24, జనవరి 2012, మంగళవారం

సమస్యాపూరణం - 601 (విఱుగఁ బండిన చేలను)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
విఱుగఁ బండిన చేలను విడువఁ దగును.
ఈ సమస్యను పంపిన
లక్కాకుల వెంకట రాజారావు గారికి
ధన్యవాదాలు.

45 కామెంట్‌లు:

  1. వాన లొచ్చెను గట్టి తుఫాను లొచ్చె
    చెరువు కట్టలు తెగిపడి చేలలోన
    నీరు నిండగ రైతు కన్నీరు తోడ
    విఱుగఁ బండిన చేలను విడువఁ దగును.

    రిప్లయితొలగించండి
  2. వరద సమయము రయమున వాగు వంక
    పొంగుచున్నయెడ తనదు పుత్రులనిక
    కాచుకొనుటయె ముఖ్యము- కఠినమయ్యు,
    విఱుగఁ బండిన చేలను విడువఁ దగును.

    రిప్లయితొలగించండి
  3. శ్రీపతిశాస్త్రిమంగళవారం, జనవరి 24, 2012 8:14:00 AM

    శ్రీగురుభ్యోన్మ:

    చిల్లు గవ్వయు లేకుండె చేతిలోన
    విలువసైతము తగ్గెను విఫణిలోన
    చేరవేయంగ ఖర్చులు చేయనేల
    విఱుగఁ బండిన చేలను విడువఁ దగును.

    రిప్లయితొలగించండి
  4. టమాట పంట కోసి కొనేవారు లేక, కోసిన కూలి కూడా రాక రోడ్డు మీద పారబోసిన సంఘటనలు ఎన్నో...

    రామములగలు కాసెను గ్రామమందు
    కోయు వారికి కావలె వేయి, వాని
    కొనెడు వారలు జూడగ కనరు గాన
    విఱుగఁ బండిన చేలను విడువఁ దగును.

    రిప్లయితొలగించండి
  5. ఎరువు లెక్కువ వేసి యీ కరువు తీర్చ
    పంట పండించె నొక రైతు. పంట లోన
    విషము పొడసూపె నెరువులనసలు పోయె.
    విఱుగఁ బండిన చేలను విడువఁ దగును.

    రిప్లయితొలగించండి
  6. నకిలి విత్తన మోసాలు నమ్మిచెడిరి
    బొంది బోయి రైతన్నలు మునిగి ,నడ్డి
    విఱుగ,బండిన చేలను విడువ దగును
    కోరి పసులకు , దండుగ కోత కూలి

    రిప్లయితొలగించండి
  7. రేయిపవలను భేదము లేక సాగు
    చేసి యుంచిన పంటకు చీడ పట్టి
    విషము ప్రాకెను దినుసుల, వింతగాదె!
    విఱగపండిన చేలను విడువ దగును.

    రిప్లయితొలగించండి
  8. శ్రీపతి శాస్త్రి గారు,

    మన మదనపల్లె టమోటా రైతుల బాధలను కళ్ళకు కట్టినారండీ.

    రిప్లయితొలగించండి
  9. హనుమచ్ఛాస్త్రి గారి పూరణకు సవరణ. ఆయన ' ఒచ్చె ' ను వదిలించుకొందామని ప్రయత్నిస్తున్నా ' ఒచ్చె ' ఆయనను 'ఒదలటం 'లేదు.

    వాన పెల్లయి గట్టి తుఫాను వచ్చి
    చెరువు కట్టలు తెగిపడి చేలలోన
    నీరు నిండిన రైతు కన్నీరు తోడ
    విఱుగఁ బండిన చేలను విడువఁ దగును.

    రిప్లయితొలగించండి
  10. వరిపొలమునతా గాలికి పురియునట్టి
    కలుపు కలగాపులగముగ కలిసిపెరుగు
    పొల్లు తాలు రెట్టించెడి రెల్లు గడ్డి
    విఱుగఁ బండిన చేలను విడువఁ దగును

    రిప్లయితొలగించండి
  11. గంగ మాతల్లి రైతులఁ గరుణఁ జూడు
    మిగుల శ్రమియించి పెంచిరే మేలు పైరు
    పరుగు లిడుచును నంభోధి నురుకు నపుడు
    విఱుగఁ బండిన చేలను విడువఁ దగును !

