30, జనవరి 2012, సోమవారం

సమస్యాపూరణం - 607 (కారము వర్జించువాఁడు)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది
కారము వర్జించువాఁడు కాంచునె సుఖముల్?

44 కామెంట్‌లు:

  1. శ్రీరమ్యము సుమధుర శృం
    గారరసాఢ్యమ్ము సౌఖ్యకరమును ప్రియమౌ
    దారా సుందరభద్రా
    కారము వర్జించువాడు కాంచునె సుఖముల్

    రిప్లయితొలగించండి
  2. సారము లేనిదని యెఱిగి
    మేరలు తెలియని యహమ్ము మిథ్యని మిగులన్
    నేఱిచి కాయము పై మమ
    కారము వర్జించువాడు కాంచునె సుఖముల్

    భౌతిక సుఖముల గురించి...

    రిప్లయితొలగించండి
  3. "ఓంకారేణ ప్లవేనైవ సంసారాబ్ధింతరిష్యతి" అను ఆర్యోక్తిననుసరించి.......

    ఏరీతిజెప్పగాతగు,
    సారరహిత,వ్యర్థమైన, సాగరమగుసం
    సారముదాటించెడు 'ఓం
    కారము" వర్జించువాడు కాంచునె సుఖముల్?

    రిప్లయితొలగించండి
  4. శ్రీరాముడు శ్రీకృష్ణుడు
    నీరేజ భవుండు శివుడు నేకం బవగా
    నారూపము సాయి శుభా
    కారము,వర్జించు వాడు కాంచునె సుఖముల్

    రిప్లయితొలగించండి
  5. శ్రీరంగనాథుఁ గొలువగ
    చేరువయౌ ముక్తి పథము ;చిత్తము లోనన్
    వారింపక యారు, నహం
    కారము వర్జించు వాఁడు గాంచునె సుఖముల్ ?

    రిప్లయితొలగించండి
  6. హాస్యస్ఫూర్తితో:
    ఆరాటము తప్పయసలు
    సారము సరుకుండదు తిన చప్పిడి కూడున్
    కూరలు పచ్చళ్ళ౦దున
    కారము వర్జించువాఁడు కాంచునె సుఖముల్!

    రిప్లయితొలగించండి
  7. గురువు గారికి ధన్యవాధములు
    గురువుల, కవి మిత్రుల పూరణలు అలరించు చున్నవి
    ఈ మధ్య పసికందులు కుక్కల పాలౌతున్న విషయమును ఈ విధముగా
    ----------
    నోరూరగ యమ్మాయన
    నేరముగా దలచి నీటను విడువ నేర్చెన్
    కూరిమి కొరవడగా, మమ
    కారము వర్జించు వారు కాంచునె సుఖముల్|

    రిప్లయితొలగించండి
  8. గురువు గారికి ధన్యవాధములు
    కొద్దపాటి సవరణతో మగవారిపై, ఆడ పిల్ల యనగా చిన్నచూపు జూపెడి విషయమును
    -----
    నోరూరగ నాన్నాయన
    నేరముగా దలచి విడువ నేర్చెను నీటన్
    కారణమును జూపక, మమ
    కారము వర్జించు వాడు కాంచునె సుఖముల్|

    రిప్లయితొలగించండి
  9. కోరిక లన్నియు దీర్చే
    కోరకనేకోట్లధనము కుదురుగనిచ్చే
    దారులనేర్పరిచెడు నధి
    కారము వర్జించువాడు కాంచునె సుఖముల్!!

    రిప్లయితొలగించండి
  10. దారిని బోవుచు నుండ న
    పారాత్మీయతను జూపి పటు వినయం బొ
    ప్పారగ నొనరించు నమ
    స్కారము వర్జించువాఁడు కాంచునె సుఖముల్?

    ఇది నా అనుభవం. స్కూటర్ పై వెళ్తున్నప్పుడు దారిని తప్ప ఎవ రెదురవుతున్నారు, ఎవరు నమస్కారం పెడుతున్నారు అనేవి గమనించే అలవాటు లేదు. "ఆయ నెవరో మీకు నమస్కారం చేసాడు. చూడరా?" అని మా ఆవిడతో చీవాట్లు తినడం మామూలే! ప్రతినమస్కారం పొందక కోపగించుకొని మాట్లాడడం మానేసినవాళ్ళూ ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  11. నీరస పఱచెడి రోగము
    శారీరకమయిన వేళ, జావలు మేలా
    హారంబున; నుప్పు మరియు
    కారము వర్జించు వాడు కాంచునె సుఖముల్?

