27, నవంబర్ 2012, మంగళవారం

పద్య రచన - 173

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8 కామెంట్‌లు:

  1. కన్నువిందుగ నొప్పుచున్నది కామధేనువు కూర్మితో
    జన్ను ద్రావుచు నుండె నందిని సంతసమ్మున బొంగుచున్
    సన్నయమ్ముగ తల్లి గోవును సర్వదా భజియించుచో
    చెన్నుగా గనవచ్చు భక్తులు శ్రేయముల్ సుఖ శాంతులున్

    రిప్లయితొలగించండి
  2. గోమాతను కొలవం డిది
    గో మాతకు సమము సుండి కువలయమందున్
    క్షేమంబు పాలు పెరుగులు
    ప్రేమారగ వాటి సంతు పెరుగగనిమ్మా.

    రిప్లయితొలగించండి
  3. సర్వదైవరథము!నుర్విఁదిరుగునావు!
    తల్లి ప్రేమఁ బంచు దైవ మూర్తి!
    యావు దూడ లున్న నాయిల్లు కోవెల!
    కామి తమ్ముఁ దీర్చు కనక లక్ష్మి!

    రిప్లయితొలగించండి
  4. పూజలు సల్పి గోమహిమ ముచ్చట లెన్నియు జెప్పు చుందురే,
    రాజులు పేదలున్ మిగుల రంజిలు భక్తిని మ్రొక్కు చుందురా
    రోజులు పోయెనే, యకట! రోసితి, దుఃఖము గల్గు; వీధులన్
    భోజనమైన గడ్డియును బుక్కెడు లేక చరించు గోవులన్
    మోజుగ పెంచు శక్తినిడు మ్రొక్కెద నెప్పుడు గోపనందనా!

    రిప్లయితొలగించండి
  5. క్షీర సాగరమును జిలుకుచునుండగా
    ....నావిర్భవించిన యట్టి సురభి
    శ్రీ మహాలక్ష్మికి శీతాంశునకు దోడ
    ....బుట్టువై యలరారు పుణ్యరాశి
    అతుల సద్గుణరాశి యానంద వర్ధిని
    ....యాశ్రిత జన కామితార్థదాయి
    అతి పావనమగు మహర్షి వర్యుల యాశ్ర
    ....మమ్ముల సేవించు మహిత మూర్తి
    అఖిల దేవతా గణముల యంశలెల్ల
    తనదు హృదయాన గలిగిన ధన్య చరిత
    పూజలందుచు భక్తుల బ్రోచుచుండు
    కామధేనువునకు నమస్కార శతము

    రిప్లయితొలగించండి
  6. మునుల యాశ్రమముల యందు పూజ లంది
    సిరులు కురిపించి తరియించు కరుణ మూర్తి
    మమతలను పంచి పెంచిన మాత యైన
    కామ ధేనువు వారింట కల్ప తరువు.

    రిప్లయితొలగించండి
  7. అడిగినవి యన్నిడుదువట యా సురలకు
    వేయి నుతులు నీకు గొనుము వేల్పుటావు !
    నీ సుతయె నందినిని గొల్చి నియమముగను
    సజ్జనుండు దిలీపుడు సంతు బడసె

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని వారూ,
    కామధేనువుపై మీ రెండు పద్యాలు అద్భుతంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘ఇదిగో - మాతకు సమము’ అంటూ మీరు చెప్పిన పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    గోసేవా నేపథ్యంతో మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి