ రోగమ్ము కదలనివ్వదు సుతుడా
నాన్నను నేనున్నానుర
కన్నా! నీకెప్పుడేమి కావలెనన్నన్.
ఇంతలోనే ఈ దుర్వార్త వినవలసి వచ్చింది. వారికి, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. భగవంతుడు పవన్ ఆత్మకు శాంతి చేకూర్చుగాక!
చంద్రమౌళి సూర్యనారాయణ గారి కుటుంబానికీ నా ప్రగాడ సానుభూతి తెలుపుతున్నాను.
రిప్లయితొలగించండిసూర్యనారాయణగారికి జరిగిన పుత్ర వియోగమునకు చింతించుచున్నాను.ఆతని ఆత్మకు శాంతి కలుగుగాక.
రిప్లయితొలగించండిచాలా బాధాకరమైన విషయం. వారికీ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారందరికీ తగు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారికి వారి సతీమణిగారికి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపములను తెలియజేస్తున్నాను. పవన్ ఆత్మ కు శాంతి జేకూర్చాలని భగవంతుని వేడు కొను చున్నాను. ఋణానుబంధము తీరగానే వెళ్లిపోయాడు. పుణ్యాత్ముడు.
రిప్లయితొలగించండిpavan atmaku shanti kalugu gaka!
రిప్లయితొలగించండిఋణాను బంధరూపేణ పతిపత్నీ సుతాలయః అని తెలిసినా
రిప్లయితొలగించండిమమతాను బంధము వియోగ దుఃఖము వర్ణనాతీతము.
.మీకు సంయమనాని ప్రసాదించ మని భగవంతుని ప్రార్ధి స్తున్నాను
చంద్రమౌళి సూర్యనారాయణ గారి కుటుంబానికీ నా ప్రగాడ సానుభూతి తెలుపుతున్నాను.
రిప్లయితొలగించండిమస్కులార్ డిస్ట్రొఫి తో బాధపడుతున్న పవన్ ను కంటికి రెప్పలా కాపాడుచూ తండ్రిగా తన బాధ్యతను ఎంతో ఓర్పుతో సూర్యనారాయణ గారు నిర్వర్తించారు. డ్యూటీ అయిపోయిన తరువాత తన పూర్తిసమయాన్ని కొడుకు కోసం వినియోగించే వారు. విసుగు కాని, బాధను కానీ ఎప్పుడూ ఎవ్వరితో పంచుకోలేదు. మిగిలిన సమయంలో పద్య రచన చేసేవారు. ఒక మంచి తండ్రికి అర్థాయుస్సు గల కొడుకు నిచ్చి భగవంతుడు పరీక్షించాడు. పవన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మిత్రుడు సూర్యనారాయణ గారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను.
రిప్లయితొలగించండిఇప్పుడే చూసాను . ఉదయం లేస్తూనే ఇంత చెడ్డవార్త విన్నందుకు బాధా కరంగా ఉంది. ఎంతో ప్రేమగా " అక్కా " అనిపిలిచే సోదరుని మనస్సు ఇంతగా గాయపడటం చాలా బాధగా ఉంది. చిరంజీవి ఆత్మకు శాంతికలగాలని , తమ్ముడూ ! మీరు తొందరగా ఈ బాధనుంచి తేరుకుని ధైర్యం గాఉండాలని భగవంతుని కోరుతూ . అక్క
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచక్కని పవన్ కి ఈ వ్యాధి ఏంటి ఇంత చిన్న వయసులో ఇలా జరగడం ఏంటి..చాలా బాధగా వుంది..చంద్రమౌళిసూర్యనారాయణగారికి, వారి కుటుంబానికి తట్టుకునే మానసిక ధైర్యం ఆ భగవంతుడు కల్గించాలని కోరుకుంటున్నాను..
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకు నా సంతాపమును తెలియజేస్తున్నాను.
రిప్లయితొలగించండిఅందరికీ ధన్యవాదములు...అంత్య క్రియలు అయిపోయాయి...త్వరలోనే మళ్ళీ మన బ్లాగ్ లో వ్రాయ గలుగుతానని అనుకొంటున్నా...నా జీవితపు పరీక్షా సమయంలో శంకరాభరణం లో పద్యరచన ద్వారా ఎంతో ఊరట కలిగింది..మాష్టారూ...ఎప్పటికీ బ్లాగ్ కి సెలవు ప్రకటించకండి...మీ వలన ఎంతమంది తమ సమస్యలనుండి ఊరట పొందుతున్నారో నేనే ఒక ఉదాహరణ
రిప్లయితొలగించండిసూర్యయనారాయణగారు పుత్రవియోగ దుఃఖోపశమనమును బొందుదురుగాక
రిప్లయితొలగించండిఅయ్యో చాలా దురదృష్టకరమైన సంఘటన. తల్లిదండ్రులకు పరమేశ్వరుడు శోకాన్ని అధిగమించగలిగే మనోనిబ్బరాన్ని ప్రసాదించవలసినదిగా కోరుకొంటున్నాను.
రిప్లయితొలగించండిపవన్ ఆత్మకు శాంతికలగాలని , కవిమిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణ గారి దంపతులకు మాకుటుంబము తరపున ప్రగాఢ సానుభూతి.
రిప్లయితొలగించండి