7, నవంబర్ 2015, శనివారం

పద్యరచన - 1057

కవిమిత్రులారా!
“కాలుని దున్నపోతు మెడ గంటలు...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

33 కామెంట్‌లు:

 1. కాలుని దున్నపోతు మెడ గంటలు ఖంగున మ్రోగినం తనే
  తేలును ప్రాణ వాయువులు దేవుడు బంపిన తేరులం దునన్
  కాలము దాపురిం చినది కాదన గోరుట సాధ్యమే రికిన్
  లౌల్యము లేటికిన్ మధుర లాలస జీవన భాగ్యమల్ గనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   చివరి పాదంలో ప్రాసదోషం. సవరించండి.

   తొలగించండి
  2. గురువులు క్షమిం చాలి సవరించిన పద్యము .
   ------------------------------------------
   కాలుని దున్నపోతు మెడ గంటలు ఖంగున మ్రోగి నంతనే
   తేలును ప్రాణ వాయువులు దేవుడు పంపిన తేరు లందునన్
   కాలము దాపురిం చినది కాదను గోరుట సాధ్య మేరికిన్
   లాలస లేటికిన్ మధుర రాగపు జీవన భాగ్యముల్ గనన్

   తొలగించండి
 2. కాలుని దున్నపోతు మెడగంటలు మ్రోగిన శబ్దమే గదా
  నేలను మానవాళి ఖలు నేరప్రవృత్తుల బెంచ నాజ్యమై
  కూలెను మానవత్వమను కోటలు హెచ్చుగ పెచ్చురిల్లుచున్
  న్నీలలు వేయుచున్నసుర సేనల వోలెను తీవ్రవాదమున్

  రిప్లయితొలగించండి
 3. కాలుని దున్నపోతు మెడగంటలు మ్రోగిన దాని యర్థమే
  కాలము దాపురించెనని , కాలయముండును బంపుచుండునా
  గేలమువంటి రజ్జునును.కాలముదీరెను నీకునింకనో
  బాలుడ! రమ్ముమా యిటకుపాపము బుణ్యము లెక్కజూతునే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   గాలము గేల మయింది.
   అయినా మనలాంటి వయస్సు మళ్ళిన వారికి కాకుండా 'బాలునికి' యముని పిలుపును వినిపిస్తే ఉచితంగా ఉంటుందా?

   తొలగించండి
 4. అర్థి సాత్కృతమెవని ద్రవ్యమ్ము కాదొ
  జగతి కాతండ వ్రేగునా దగును గాని
  అంబుధులు కావు, కావరణ్యములు, త్హున
  కనక శైలాధికంబులు కావు బరువు

  ప్రసిద్ధ కవి తుమ్మల సీతారామ్మూర్తి గారి పఱిగపంట లోనిదీ పద్యం. భావం విషయంలో కొంచెం సందేహం. తెలిసిన వారు వివరిస్తే చాలా సంతోషిస్తాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మీదేవి గారూ,
   ఎవని ధనం అర్థులకు స్వాధీనం చేయబడదో (ఎవడు తన ధనాన్ని పేదలకు దానం చేయడో) వాడే భూమికి బరువు అవుతాడు కాని సముద్రాలు, అడవులు, హిమాలయం, మేరుపర్వతం కావు.

   తొలగించండి
  2. సంతోషం గురువుగారు, ధన్యవాదాలు.
   ఈ విధంగానే అర్థం విన్నప్పటికీ నాకే కొంచెం సందేహం వచ్చింది.
   హిమాలయము, మేరు పర్వతం బరువనికాక భూధరాలని, భూమికి ఆధారాలని వర్ణింపబడతాయి కాబట్టి వాటి పోలిక తెస్తున్నారు కవి అంటే అవి కాదు ఆధారాలు, ఇతడు అని చెప్తున్నాడంటే మొదటిపాదానికి అర్థం ఇలా ఉంటుందని అనిపించింది. అర్థి సాత్కృతం =అర్థికి ఇవ్వబడినది , ఎవని ద్రవ్యమ్ము కాదో ఎవడు తిరిగి ఆశించడో అటువంటి వాడే గొప్ప దానశీలి. అతడే భూమికి ఆధారం కానీ, భూధరాలు కావు అని ఉండవచ్చా అని పించింది.
   నాది పొరబాటు ఊహ కావచ్చును. సందేహం తీర్చినందుకు ధన్యవాదాలు.
   పఱిగ పంట కావ్యవస్తువు ఏమిటో తెలియలేదు. నెట్ లో దొరకలేదు.

   తొలగించండి
  3. లక్ష్మీదేవి గారూ,
   భూమిని ధరించేది కనుక పర్వతాన్ని భూధర మన్నారు. కాని పద్యంలో సముద్రాలు, అడవుల ప్రస్తావన ఉంది. అవి భూమిని మోయడం లేదు కదా.
   ఈ సందర్భంగా నాకొక పాట గుర్తుకు వచ్చింది. "గిరికి ధరణి భారమా... ధరణికి గిరి భారమా... తరువుకు కాయ భారమా... కని పెంచే తల్లికి పిల్ల భారమా"

   తొలగించండి
 5. కాలుని దున్నపోతు మెడ గంటల సవ్వడి విన్నయంతనే
  కాలము తీరి పోయెనని కాలజముండతి తీవ్ర వేగమున్
  గాలము వోలెనా లవణిఁగైకొని వెంట పడంగ నేమనన్
  జాలక నూరకె యముని జతకు నేగుట దప్పదిమ్మహిన్.
  లవణి==పాశము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   జతకు అన్నచోట గణదోషం. '..... జాలక నూరకే యముని జాడకు నేగుట....' అనండి.