    రిప్లయితొలగించండి
  12. కడుపు నింపక మత్తును గలుగ జేసి
    మనిషి బుద్దిని వృద్దిని మలిన పరుచు
    చెఱుపు గంజాయి మొక్కలు చేల నిండ
    విఱుగఁ బండిన చేలను విడువఁ దగును!!!

    రిప్లయితొలగించండి
  13. గురువు గారు మీ మధుమేహం పూరణ అద్భుతం, మరియు కవిమిత్రుల పూరణలు బాగుగాయున్నవి.
    నాయకుల వెంటదిరిగిన కాసులు కురియును, మరి కష్టపడి పండించవలసిన పని ఏమియున్నదని ? నా పూరణ
    --------
    గడియ సమయము సభలోన కౌలుకుండి
    విగ్రహములను బెట్టి దా వీధికెక్క
    కురియు కాసులు, నోదార్పు దొరక నేడు
    విఱుగ బండిన చేలను విడువ దగును|

    రిప్లయితొలగించండి
  14. నారు నూడ్చిన తదుపరి నీరు బెట్టి
    అదనులో మంచి యెరువుల నందజేసి
    విఱుగఁ బండిన చేలను విడువఁ దగును
    కోత కనువగు సమయమ్ము కుదురు దనుక.

    రిప్లయితొలగించండి
  15. శంకరాభరణము బ్లాగుసరస కవిత
    లను సమృద్ధిగ పండించు ననుదినమ్ము
    అద్భుతములగు నా పంట లలరుచుండ
    విరుగ బండి యా చేలిచ్చు విశ్వ శాంతి

    రిప్లయితొలగించండి
  16. నిరుడు పంటలు లేకను నేల యెండె
    స్వామి కురిపించె గనుమిక జగము నిండ
    విఱుగఁ బండిన చేలను; విడువఁ దగును
    నాటి నీరసమ్మును జీవనమ్మునందు.

    రిప్లయితొలగించండి
  17. ఎంత చక్కని పూరణ మ్మిది! మనసుకు
    ముదము గల్గించు నరసింహ మూర్తి గారు!
    విఱుగ బండిన చేలను విడువ గోరి
    వరద గంగమ్మ తల్లిని వరము లడుగ

    రిప్లయితొలగించండి
  18. నీరసము వీడు డంచు పన్నీటి జల్లు
    చిలికి, జనపదమ్ముల మేలు బలికి, హితము
    గోరు మందాకినీ గారి పూరణమున
    నద్భుతమగు విరుపు హృదయంగమమ్ము

    రిప్లయితొలగించండి
  19. కర్షకుఁడు కాంచి యత్యంత హర్ష మందు
    విఱుగఁ బండిన చేలను; విడువఁ దగును
    వర్షములు లేక మఱి నీటి పారుదలకు
    దూరమై యెండు చేలను దోష మనక!

    రిప్లయితొలగించండి
  20. గన్నవరపు వారి మన్నికౌ పూరణ
    ముదము గూర్చె గరము మదికి జూడ
    ముంచి తేల్చ నైన ముద్దు జేయగ నైన
    చెల్లు గాదె గంగ తల్లి కెపుడు.

    రిప్లయితొలగించండి
  21. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘ఒచ్చె’ను వదలరా (మూర్తి గారన్నట్లు)? ఆ పాదానికి నా సవరణ ...
    ‘వర్షములు వచ్చె గట్టి తుపాను వచ్చె’
    మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    ష, స ప్రాస ఉభయప్రాసగా పండితామోదమే.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
    గన్నవరపు వారి, మందాకిని గారి పూరణలను ప్రశంసించిన మీ పద్యాలు మధురంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    గోలి వారి పద్యానికి నా సవరణ కంటే మీదే ఉత్తమంగా ఉంది. ధన్యవాదాలు.
    మీ పూరణ వైవిధ్యంగా, అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    ధన్యవాదాలు.
    ఏదారి చూపినా మీ లక్ష్యం ఒక్కటే అవుతున్నది. బాగుంది. చక్కని పూరణ. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ఉత్తమమైన పూరణ. అభినందనలు.
    *
    పండిత నేమాని గారూ,
    నా బ్లాగును విడువదగని చేనుగా మార్చారు. సంతోషం! ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. మిస్సన్న గారూ,
    గన్నవరపు వారి పూరణను ప్రశంసించిన మీ పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. తల్లి తలపోయు నెపుడునా తల్లడిల్లు
    పిల్లల కనిపెట్టుచు పెంచి పెద్దజేయ
    చదువుసంధ్యల మెరయుచు చక్కజేయు
    సంతతిన్ మరయనగుబో వింతగాదు
    విఱుగఁ బండిన చేలను విడువఁ దగును!

    రిప్లయితొలగించండి
  24. గురువు గారు ధన్యవాదములు.
    నాదారి తప్పుచేసిన వారిని ఉతికిఆరేయడమే సార్.

    రిప్లయితొలగించండి
  25. గన్న వరపు వారు గంగమ్మ తల్లికి
    హృద్య మైన గొప్ప పద్య మొసగి
    కరుణ జూపు మనియె కఱువుదీరుననియె
    విఱగ పండు చేలవిడువు మనియె!

    రిప్లయితొలగించండి
  26. రాజారావు గారు,
    ధన్యురాలను.
    మీరన్నట్టు మూర్తిగారు చేసిన పూరణ ఎంతో వైవిధ్యంగా బాగున్నది. అందరి తరపున గంగమ్మకు ఇదే విన్నపము.
    నిన్నటి పూరణల్లో గురువుగారి పూరణ విభిన్నంగా ఉండి అలరించినది.
    మిత్రులందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. మాస్టరు గారూ! మూర్తి గారూ ! 'నన్నొదలని' దానిని 'వదిలించి' సరిచేసినందులకు ధన్యవాదములు. చక్కని పూరణలు చేసిన మిత్రులకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. మోస గించెడి జనులందు దోస మెంచి
    చెడును దూరము జేయుట చేటు గాదు
    భుక్తి నీయదు వరియైన పురుగు బట్టి
    విఱుగఁ బండిన చేలను విడువఁ దగును !

    రిప్లయితొలగించండి
  29. గురువు గారూ నమస్సులు, ధన్యవాదములు. చక్కని పద్యాలతో అభినందించిన శ్రీ లక్కాకుల వెంకట రాజా రావు గారికి,మిస్సన్న మహోదయులకు శ్రీ మంద పీతాంబర్ గారికి,సోదరి మందాకిని గారికి కృతజ్ఞతలు. మన అందఱికీ ఆశీస్సులు అభినందన లిచ్చిన అన్నయ్యగారు శ్రీ పండిత నేమాని గారికి అభివందనములు.

    హనుమచ్ఛాస్త్రి గారూ, ప్రతి దినము దినపత్రికలలో ' ఒచ్చె ' అని చదువుతుండము వలన అది అంత సుళువుగా వెళ్ళదు. నేను కూడా కష్ట పడి వదిలించుకొన్నాను. పనికి వెళ్ళే తొందర,విద్యుచ్ఛక్తి పోతుందేమో నన్న గాభరా ,మాకు తెలుసు, మీ హడావుడి. అయినా చక్కని పద్యాలు వ్రాస్తున్నారు. కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  30. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    మూర్తిగారి పూరణ మనోహరం !

    విఱుగ బండిన చేలను - విడువ మనుచు
    గంగనే కోరినట్టి యో - గడుసు వాడ
    గంగ విని నీదు వినతిని - కరుణ తోడ
    కర్షకుల గాచు సతతము - హర్షమొంద !

    కామితార్థము లిచ్చులే - గంగ నీకు
    కమల జన్ముడు నిను మెచ్చు - గాక యెపుడు
    కమల నేత్రుడు హర్షించు - గాదె నిన్ను
    గంగ భర్తయు దీవించు - కరుణ హెచ్చ !

    కలిమి నిండును నీ యింట - గన్న వరపు !
    నార సింహ మూర్తి , గొనుము - నాదు జోత !
    కోరి సిరులన్ని వరియించి - చేరు నిన్ను
    విఱగ బండును నీయింట - వేడు కలర !

