15, నవంబర్ 2012, గురువారం

పద్య రచన - 161

అక్షయపాత్రతో ద్రౌపదీకృష్ణులు
కవిమిత్రులారా,
ఈరోజు ‘భగినీ హస్తభోజన’ పర్వదినం.
 పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. అన్నా ! వచ్చే నతిథులు
    అన్నము పెట్టంగ లేదు అక్షయ పాత్రన్
    అన్నది ద్రౌపది, కృష్ణుం
    డన్నీ నే చూతుననుచు నభయమ్మిచ్చెన్.

    రిప్లయితొలగించండి
  2. పాండు తనూజుల పరమ బంధుండగు
    ....కృష్ణుండు వారున్న యెడకు బోయి
    అన్నము గొన నెంచ నున్నది మెతుకొక్క
    ....టేయని గని దాని నే గ్రహించి
    అల్ప సంతోషియౌ యా జగన్నాయకుం
    ....డద్దాని తోడ తృప్తాస్మి యనుచు
    నచట పాండవులున్న యట్టి స్థితుల గాంచి
    ....ద్రౌపది సేయు ప్రార్థనమును విని
    ధర్మ సంస్థాపకుడు జగద్రక్షకుండు
    ఆశ్రిత జనమ్ములను బ్రోచు నమరతరువు
    కృష్ణు డాశీర్వదించుచు నిచ్చెనంత
    భద్ర యోగప్రదాక్షయ పాత్ర నొకటి

    రిప్లయితొలగించండి
  3. అడవి లోన వసించుచు నతిథి సేవ
    చేయు ద్రౌపది సతినట చేరబిలిచి
    కృష్ణ భగవానుడప్పుడు కేల నిడెనె
    యక్షయంబగు పాత్ర తా నాదరమున.

    రిప్లయితొలగించండి
  4. నేమాని పండితార్యా నాదొక సందేహం.
    అక్షయ పాత్రనిచ్చినది సూర్య భగవాను డందురు కదా.

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారి పద్యం అద్భుతంగా ఉన్నది. తృప్తోస్మి అనాలా లేక తృప్తాస్మి అనాలా ? ఎన్నో కవితలలో తృప్తోస్మి అను పదాన్నే చూసేను కనుకనే యీ సందేహం. - శ్రీనివాస రావు

    రిప్లయితొలగించండి
  6. అయ్యా! శుభాశీస్సులు.
    బొమ్మ క్రింద శీర్షిక చదివితే : అక్షయ పాత్రతో ద్రౌపదీ కృష్ణులు - అని ఉన్నది కదా. అందుచేతనే శ్రీకృష్ణుడిచ్చినట్లు చెప్పేను. ఏది ఏమి అయినా నారాయణుడికీ సూర్యనారాయణుడికీ తేడా మనము చెప్పుకొనవద్దు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. అయ్యా! శ్రీనివాసరావు గారూ!
    శుభాశీస్సులు.
    బాగుగానే పట్టుకొన్నారు. తృప్తోస్మి అనుటయే సాధు ప్రయోగము. అందుచేత పద్యములో ఆ మార్పుతోనే చదువుకొందాము. ఏ పదము అయినా యతిలో మార్పు అక్కరలేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. నేమాని పండితార్యా ధన్యవాదములు.


    నన్ను పరీక్షను జేయగ
    నన్నమ్మును తినిన పిదప నా ఋషి వచ్చెన్
    అన్నమ్ము నెటుల బెట్టుదు
    నన్నా సంకటము బాపి నను బ్రోవగదే.

    ఆమాటలకున్ కృష్ణుడు
    యో మానిని చింత యేల నుండగ నే నా
    కోమారు చూపు పాత్రను
    సేమమ్మగు నంచు పలికె చిరునవ్వొదవన్.

    అక్షయ పాత్రను తెచ్చెను
    తక్షణమే ద్రుపద పుత్రి దానిని తాకెన్
    రక్షింప నామె నాహరి
    కుక్షిని నిండంగ జేసె గొప్పగ ఋషికిన్.

    సోదరి నారీతిగ నా
    యాదవుడే యాదుకొనగ నాదర మొప్పన్
    సోదర ప్రేమము మించెను
    వాదేలను వారికన్న వంద్యులు గలరే!

    రిప్లయితొలగించండి
  9. శ్రీ మిస్సన్న గారి పద్యములకు ఈ క్రింది మార్పులను సూచించుచున్నాను:

    2 వ పద్యము: ఇలా ప్రారంభించుదాము:
    ఆ మాటలకుం కృష్ణుం
    డో మానిని! చింత యేల?........

    4వ పద్యమును ఇలా ప్రారంబించుదాము:
    సోదరి నా రీతిగ దా
    మోదరుడే యాదుకొనగ మోదంబలరన్
    .........
    (కృష్ణుని యాదవుడు అనే కంటే దామోదరుడు అంటే ప్రయోగము బాగుంటుంది కదా)
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. కలిగినంతలోదానముఘనమటంచు
    నక్షయమగుభాగ్యంబిచ్చుననుచుదెల్ప
    మెతుకునొసగినద్రౌపదిఁమెచ్చికృష్ణు
    డామెనక్షయ కృపతోడనాదుకొనియె

    రిప్లయితొలగించండి
  11. నేమాని పండితార్యా! కడుంగడు ధన్యవాదములు.
    ఒక్కొక్కసారి బుర్ర పనిచేయక మూలాలు కూడా తట్టవండీ.

    రిప్లయితొలగించండి
  12. వనమున నుండెడి సతికిల
    ఘనమగు నాతిధ్యమి డగ కలుగునె సాధ్యం ?
    మనమున వెన్నుని దలచగ
    అనురక్తి గలిగి యొసగె నక్షయ పాత్రన్ !

    రిప్లయితొలగించండి
  13. బెంగను సోదరికి దీర్పగ
    అంగిట మెతుకొకటి పెట్టి బర్రున త్రేన్పన్
    పొంగిన యుదరంబులతో
    సంగతి దెలిసి మునులు పారుటెవింటిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ద్వారకానాథ్ యజ్ఞమూర్తి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "బెంగను ననుజకు దీర్పగ" అనవచ్చు.
      రెండవ పాదంలో యతి తప్పింది. "అంగిట మెతు కొకటి పెట్టి యల్లన త్రేన్పన్" అనండి.

      తొలగించండి

    2. గురువుగారికి ధన్యవాదాలు,

      ఈ శీర్షికలో ఇది నేను సాహసించి చేసిన తొలి ప్రయత్నం, మీ ఆశీర్వచనం కావాలి


      బెంగను ననుజకు దీర్పగ
      అంగిట మెతుకొకటిపెట్టి యల్లన త్రేన్పన్
      పొంగిన యుదరంబులతో
      సంగతి దెలిసి మునులు పారుటెవింటిన్

      తొలగించండి
    3. ద్వారకానాథ్ గారూ
      మీ పద్యం బాగున్నది అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. "సంగతి తెలిసి మునులెల్ల పారుట వింటిన్" అనండి

      తొలగించండి




  14. బెంగను ననుజకు దీర్పగ
    అంగిట మెతుకొకటిపెట్టి యల్లన త్రేన్పన్
    పొంగిన యుదరంబులతో
    సంగతి దెలిసి మునులెల్ల పారుటవింటిన్

    రిప్లయితొలగించండి