   తొలగించండి
 6. హ్రదములో దాగియున్న దుర్యోధనుని మనోగతం:

  కాలుని దున్నపోతు మెడ గంటలు ఖంగున మ్రోయుచుండె నా
  యాలనపాలనన్ గనెడి యాప్తులనందరి మ్రింగె మృత్యు వీ
  వీలును జూచి ధర్మజుడు వేగమె రమ్మనుచుండె బైట కీ
  వేళ సుయోధనా! చితిని పేర్చెను పో విధి నీకు ధాత్రిపై.

  రిప్లయితొలగించండి

 7. గు రు మూ ర్తి ఆ చా రి *

  { కృష్ణరాయభార ఘట్టములో శ్రీ కృష్ణుని పలుకులు }

  కాలుని దున్నపోతు మెడ గ౦టలు ఘల్లను చు౦ డ స౦ధి వా
  క్యా లవి యెక్కునే చెవికి ? కౌరవ నాయక. !
  వీరులెవ్వరున్
  చాలరు మా కిరీటికి + అని c. జత్తురు ; కూలుచు > మారుతాత్మజు౦.
  డాలములో భయ౦కర గదాయుధుడై భవదూరు యుగ్మమున్

  ( కూలుచు = భగ్నమొనర్చు )

  రిప్లయితొలగించండి
 8. కాలుని దున్నపోతుమెడ గంటలు మ్రోగవు, మ్రోగుచోనికన్
  కాలము మూడు దున్నలకు ఖండిత మౌను శిరమ్ము, మాంసమున్
  ఆలముగా భుజింత్రు బిరియాని నొనర్చి,యిదేల నన్నచో
  కాలును దువ్వుచు౦ద్రు గద కయ్యము కున్ మన జ్ఞాను లందరున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   కయ్యమునకున్ అనవలసింది. కయ్యము గోరెడు జ్ఞాను లందరున్.... అందామా?

   తొలగించండి
  2. గురుదేవులసూచన మేరకు సవరించిన పద్యము
   కాలుని దున్నపోతుమెడ గంటలు మ్రోగవు, మ్రోగుచోనికన్
   కాలము మూడు దున్నలకు ఖండిత మౌను శిరమ్ము, మాంసమున్
   ఆలముగా భుజింత్రు బిరియాని నొనర్చి,యిదేల నన్నచో
   కాలును దువ్వుచు౦ద్రు గద కయ్యము గోరెడు జ్ఞాను లందరున్

   తొలగించండి
 9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. కాలుని దున్నపోతు మెడగంటలు కంటక మౌను రోగికిన్
  జాలియు లేనిపాశమున జన్మను దృంచ యముండు రాకతో
  ఆలియు,పిల్లలన్ మమత లంటక కంటకమందునే ఎటో
  దేలుచు జీవ మెళ్లు టన దిక్కులు గానక కళ్ళు మూయుటే|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ద్రుంచ, జీవ మేగుటన.... అనండి.

   తొలగించండి
 12. కాలుని దున్నపోతు మెడ గంటలు మ్రోగుచు నుండె గట్టిగా
  చాలిక మందు మాకులును చాలును మంత్రపు తంత్ర పూజలున్
  కూలును తప్పదీ తనువు క్రూరుడు కాలుడు వీడడె వ్వరిన్
  కాలము చెల్లి పోయినను గాటికి చేరక దప్ప దీ ధరన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. కాలుని దున్నపోతుమెడగంటలు పెల్లున మ్రోగుచుండగా
  కాలముతీరెనంచు నిజకర్మనుగూర్చితలంచుచున్ హరీ
  మేలగుజీవితమ్మునిడు మీఁదటి పుట్టుక నంచు వేడితిన్
  మేళపు శబ్దమున్ వినుచు మేల్కొన నాకల వీడిపోయెగా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. నిన్నటి పద్యరచన:

  పద్యముఁ జెప్పఁగా వలెను భావము దైవము జేరునట్టులున్
  గద్యము నందు ప్రాస,యతి, కమ్మని చంధము మేళవించెడున్
  విద్యలెరింగి మాటలును వెన్నలు చిందుచు సాగినంత నై
  వేద్యముఁ గోరడెన్నడును వెన్నుడు మెచ్చుచు విన్నపమ్ములున్!

  నేటి పద్యరచన:

  కాలుని దున్నపోతు మెడ గంటలు నిల్పెనె సత్యమంతు ని
  ల్లాలిని భీతిఁ జెంది పతి ప్రాణములందక తిర్గి వెళ్లగన్?
  తాళిని పొందియే చనెను తల్లట పెట్టుచు ధర్మమూర్తినిన్!
  తూలుట, త్రుళ్లుటల్,భయము దూరముఁ జేయవె గమ్యమందుటన్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 15. కాలుని దున్నపోతు మెడ గంటలు
  మ్రోగగ టింగుటింగుమన్
  వేలకు పొంచియున్న పొలి వీధుల బొంగుల కాష్ఠవర్తకుల్
  పాలన జేసెడిన్ వివిధ పండిత మండిత శాస్త్రవేత్తలున్
  వ్రాలెదరందరున్ దహన వాటిక చేరువ ముచ్చటించుచున్

  రిప్లయితొలగించండి
 16. కాలుని దున్నపోతు మెడ గంటలు విన్గనె నావులించుచున్
  నీలిగి లేచివచ్చుచును నెమ్మదిగా కిటికీని దీయుచున్
  కూలుగ స్మైలునిచ్చుచును కొంచెము కూడను భీతిచెందకే
  వీలుగ రేపు రమ్మనుచు వెంటనె పారుము దొడ్డిదారినిన్

  రిప్లయితొలగించండి