    రిప్లయితొలగించండి
  12. నీరస పఱచెడి రోగము
    శారీరకమయిన వేళ, జావలు మేలా
    హారంబున; నుప్పును మరి
    కారము వర్జించు వాడు కాంచునె సుఖముల్?

    రిప్లయితొలగించండి
  13. భారత సంస్కృతి గుణ వి
    స్తారము, పరమార్థ తత్త్వ సంచయ పారా
    వారము, మిత్రమ! యా సం
    స్కారము వర్జించు వాడు కాంచునె సుఖముల్

    రిప్లయితొలగించండి
  14. శ్రీ శ్యామలీయం గారు,

    మొదటి పాదము సరిచూచుకొనవలెననుకొంటాను.

    రిప్లయితొలగించండి
  15. కం. పారమ్యప్రదమంత్రము
    ధీరుండై గొలుచు చుండి దీక్షాపరుడై
    నేరక శ్రీకర మగు నోం
    కారము వర్జించువాడు కాంచునె సుఖముల్

    శంకరయ్యగారూ, గొప్ప మందమతి నని నాకు పేరు, చిన్నప్పటి నుండీ. అనేకానేక మార్లు పెద్దలనూ మిత్రులనూ గమనించటంలో పొరబడి యిల్లాలి చీవాట్లు తినటం నాకూ అలవాటై పోయింది.

    రిప్లయితొలగించండి
  16. మాస్టారూ, శ్యామలీయం గారూ! గురువులకు పాఠం చెప్పేటంతవాడిని కాదుగానీ (ఈ సబ్జెక్టులో నేనసలే వీకు), మాఊరి ప్రెసిడెంట్ నాంచారయ్య గారనేవాడు, ఇల్లాలు అరిచినపుడు అంతా విన్నట్లు నటించి చివరకు “నీ దాసుడినే” అంటే సరిపోతుందిట. మరి చూస్కోండి,
    “ఊరికి ప్రెసిడెంటగుబో
    దారకు దాసు౦డనేగ దయ్యా!”యనె నాం
    చారయ, నిక్కము భార్యా ఛీ
    త్కారము వర్జించువాఁడు కాంచునె సుఖముల్!

    రిప్లయితొలగించండి
  17. తీరుగఁ బిజ్జా బర్గరు
    లారాధించి తెలుగింటి యావరుచులు గోం
    గూరను పప్పును నల్లపు
    కారము వర్జించువాడు కాంచునె సుఖముల్?

    రిప్లయితొలగించండి
  18. అయ్యా! శ్రీ చంద్రశేఖర్ గారూ!
    మీ పద్యము 3వ పాదము చూస్తే మీకు గురుభక్తి ఎక్కువ అని తెలుస్తోంది. ఒక గురువును తగ్గిస్తే ఆ పాదము బాగుపడుతుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. శ్రీనేమాని మహాశయా! మరి అంతేకదా గురుభక్తి యెక్కువై భార్యాభక్తి తక్కువైతే వచ్చిన చిక్కే అది!
    “ఊరికి ప్రెసిడెంటగుబో
    దారకు దాసు౦డనేగ దయ్యా!”యనె నాం
    చారయ, మరి భార్యా ఛీ
    త్కారము వర్జించువాఁడు కాంచునె సుఖముల్!

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! శ్రీ సంపత్కుమార శాస్త్రి గారూ!
    మీ పద్యములో సవరణలు చేయాలి. 1, 2 పాదములు ఇలా సవరిస్తే బాగుంటుంది:
    "ఏరీతి చెప్పనగు ని
    స్సారమ్మును వ్యర్థమైన సాగరమగు సం"

    రిప్లయితొలగించండి
  21. పండితుల వారి రెండవ పూరణ అద్భుతమైన భారత సంస్కృతి గురించి ఉటంకిస్తూ భాసిల్లుచున్నది.

    తీరుగ తల్లులు నేర్పిన
    వీరుల ధీరతయు, త్యాగవృత్తుల నెన్నో
    మారులు వినియును తన సం
    స్కారము వర్జించువాడు కాంచునె సుఖముల్?

    యశో ప్రాప్తి , పుణ్యార్జన వంటి శాశ్వత సుఖముల గురించి....

    రిప్లయితొలగించండి
  22. అయ్యా! శ్రీ ఛంద్రశేఖర్ గారూ!
    ఈ నాటి సమస్య నా భార్యా భక్తినే మొట్ట మొదటి పూరణలో వ్యక్తము చేయడానికి తావు నిచ్చింది కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! మీ అనుభవములో ప్రతి నమస్కారమును వర్జించుటే ఇబ్బంది గానీ, నా అనుభవము ఇంకొక ఆకు ఎక్కువ. ఎదురుపడి నమస్కారము చేసిన వ్యక్తి ఎవరో గుర్తించలేక ఎలాగ సమాధనము చెప్పాలో ఏమడగాలో తికమక పడుట నాకు ఎక్కువగా అలవాటు. ఏం చెయ్యగలము - అష్టావధానిని కదా జ్ఞాపక శక్తి రోజురోజుకీ పెరుగుతోంది.

    రిప్లయితొలగించండి
  24. నోరూరు వంటకములను
    నోరారగ దినెడువాని నోములు పండున్
    కూరల యందున ఉప్పును
    కారము వర్జించువాడు కాంచునె సుఖముల్!!!

    రిప్లయితొలగించండి
  25. నారదుని వలెను నిరతము
    నారాయణ పదము లంటి నాకము నందున్ !
    నే రీతి సేవజేయుచు విశ్వా
    కారము వర్ణించు వాఁడు కాంచునె సుఖముల్ !
    -----------------------------------------------
    శారదను పఠియించి మనమున
    పూరణములు జేయ నెంచి పూరించినచో !
    తీరెను కోరికయని శుభా
    కారమును వర్ణించు వాఁడు కాంచునె సుఖముల్ !

    రిప్లయితొలగించండి
  26. పోరాడు పటిమ ,యోరిమి ,
    తీరైన చదువు, నడతలు దిద్ది మనిషిగా
    తీరిచిన గురువుకు నమ
    స్కారము వర్జించువాడు కాంచునె శుభముల్ ?

    రిప్లయితొలగించండి
  27. " కషమించాలి సరదాకి "

    నోరూరు చుండె ననుచును
    గారెలనే తినగ నెంచి కాంక్షించి మదిన్ !
    కోరిక తీరగ యర్ద్ధ్రక్ మిర్చీ
    కారము వర్ణించు వాఁడు కాంచునె సుఖముల్ !

    రిప్లయితొలగించండి
  28. రాజేశ్వరి అక్కయ్యా,
    ఎట్లా ‘కషమించ’ మంటారు? సమస్య ‘వర్జించ’మంటే మీరు ‘వర్ణించారు’ ... :-)

    రిప్లయితొలగించండి
  29. పండిత నేమాని వారూ,
    ఎప్పుడూ భక్తిభావ ప్రపూరితాలైన పూరణలు పంపే మీ నుండి ఈరోజు ఇటువంటి పూరణను ఊహించలేదు. సరసమైన పూరణ నిచ్చి ఆనందాన్ని కలిగించారు. అభినందనలు.
    మీ రెండవ పూరణ మీ వాస్తవ వ్యక్తిత్వాన్ని ఆదర్శాన్ని ప్రదర్శించింది.
    కవిమిత్రుల పూరణల గుణదోష విచారం చేస్తూ నా కెంతో మేలు చేస్తున్నారు. ధన్యవాదాలు.
    ఎదుట పడి పలకరించిన వ్యక్తిని గుర్తించక పోయే (సు)గుణం నాకూ ఉన్నదండీ!
    *
    మందాకిని గారూ,
    మమకారం వీడవద్దన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘మిథ్య + అని’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ యడాగమం రావాలి. దానిని ‘మిథ్య యని కడున్’ అందాం.
    మీ రెండవ మూడవ పూరణలు కూడా చాలా బాగున్నాయి.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ఓంకార ప్రాముఖ్యాన్ని వివరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ‘రహిత వ్యర్థ’ అన్నప్పుడు ‘త’గురువై గణదోషం. ‘సారము విడి వృథా యైన’ అంటే సరి!
    నాకంటే పండిత నేమాని వారి సవరణ సముచితంగా ఉంది.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    సర్వదేవతా స్వరూపుడైన సాయిని వర్జించవద్దని చెప్పిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    గురువుకు నమస్కరించని వానిని గురించిన మీ రెండవ పూరణ అద్భుతంగా ఉంది.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    ఉప్పూకారం లేని వంటలు రుచించవని చక్కగా పూరించారు. అభినందనలు.
    ‘భార్యా చీత్కారము’ (వినీ విననట్లు నటిస్తూ) వర్జించడమే సర్వశ్రేయోదాయకం గదా! చమత్కారమైన పూరణ. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    సవరించాక మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    ‘అధికారం’ వర్జించిన తర్వాత సుఖ మెక్కడిది? చక్కని పూరణ. అభినందనలు.
    ‘తీర్చే, ఇచ్చే’ పదాలను ‘తీర్చెడి, ఇవ్వన్’ అని మార్చండి.
    *
    ‘శ్యామలీయం’ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    మతిమరుపు నా ఒక్కడికే అనుకున్నా, నాలాగా ఎందరో ..?
    *
    రవి గారూ,
    నల్లపు కారం గుంటూరిదేనా? మీ పూరణ చురుక్కమంటున్నది. మంచి పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ మూడు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    మొదటి రెండు పద్యాల్లో మూడవ పాదంలో గణదోషం. నా సవరణలు ...
    ‘ఏరీతిని గొలిచి శుభా’
    ‘తీరెగ కోరికలు శుభా’

