21, నవంబర్ 2012, బుధవారం

పద్య రచన - 167

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. పావురమును రక్షించగ
    కావలసిన యోగిరమ్ము గ్రద్దకునిడగా
    నీవయ్యా తొడ చాలక
    నీవంతయు గొనుమని శిబి నిలచితి వయ్యా.

    రిప్లయితొలగించండి
  2. ఒక్క పావురమును గాంచి యొక్క డేగ
    పట్టుకొన బోవ నయ్యది త్వరిత గతిని
    చేరి శిబి చక్రవర్తిని కోరె శరణు
    నా మహాత్ముండు నంతట నభయమిచ్చె

    తన యోగిరము కదా యని
    జనపతి నా డేగ యడుగ సన్మతి తన మే
    నున గల మాంసమునే యిడె
    వినుత మహాధర్మరతుడు వేల్పులు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  3. పావు రంబును రక్షిం చు పనికి పూని
    చక్ర వర్తియా శిబి, డేగ సంత సించ
    తనదు తొడ నుండి మాంసము దనర కోసి
    యాహ రింపగ నిచ్చెను నాద రమున .

    రిప్లయితొలగించండి
  4. దానము చేయుచుండు శిబి ధర్మము తప్పడు, సత్యమిద్దియే
    ప్రాణము బోయినన్ తనదు పంతము మానడు, లోకమెల్ల నీ
    జ్ఞానము పంచఁ బావురము, గద్దల వేషము బూని వచ్చి; రా-
    సూనునిఁ జేరి వాదనల జోరుగఁ జేసియు జూపు గాథయే.

    రిప్లయితొలగించండి

  5. పావురమును డేగొక్కటి చావజేయ
    వెంటనంటెను, భయముచే వేగ వెడలి
    "రాజ! రక్షింపు "మని వేడె, రమ్మటంచు
    పిలచి తొడపైన గూర్చుండ బెట్టుకొనియె.

    రిప్లయితొలగించండి
  6. అభయమొసగిపావురమున్
    శిబికాపాడగనురువులఁజీల్చిచ్చుటయే
    సబబంచునివ్వదేవత
    లుబయులదీవెనలపొందియున్నతుడాయెన్!

    రిప్లయితొలగించండి
  7. అభయమొసగిపావురమున్
    శిబికాపాడగనురువులఁజీల్చిచ్చుటయే
    సబబంచునివ్వదేవత
    లుబయులదీవెనలపొందియున్నతుడాయెన్!

    రిప్లయితొలగించండి
  8. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఉదయం ''పద్యరచన" పోస్ట్ చెయ్యగానే కరెంటు పోయింది. అత్యవసరంగా హైదరబాద్ రావలసి వచ్చింది. అందువల్ల ఈరోజు సమస్య పోస్ట్ చేయలేకపోయాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంక రయ్య గురుదేవులకు గారికి ,శ్రీ నేమాని గురు దేవులకు పాదాభి వందనము, ధన్యవాదములు దెలుపుచు
    ఇది యంతయు మీరు పెట్టిన భిక్ష గురువుగారు ఆ పై శారదాంబ కృప,మా అమ్మ నాన్నల పుణ్యము కలసి నేను మీ ముందు నిలువగలిగితిని. మరొక్కసారి అందరికి పాదాభి వందనము జేయుచు
    మీ శిష్యుడు
    వరప్రసాదు

    రిప్లయితొలగించండి
  10. ధర్మ సంకటమాయెను ధరణి పతికి
    రెండు వేపుల పక్షుల రేడు జూడ
    తుదకు తొడనిచ్చె దానము తులిత రీతి
    శిబియె దానము నందున శేఖరుండు!

    (తులిత = తూచబడినది)

    రిప్లయితొలగించండి
  11. తొల్లి పావురమును గాచ తొడను గోసి
    దాని నిడె గ్రద్దకున్ శిబి దయను జూపి
    ధరణిలో నుండిరెందరో త్యాగధనులు
    వారి వలన ధన్య మయె నీ భరత భూమి.

    రిప్లయితొలగించండి
  12. రివ్వుమని వ్రాలె తొడ పైన గువ్వ యొకటి
    శరణు కోరగ కాపాడు శౌరి శిబియె
    డేగ కాహార మునకని భాగ మిడగ
    నెంత పలలము గోసిన నంత మవక
    తుదకు త్రాసున తానుండి తూగె నతడు !

    రిప్లయితొలగించండి