25, జనవరి 2012, బుధవారం

సమస్యాపూరణం - 602 (కడలి నీ రంతయును)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
కడలి నీ రంతయును నిండెఁ గడవలోన.
ఈ సమస్యను సూచించిన
కందుల వరప్రసాద్ గారికి
ధన్యవాదాలు.

30 కామెంట్‌లు:

  1. కడవ నొక్కటి జాలరి పడవలోన
    నుంచి వేటకు వెళ్లగ నొక్క సారి
    పెద్ద అల వచ్చి పైబడ బెదరె వాడు
    కడలి నీ రంతయును నిండెఁ గడవలోన.

    రిప్లయితొలగించండి
  2. వసంత కిశోర్ గారూ,
    ‘నిండెన్ + కడవలోన = నిండెఁ గడవలోన’
    అది కడవ (కుండ), గడప కాని కడప కాని కాదు!

    రిప్లయితొలగించండి
  3. సకల వేద వేదాంగముల కలయికను
    గీత యందు నిమిడ్చె శ్రీకృష్ణ విభుఁడు
    సజ్జనావళి గ్రోల తత్సలిల సుధలు
    కడలి నీరంతయును నిండెఁ గడవలోన !

    రిప్లయితొలగించండి
  4. మూర్తి గారూ ! బాగుంది.

    పూర్వము పుస్తకములకు స్థానము "భాండాగారములే".

    'కడలి నీరను' గ్రంథమ్ము కష్ట పడుచు
    వ్రాసె నొక్కడు బహు తాళ పత్రములను
    కడవ నుంచెను దాచగ, ఖాళి లేదు
    కడలి నీ రంతయును నిండెఁ గడవలోన.

    రిప్లయితొలగించండి
  5. జగము నందలి జీవికి జన్మనిచ్చు
    తల్లిదండ్రుల రూపము దాల్చుచున్న
    నాదిదంపతుల కరుణ హద్దు మరచె.
    కడలి నీరంతయును నిండెఁ గడవలోన !

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యా ! ధన్యవాదములు !
    శాస్త్రీజీ ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ____________________________

    కడలి జలకంబు లాడిన - కాంత యొకతె
    కడవ ముంచెను గొనిపోవ - కడలినీరు
    కడలి నీరంతయును నిండె - గడవ లోన
    కమల లోచన గొనిపోయె - కడవ తోడ !
    ____________________________

    రిప్లయితొలగించండి
  8. సకల బ్రహ్మాండ భాండముల్ జలజభవుడు
    చేయు కడవలే యౌట విచిత్రమేమి?
    కడలు లెన్నియో యుండు నా కడవలందు
    కడలి నీరంతయును నిండె కడవలోన

    రిప్లయితొలగించండి
  9. 02)
    నేమానివారి స్ఫూర్తితో :
    ____________________________

    క్ష్మమ , గోళంపు రూపంబు - గాన మనము
    గహ్వరిని బోల్చగావచ్చు - కడవ తోడ
    కర్వరిని దాగియుండును - కడలు లెన్నొ
    ఒక్క కడలియె కాదోయి - పెక్కులైన
    కడలి నీరంతయును నిండె - గడవ లోన !
    ____________________________

    రిప్లయితొలగించండి
  10. వెళ్లె వేటకు మావతో పల్లె పడుచు
    దూర మేగిరి సంద్రాన దొరక లేదు
    చేప లేవియు, చింతించె పాప మిట్లు
    'నోరు దడుపంగ పనికి రా నేర విచటి

    కడలి నీరంతయును,నిండె కడవ లోన
    మంచి తీర్థము లొడ్డుకు మరల నెపుడు?
    పైన సూరీడు మండె, నీవైన మొయిల !
    కురిసి దాహార్తి దీర్చరా కూడ దేమి?'

    రిప్లయితొలగించండి
  11. ఆదిదంపతుల అవ్యాజమైన ప్రేమ తల్లిదండ్రుల రూపములో భువిలో దిగి వచ్చి పిల్లలను అపరిమితమైన ప్రేమను పంచుట.
    ఆదిదేవుల ప్రేమ కడలి లాగా అనంతమైనది దాన్ని చిన్న కడవలో తల్లిదండ్రుల రూపములో నింపినారు. అని అన్వయము.

    రిప్లయితొలగించండి
  12. శ్రీపతిశాస్త్రిబుధవారం, జనవరి 25, 2012 9:36:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    ఆచమన్యము జేయగ నబ్ధిజలము
    ముని కమండలమందున ముచ్చటగను
    అలల సవ్వడులుడుగగ నమరిపోయె
    కడలి నీ రంతయును నిండెఁ గడవలోన

    రిప్లయితొలగించండి
  13. శ్రీపతిశాస్త్రిబుధవారం, జనవరి 25, 2012 9:37:00 AM

    2 వ పాదము "మునివరేణ్యుడు చెపట్టె ముచ్చటగను" అని అంటె బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  14. గురువుల, కవి మిత్రుల పూరణలు అలరించు చున్నవి
    ------
    దారి జూపగ దినుటకు- దానవులకు
    గట్టె కప్పము మెండుగ- గాపరికిలె
    కడవ యందు దాచగ కాపు,-పుడమి పైన
    గడలి నీరంతయును నిండె -గడవలోన|
    ( పుడమి పై కడలి నీరు = అవినీతి సొమ్ము)

    రిప్లయితొలగించండి
  15. గాలి వానకు పొంగెను కట్ట దరికి
    కడలి నీ రంతయును , నిండె గడవ లోన
    చూరు వెంబడి జారెడు చుక్క లన్ని
    వాన జోరుగ నింటిపై పడుట వలన .

    రిప్లయితొలగించండి
  16. చిక్కనగు పాలు పోతు మీ చిత్తమలర
    వెలను చూడకుడని నమ్మ బలికి నావె
    యెంత చిలికిన రాదేమి సుంత వెన్న?
    కడలి నీ రంతయును నిండెఁ గడవలోన!

    రిప్లయితొలగించండి
  17. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మబుధవారం, జనవరి 25, 2012 4:06:00 PM

    వేల యెకరాల పంటను విక్రయించి
    రొక్కమునుబెట్టె రైతన్న రొంటిలోన
    ఎంత చిత్రమ్మదెంతటి వింత గనుమ
    కడలి నీరంతయును నిండె గడవలోన

    రిప్లయితొలగించండి
  18. పొసగ పాలలో నీళ్ళు గల్పుటలు గాదు
    పూని నీళ్ళలో పాలు గల్పుటలు నిజము
    పాల కడవలో కడలి గల్పంగ జెప్పి
    'చతురతకు మిన్న మస్సన్న' సాక్ష్య మిచ్చె

    రిప్లయితొలగించండి
  19. శ్రీ వసంత్ కిశోర్ గారి పద్యము బాగున్నది. 1వ పాదము మొదటి గణము సవరించాలి. ఆ పాదము నిలా మారిస్తే బాగుంటుంది అనుకొనుచున్నాను:
    ఉర్వి రూపమ్ము గోళమట్లుండు గాన

    రిప్లయితొలగించండి
  20. నేమానివారికి ధన్యవాదములతో :

    02అ)
    ____________________________

    క్షాంతి , గోళంపు రూపంబు - గాన మనము
    గహ్వరిని బోల్చగావచ్చు - కడవ తోడ
    కర్వరిని దాగియుండును - కడలు లెన్నొ
    ఒక్క కడలియె కాదోయి - పెక్కులైన
    కడలి నీరంతయును నిండె - గడవ లోన !
    ____________________________

    రిప్లయితొలగించండి
  21. డి.నిరంజన్ కుమార్బుధవారం, జనవరి 25, 2012 7:31:00 PM

    వామనుడెదిగినాడుగ భూమియంత
    అణిగి యుండెగ నోటబ్రహ్మాండ మంత
    కడలి నీరంతయును నిండె కడవలోన
    కాని దేమిటి దైవంబు కరుణ యుండ

    రిప్లయితొలగించండి
  22. సాగరమ్ములు మ్రింగిరి యోగ ధనులు
    గగన మందుండి రప్పించె గంగ భువికి
    వింత యేముంది మనదంత వేద భుమి
    కడలి నీరంతయును నిండెఁ గడవ లోన

    రిప్లయితొలగించండి
  23. క్షమించాలి నిరంజన్ గారి పద్యం నేను చూడ లేదు. ముందుగా చూసి ఉంటే మార్చు కుందును గదా ! కొంచం రెండు ఒకేలా ఉన్నాయి అందుకని !

    రిప్లయితొలగించండి
  24. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    ముఖ్యంగా రెండవపూరణ ఉత్తమంగా ఉంది.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    కొద్ది రోజులుగా మీ పూరణలలో ప్రావీణ్యత స్పష్టంగా కనిపిస్తున్నది. సంతోషం.
    ఈనాటి పూరణ ఉత్కృష్టంగా ఉంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉంది. ఒక్క సముద్రాన్నే కష్టం అనుకుంటే మీరు ఎన్నో సముద్రాలను కడవలో చేర్చారు. బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    అన్నివిధాల ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    పూరణ మిషతో ఒక ఖండకావ్యాన్నే వ్రాసారే. చాలా బాగుంది. అభినందనలు.
    మిస్సన్న గారిని అభినందించిన మీ పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    సముద్రజలాన్నే పుక్కిట పట్టిన మన మునులకు అదొక లెక్కా? చక్కని పూరణ. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మెండుగ గాపరికిలె’ ...?
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ మనోహరమై అలరారుతున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    నీళ్ళ పాలు పోసినవాణ్ణి బాగానే విమర్శించారే! చమత్కారమైన పూరణ. వైవిధ్యంగా ఉంది.
    అందుకే లక్కాకుల వారు ప్రశంసించారు ‘చతురతకు మిన్న మిస్సన్న!’ అని. అభినందనలు.
    *
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    నిరంజన్ కుమార్ గారూ,
    దైవకృప ఉంటే కానిదేమిటి అన్న మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ అన్నివిధాల బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. గురువు గారూ,శాస్త్రీజీ, ధన్యవాదములు. మిత్రుల పూరణ లన్నీ బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  26. గురువుగారూ ధన్యవాదాలు.
    రాజారావు గారూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. మత్స్య రూపమ్ము దాల్చు సమయమునందు
    మనువు చేతి కుంభమునందు మాధవుండు
    జలచరముగ నొదిగె నక్కజమ్ముగాదె
    కడలినీరంతయును నిండె గడవలోన .
    -------------------

    రిప్లయితొలగించండి