    రిప్లయితొలగించండి
  31. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    మూర్తిగారి బాటలోనే :

    01)
    ____________________________

    వీధి వీధిని ముంచెత్తు - వేగముగను !
    వెధవ లందర పరిమార్చు - వెల్లువౌచు !
    వినతి నాలించి రైతుల - వేడుకలర
    విఱుగఁబండిన చేలను - విడువఁదగును !
    ____________________________

    రిప్లయితొలగించండి
  32. కిశోర్ జీ మీ మనోహరమైన పద్యాలతోను దీవెనలతోను తన్మయింప చేసారు.మీకు, అవ్యాజమైన ప్రేమ కురిపించిన మిత్రులందఱికీ శతధా ధన్యవాదములు. శంకరాభరణమనే కల్పతరువు కింద సద్గురువులు పూజనీయులు పెద్దలు మిత్రబృందముతో సహవాసము కలగడమును నిజముగానే వరముగా పరిగణిస్తాను. గంగమ్మ తల్లిని పిలుస్తేనే నాపై ఆ అమ్మ యింత వాత్సల్యము కురిపించింది.మీ దీవెనలను మన గురువరేణ్యులతోను మన మిత్రు లందఱితోను బ్లాగు వీక్షకులతోను పంచుకొంటాను.మనందఱికీ మనకుటుంబ సభ్యులకు ఆయురారోగ్యములు సర్వశుభములు సద్గుణములు సరస్వతీ కటాక్షము సకల సంపదలు ఆ సంపదలకు సద్వినియోగము కోరుకొంటున్నాను ఆ గంగమ్మ తల్లిని. సర్వే జనా స్సుఖినో భవంతు.

    రిప్లయితొలగించండి
  33. చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ.
    ‘మరయనగుబో’ ... ?
    *
    మంద పీతాంబర్ గారూ,
    గన్నవరపు వారిపై మీ ప్రశంసాపద్యం హృద్యంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    ఈమధ్య ఈ తమ్ముడికి సవరించే శ్రమ తప్పిస్తున్నారు. సంతోషం!
    *
    వసంత కిశోర్ గారూ,
    మూర్తి గారిని ప్రశంసిస్తూ వ్రాసిన పద్యాలు బాగున్నాయి. ధన్యవాదాలు.
    వారి స్ఫూర్తితో మీ తాజా పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ఇందరు కవిమిత్రుల ప్రశంసలను, అభినందనలను పొందినందుకు నాకు ఆనందంగా ఉంది. నిజంగానే నిన్నటి మీ పూరణ అత్యుత్తమం. మొదటి బహుమతికి (ఉంటే!) సర్వవిధాల అర్హమైనది. మూలకు పడ్డ ‘సమస్యాపూరణల’ e-book నిర్మాణం మళ్ళీ కొనసాగించే స్ఫూర్తిని, ఉత్సాహాన్ని ఇచ్చింది.

    రిప్లయితొలగించండి
  34. గురువుగారు బహుమతులు పెడితే అందుకోవడానికి మాకెవరికీ అభ్యంతరం లేదు. (పూరణల వాసి గురించిన నిబంధన మాత్రం ఉండకూడదు!!!!!!!!!!!)

    రిప్లయితొలగించండి
  35. శంకరార్యా ! బహుశా
    విఱుగ బండిన పిల్లల - మరువదగు ! పో !
    అనుకుంటా చంద్రశేఖరుల వారి తాత్పర్యం !
    నిజమే గదా !

    రిప్లయితొలగించండి
  36. చూడ ముచ్చట గొలుపును చూపరులకు
    విరుగ బండిన చేలను , విడువ దగును
    చీడ పట్టిన వరి పైరు చేల తతిని
    యెంత ప్రాప్త మొ యంతియ నిచ్చు ప్రకృతి.

    రిప్లయితొలగించండి
  37. ధన్య వాదములు తమ్ముడు ఈ ఫలితం మీదే . ఎప్పడికప్పుడు విసుగు చెందక ప్రోత్స హిస్తూ నన్నింత దూరం తెచ్చినం దులకు కృతజ్ఞతలు. !

    రిప్లయితొలగించండి
  38. సుబ్బారావు గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి