8, నవంబర్ 2012, గురువారం

సమస్యాపూరణం - 871 (కరములు దిద్దంగలేని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కరములు దిద్దంగలేని కరము కరమ్మే? 
(ఆకాశవాణి సౌజన్యంతో... సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు)

20 కామెంట్‌లు:

 1. మరి తెల్గు ఓనమాలను
  వర వీణా పాణి యైన వాణిని కూర్మిన్
  స్థిరముగ దలచుచు మోడ్చుచు
  కరములు, దిద్దంగలేని కరము కరమ్మే?

  రిప్లయితొలగించండి
 2. మిత్రులారా!
  వాక్కు అనే సంపద మానవులకు మాత్రమే భగవంతుడిచ్చిన వరము. దానిని సద్వినియోగ పరచుట ముదావహము కదా.

  నరజాతికి వాగ్విభవము
  వరము కదా నేర్చుకొనుట భావ్యము భాషన్
  వరమతితో నందలి య
  క్కరముల దిద్దంగలేని కరము కరమ్మే?

  రిప్లయితొలగించండి
 3. వరముల నిడు విద్య మనకు
  త్వరితము పుత్రా! మొదలిడు వర్ణక్రమమున్
  హరుసముగ నకా రాద్య
  క్కరములు దిద్దంగలేని కరము కరమ్మే?

  రిప్లయితొలగించండి
 4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  విరుపుతో చక్కని అర్థాన్ని సాధిస్తూ మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  *
  చంద్రశేఖర్ గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
  ‘అక్కరము’ తద్భవం కదా. దానిని ‘ఆది + అక్కరములు’ అని సంధి చేయరాదు. సవరించండి.

  రిప్లయితొలగించండి
 5. సురుచిర పంచాక్షరములు
  మరువైరిం జూడఁ జేయు, మరువక వానిన్
  ధర దిద్దెడి కరములు శ్రీ
  కరములు దిద్దంగ లేని కరము కరమ్మే?

  రిప్లయితొలగించండి
 6. చింతా రామకృష్ణారావు గారూ,
  ఆహా! అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 7. కరమున బలపము బట్టిం
  తురు గురువులు వోనమాలు తొల్తగ వ్రాయన్
  కరము సరళములు వ్రాయ సు
  కరములు ; దిద్దంగలేని కరము కరమ్మే ?

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి 9. శిరమున కరమిడగా శీ
  కరములు శ్రీకరము లగును కరి దీవించన్
  కరి నుదుట కుంకుమల్ శుభ
  కరములు ; దిద్దంగలేని కరము కరమ్మే ?

  రిప్లయితొలగించండి
 10. కరివరదుని సేవించుచు
  హరిమూర్తి నలంకరించి హారము లిడుచున్
  హరిచందన నామము హిమ
  కరములు దిద్దంగలేని కరము కరమ్మే ?

  రిప్లయితొలగించండి
 11. హరి పూజ సేయు కరములు
  కరములు, దిద్దం గ లేని కరము కరమ్మే ?
  హరునకు తిలకము జక్కగ
  హరిహరులే నొక్క రూపు నాలోచించన్ .

  రిప్లయితొలగించండి
 12. నారోజు రాజమౌళి , హుస్నాబాద్గురువారం, నవంబర్ 08, 2012 5:11:00 PM

  అరమొర కననీ మనమున
  వరదాయిని వాణి మాత వడి నుడికారమ్
  కరముల మొక్కగ మొదలిడి
  కరములు దిద్దంగలేని కరము కరమ్మే

  రిప్లయితొలగించండి
 13. నాగరాజు రవీందర్ గారూ,
  మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘వోనమాలు’ అన్నారు. ‘వు,వూ,వొ,వో’ అక్షరాలతో తెలుగు పదాలు లేవు.
  ‘గురువులె యోనమాలు’ అందాం.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  నారోజు రాజమౌళి గారూ,
  ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  దాదాపు వారంరోజులుగా మీరు గత సమస్యలకు పంపిన పూరణలను చూస్తున్నాను. ఆరు పూరణలూ, ఒక దత్తపది, ఒక పద్య రచన పద్యాలను పంపించారు. పని ఒత్తిడి వల్ల ఆ పద్యాలపై స్పందించలేకపోయాను. అలస్యానికి మన్నించండి. మీ పద్యాలు చక్కని ధారతో విలసిల్లుతున్నాయి. సంతోషం... వీలైనంత తొందరలో వాటిపై నా విశ్లేషణ తెలియజేస్తాను. మీరు నిరుత్సాహపడక బ్లాగులో పద్యాలను వ్రాస్తూ ఉండండి..,
  ఈనాటి మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. జంగిడి రాజేందర్గురువారం, నవంబర్ 08, 2012 6:51:00 PM


  మరుమముతో బాలుర గని
  యెరుగక బాలురను నెల్ల ఏడ్పించుచునూ
  అరువుతొ బాలురకును శ్రీ
  కరములు దిద్దంగలేని కరము కరమ్మే?

  రిప్లయితొలగించండి
 15. ధరను నిరక్షర కుక్షికి
  పరికింప నవిద్య కన్న పగతురు కలరే?
  క్షరములు కానివి వినుమ-
  క్కరములు దిద్దంగ లేని కరము కరమ్మే?

  రిప్లయితొలగించండి
 16. పరమేశుని నామములను
  కరములు దిద్దంగ లేని కరము కరమ్మే ?
  వర మిచ్చిన కరుణ మరచి
  శరణా గతి కోర కున్న శాంభవి మెచ్చన్ !

  రిప్లయితొలగించండి
 17. జంగిడి రాజేందర్ గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం.
  మీ పూరణలో సందిగ్ధత ఉన్నది. మరుమము అంటే మర్మమా? కానీ మర్మానికి వికృతి మరుమము కాదు కదా! ఏడ్పించుచునూ అని దీర్ఘాంతంగా ప్రయోగించారు. అది ఏడ్పించుచున్. అరువుతొ అని హ్రస్వాంతంగా ‘తొ’ అన్నారు.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. అధికృత గణకులకు (for chartered accountants):

  విరివిగ నల్ల ధనమ్ము
  న్నరచేతులు త్రిప్పి దాచు నాసాములకై
  తిరకాసుగ నాదాయపు
  కరములు దిద్దంగలేని కరము కరమ్మే?

  కరము = పన్ను (కప్పము)

  రిప్లయితొలగించండి