29, నవంబర్ 2012, గురువారం

పద్య రచనలో కొన్ని మెలకువలు

మిత్రులారా!
శుభాశీస్సులు. 
కొన్ని చిరు సూచనలను పంపుచున్నాను. తిలకించండి.

పద్య రచనలో కొన్ని మెలకువలు
          కంద పద్యమును రచించు నప్పుడు సాధారణముగా ధార సాఫీగా సాగును.  కాని కొన్ని చోటులలో గణములు సరిపోయిననూ, గమనము లయ బాగుగ నుండవు.  ఆ పద్యమును చదివినప్పుడు ఆలాగున ఇబ్బంది తెలియబడినచో కాస్త సరిదిద్ది ఇబ్బంది తొలగు నటుల తగు జాగ్రత్త వహించుట మంచిది.

          తేటగీతి వ్రాయునప్పుడు అందులోని 2వ గణము (2 ఇంద్ర గణములలో మొదటిది) రగణము కాని నగ గణము కాని అయినచో పద్యము గమనము/లయలో తేడా కనుపట్టును.  అందుచేత ఆ గణములను ఆ చోటులో పడకుండా జాగ్రత్త పడుట మంచిది.  తేటగీతి ఆటవెలది సీసము మొదలయిన పద్యములలో ఒక్కొక్క పదమును ఒకొక్క గణమునకు సరియగు నటుల వ్రాసిన గమనము చాలా సాఫీగా సాగును.  

          మిత్రులు పద్య ధారను సరళీకృతమును చేసుకొనుటకు ఈ సూచనలు ఉపయోగపడును అని నా నమ్మకము.
స్వస్తి!

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

3 కామెంట్‌లు:

 1. నమస్కారములు
  మంచి సూచనలను అందించి ప్రోత్స హించిన గురువులు శ్రీ పండితుల వారికి పాదాభి వందనములు

  రిప్లయితొలగించండి
 2. సరస్వతి పుత్రులు మీరన
  సరళముగా పద్య రచన సాధన కొఱకై !
  నిరతము సహనము నొందుచు
  విరసించక తెలుపు చుండె విరించి వలెన్ !

  [ వ్రాయాలన్న తపనేగానీ క్షమించాలి ఎన్ని తప్పులున్నాయో ? ]

  రిప్లయితొలగించండి
 3. అమ్మా! రాజేశ్వరి! మీ
  కమ్మని హృదయమ్ము నిండు కాంతిమయమ్మై
  చిమ్ము ననురాగ పీయూ
  షమ్ము కదా! మీకు నాశిషమ్ములు కూర్తున్

  భక్తిః కిం నకరోతి (భక్తి దేనిని చేయలేదు) అని శ్రీ శంకరాచార్యుల వారు అన్నారు శివానంద లహరిలో. ఆలాగున ఆదరము గల చోట పద్యములో ఏవేవో పొరపాటులు దొరలినను అవి లెక్కలోనికి రావు కదా.

  రిప్లయితొలగించండి