23, నవంబర్ 2012, శుక్రవారం

పద్య రచన - 169

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

24 కామెంట్‌లు:


  1. బాపూ గీసిన మ్రుగ్గిది
    ఆ పుణ్య పురుషు డమర్చి 'అ ఆ ఇ ఈ'
    ఓపికగా కలిపెనుగా
    దీపించును తెనుగు తేట తేనియ మ్రుగ్గై.

    'అ ఆ ఇఈ' = పలికినప్పుడు నాలుగు గురువుల్లా ఉంటాయని .....దోషమైతే పెద్దలు తెలుప గలరు.

    రిప్లయితొలగించండి
  2. చుక్కలు పేర్చిన యందము
    చక్కగ యెన్నైన గాని చాతుర్యము నన్ !
    మిక్కిలి చుక్కల కంటెను
    మక్కువగా కలిపి నంత ఆ...ఆ..ఇ..ఈ..!

    రిప్లయితొలగించండి
  3. అక్షరమయమ్ము చూడగా నఖిల జగతి
    యనుచు దెల్పెడు విధముగా నందమైన
    రంగవల్లులలో నక్షరములు కలవు
    వర్ణ రూపిణీ! నీకిదే వందనమ్ము

    రిప్లయితొలగించండి
  4. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం ివరి పాదంలో యతి తప్పింది."చుక్కల వెంటనె/యక్కరములఁ గలిపినంత అ..ఆ..ఇ..ఈ" అందాం.

    రిప్లయితొలగించండి

  5. చదువుడు అ ఆ ఇ ఈ యని
    పదునుగ మఱి ముగ్గు గీ చె బాపూ నచట న్
    పది మంది మెచ్చు నటులుగ
    నందముగా గీ యు నేర్పు యాతని సొంతం .

    రిప్లయితొలగించండి
  6. అయ్యా! సుబ్బారావు గారూ! శుభాశీస్సులు.
    మీరు ప్రాసను చూచుట లేదు. 4వ పాదములో ప్రాస యేదీ? అలాగే చివరలో "సొంతం" అనే ప్రయోగము బాగులేదు. మార్పులు అవసరము. మీ ఉద్దేశము బాపు గారిని ప్రశంసించుట మాత్రము బాగుగ నున్నవి. 3, 4 పాదములు ఇలాగ మార్చుదామా?

    మదివిందు గూర్చు నేరుపు
    కద సొంతము వాన్కి చిత్రకళలోన బళా!

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  7. ముచ్చట గొలుపుచు దీర్చగ
    యచ్చులనిట రంగవల్లులందునఁ గలుపం
    గచ్చెరువయ్యెను గాదే!
    నెచ్చెలి, ముంగిటను ముగ్గు నీటుగ నయ్యెన్.

    నీటు = అందము.

    రిప్లయితొలగించండి
  8. ఆకృతిని గీసె బాపు ‘ అ ఆ ఇ ఈ ' లు
    వరుస చుక్కలతో గల్పి ప్రజ్ఞ మీర
    మ్రుగ్గు వలె దోచి కనులకు ముదము గొలుప
    అందమైన చిత్రమ్మయె నక్షరములు

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘అఆఇఈ’ అన్నప్పుడు ఆ నాలుగక్షరాలూ గురువులే.

    అ ఆ ఐ ఔ లకు మఱి
    ఇ ఈ లు ఋకారసహిత మె ఏ లకు నౌ
    ఉ ఊ ల్దమలో నొడఁబడి
    ఒ ఓ లకు వళ్ళగు న్నయోన్నతచరితా!
    అని చెప్పబడింది కదా!
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘చక్కగన్ + ఎన్నైన = చక్కగ నెన్నైన’ అవుతుంది. చివరి పాదంలో యతి విషయమై నా వ్యాఖ్యను గమనించారు కదా!
    *
    పండిత నేమాని వారూ,
    నాదబ్రహ్మకు దృశ్యరూపమైన అక్షరాన్ని గురించి చక్కని పద్యం చెప్పారు. బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    ‘బాపూ’ గారిని ప్రశంసిస్తూ మీరు వ్రాసిన పద్యం బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘అ ఆ ఇ ఈ’ అన్నప్పుడు ఆ నాలుగూ గురువులే.
    ‘బాపూ యచటన్’ అని ఉండాలి.
    నాల్గవ పాదం గురించిన నేమాని వారి సవరణలను గమనించారు కదా!
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    ‘కలుపంగ నచ్చెరువు’ అనాలికదా! ‘అందు గలుపగా/ నచ్చెరువు’ అని నా సవరణ..
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    తేటగీతిలో వరుసగా నాలుగు గురువులు వచ్చే అవకాశం లేదు. ‘అ ఆ ఇ ఈ’ అన్నప్పుడు నాలుగూ గురువులే. ‘బాపు నా నక్షరముల’ అందాం.

    రిప్లయితొలగించండి
  10. అహము విడచి పెట్ట నానందమౌ దారి
    యిహమునందు చేర నీశ్వరు నది
    తెలియు వాడె ధరను ధీయుతు డని చెప్పు
    రంగవల్లి గనిన మంగళమగు.

    రిప్లయితొలగించండి
  11. గురువుగారు,
    ధన్యవాదాలు. మీ సవరణ వల్ల నా పద్యము ఇంకా బాగున్నది.

    రిప్లయితొలగించండి
  12. సవరణతో..

    ముచ్చట గొలుపుచు దీర్చిన
    యచ్చులనిట రంగవల్లులందు నిలుపగా
    నచ్చెరువయ్యెను గాదే!
    నెచ్చెలి, ముంగిటను ముగ్గు నీటుగ నయ్యెన్.

    నీటు = అందము.

    రిప్లయితొలగించండి
  13. nimgi loni nakshathralu
    bumiki digivachina chukkali
    telugu talli vesena ranga valli i
    telugu biddalaku bathuku bandi i
    bapu chethelo jarina chitrma i
    andarini acharya perchen

    రిప్లయితొలగించండి
  14. మిస్సన్న గారూ,
    రంగవల్లిలో ఇంతటి గూఢార్థం ఉన్నదా? పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    అజ్ఞాత గారూ,
    ఈ ఉత్సాహం సంతోషాన్ని కలిగించింది.
    మీ భావానికి నా పద్యరూపం...

    నింగి చుక్కలన్ని నేలకు దిగినట్లు
    తెలుగు రంగవల్లు లలరుచుండు
    తెలుగువారి బ్రతుకు తేరుగా చిత్రించె
    బాపు ప్రతిభ మెచ్చవలయు నిపుడు.

    రిప్లయితొలగించండి
  15. శంకరార్యా ! నమస్సులు.
    ఛందములో అందముగా సందేహ నివృత్తి చేశారు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి


  16. గురువు గారికి వందనములు. సవరణకు ధన్యవాదములు. అ ఆ ఇ ఈ లు కలిపి పలికి నప్పుడు అవి గురువులౌతాయని నాకు నిజంగా తెలియదు.

    ఆకృతిని గీసె బాపు నా నక్షరముల
    వరుస చుక్కలతో గల్పి ప్రజ్ఞ మీర
    మ్రుగ్గు వలె దోచి కనులకు ముదము గొలుప
    అందమైన చిత్రమ్మయె నక్షరములు

    రిప్లయితొలగించండి

  17. దిద్దుమని గురువు లిచ్చిరి
    ఒద్దిక గొని మ్రుగ్గు నునుచ నోహో యనుచున్
    ముద్దులిడి పెద్ద లందఱు
    అద్దానిని మెచ్చుకొనిరి అ ఆ ఇ ఈల్ !

    రిప్లయితొలగించండి
  18. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    అందఱు మెచ్చుకొనే విధంగా చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. గురువు గారికి,మిస్సన్న మహాశయులకు కృతజ్ఞతాభివందనములు!

    రిప్లయితొలగించండి