    రిప్లయితొలగించండి
  30. కని పెంచిన తల్లి యందు
    సరి తూగిన అర్ధాంగీ యందు
    బంధు గణము యందు మమ
    కారము వర్జించు వాడు కాంచునే సుఖముల్ !


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  31. జిలేబీ గారూ,
    చక్కని భావాన్ని తెలిపారు. అభినందనలు.
    వీలైతే ఈ సాయంత్రం వరకు మీ భావానికి పద్యరూపం ఇస్తాను (మిత్రులెవరూ ప్రయత్నించకుంటే!).

    రిప్లయితొలగించండి
  32. నేమాని పండితుల పూరణ అద్భుతంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  33. వసంత కిశోర్ గారు చెప్పారు ....

    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    జిలేబీ గారి స్ఫూర్తితో :

    01)
    ____________________________

    కూరిమి పంచెడు తల్లిని
    తీరుగ మసలెడి యువిదను - తిన్నని సంతున్
    మీఱని బంధు హితుల ,మమ
    కారము వర్జించువాఁడు - కాంచునె సుఖముల్?????
    ____________________________
    మీఱు = హద్దు మీఱు

    రిప్లయితొలగించండి
  34. వసంత కిశోర్ గారూ,
    ఎందుకో మీ పూరణ బ్లాగులో ప్రకటింపబడలేదు. దానిని నా మెయిల్ బాక్స్ నుండి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాను.
    జిలేబీ గారి భావానికి చక్కని పద్యరూపం ఇచ్చారు. నాకు శ్రమ తగ్గించారు.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  35. గురువుగారు మన్నించాలి, జిజేబి గారి బావమును
    ఈ విధముగా ( వసంత కిశోర్ గారిది మంచి పూరణ, నేను కూడా ప్రయత్నించితిని)

    -----
    భారతమాతను, మాతను
    శారీరిక సుఖములు దీర సతిని, విడువగన్|
    వారించు బంధువుల మమ
    కారము వర్జించు వాడు, కాంచునె సుఖముల్|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రారంభపు కవనములో
      నారంభపు మంత్రమందు నన్నియు తెలిసే
      తీరుగ వరుసగ శ్రీ ఓం
      కారము వర్జించువాడు కాంచునె సుఖముల్

      తొలగించండి
  36. వరప్రసాద్ గారూ,
    జిలేబీ గారి భావానికి మీ పద్యరూపం చక్కగా ఉంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘సుఖములు’లో ‘లు’తొలగిస్తే సరి!
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  37. గారాబమ్ముగ పెరుగుచు
    రారాజుల వంశమందు "రైతుల బిడ్డై"

    తేరకు వచ్చెడి ధన స్వీ
    కారము వర్జించువాఁడు కాంచునె సుఖముల్?

    తేరకు = అనాయాసముగా (శబ్దరత్నాకరము)

    రిప్లయితొలగించండి
  38. తీరుగ మామిడి కాయలు
    కూరిమితో నావకాయ కొరకై కొనుచున్
    చారెడు మిర్చిది పౌడరు
    కారము వర్జించువాఁడు కాంచునె సుఖముల్?

    రిప్లయితొలగించండి

  39. * శంకరాభరణం వేదిక *
    26/07/2020..ఆదివారం

    సమస్య
    ********
    వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్"

    నా పూరణ. ఉ.మా.
    *** ********

    వంచన బుద్ది తోడ శిశుపాలుడు రావణుడాది వారు ధూ

    షించగ భూరి సంతతము శ్రీహరినిన్..,గడు గోపచిత్తుడై

    త్రుంచుచు జక్రి వారలను దొల్గగజేయుచు మౌని శాపమున్

    సంచిత పాపకర్మలను జక్కగ బాపుచు ముక్తి నీయడే??

    వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్"


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷





    రిప్లయితొలగించండి