16, నవంబర్ 2012, శుక్రవారం

సమస్యా పూరణం - 879 (హాయిగా గ్రోల రారె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
హాయిగా గ్రోల రారె యాంధ్రామృతమ్ము.
చింతా రామకృష్ణారావు గారు
తన ‘ఆంధ్రామృతం’ బ్లాగులో
పై మకుటంతో పద్యాలు వ్రాయవలసిందిగా ఆహ్వానించారు.
కవిమిత్రులు ఆ బ్లాగును దర్శించవలసిందిగా మనవి.

http://andhraamrutham.blogspot.in/2012/11/blog-post_15.html

12 కామెంట్‌లు:

  1. గర్భ కవితల సొగసుల కమ్మదనము
    యువతరంగము కనువైన యుక్తి వాక్కు
    కలిపి దొరకు చింతా వారి కవన (కలము) మందు
    హాయిగా గ్రోల రారె "యాంధ్రామృతమ్ము".

    రిప్లయితొలగించండి
  2. సరస వాఙ్మయ కలశాబ్ధి సారములను
    బుద్ధి యను కవ్వమున జిల్కి పొలుపు మీర
    నిచ్చుచున్నాడు శ్రీ రామకృష్ణ మనకు
    హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము

    రిప్లయితొలగించండి
  3. శంకరాభరణమ్ము సత్సౌమ్య కవులు.
    తత్ కవీశుల సత్కృతుల్ తనర, వెలుగు
    నవ నవోన్మీలసాహిత్య నందనమది.
    హాయిగా గ్రోల రారె యాంధ్రామృతమ్ము.

    రిప్లయితొలగించండి
  4. ఆకవిత్రయభారతమాదిగాను
    పోతనార్యుభాగవతమ్ముపొదవికొనియు
    రమ్యరామాయణాలెన్నొరాశులవ్వ
    కవుల మేధోమథనధారకమ్మగుండి
    తెలుగుతేజంబుదశదిశలలరుచుండి
    వారసత్వంపుసాహితీవనమునిండె
    హాయిగాగ్రోలరారెయాంధ్రామృతమ్ము

    రిప్లయితొలగించండి
  5. ఆకవిత్రయభారతమాదిగాను
    పోతనార్యుభాగవతమ్ముపొదవికొనియు
    రమ్యరామాయణాలెన్నొరాశులవ్వ
    కవుల మేధోమథనధారకమ్మగుండి
    తెలుగుతేజంబుదశదిశలలరుచుండి
    వారసత్వంపుసాహితీవనమునిండె
    హాయిగాగ్రోలరారెయాంధ్రామృతమ్ము

    రిప్లయితొలగించండి
  6. యతులు, ప్రాసలు, ఛందంబు లద్భుతమగు
    గుణములను గూడి మథురమౌ ఫణుతులంది
    చిత్తవికసన మొనరించు, సిరులు పంచు
    హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

    విశ్వజనులార! కవులార! విజ్ఞులార!
    పరమహితులైన సాహితీ బంధులార!
    జాగుసేయగ నికనేల? సత్వరముగ
    హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

    అన్యభాషలపై మోజు నధికముగను
    దాల్చగానేల? సరళమై తథ్యముగను
    "దేశభాషల లెస్స"యీ తెలుగు గాన
    హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

    కులము, మతములు, గోత్రాలు తలపకుండ
    పిన్న పెద్దల భేదాల నెన్నకుండ
    మంచి పలుకుల బ్రేమను బంచు చుండు
    హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

    జనుల నొకత్రాట నిలబెట్టి యనుపమగతి
    నైకమత్యము బోధించు హర్షమునను
    తెలుగునకు సాటి వేరొండు కలదె యెందు?
    హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.

    రిప్లయితొలగించండి
  7. మాయగా పంచు మోహిని భయము లేదు
    వివిధ చందస్సు వృత్తాలు వెల్లు వలుగ
    మదిని యలరించు రసరమ్య మధువు లవియె
    హాయిగా గ్రోల రారె యాంధ్రా మృతమ్ము

    రిప్లయితొలగించండి
  8. ద్వర్ధికావ్యమును మనకు భావమలర
    జెప్పు,పదవిభజనెటులొ జేసి చూపు
    దారి కానకనున్న విద్యార్ధులార!
    హాయిగా గ్రోల రారె "యాంధ్రామృతమ్ము".

    రిప్లయితొలగించండి
  9. కంది శంకరులుసత్ కవులను పురిఁగొల్పి పద్యముల్ వ్రాయించి ప్రతిభఁ గొల్పె.
    గోలి హనుమతాఖ్య గొప్పగా వివరించి గౌరవంబును పెంచె కరుణ తోడ.
    పండిత నేమాని ప్రతిభులు నన్ గూర్చి ఔదార్యమున వ్రాసి హాయిఁ గొలిపె.
    సహజ సిద్ధంబైన సహదేవు సత్కృతి సత్కావ్య ప్రతిభల సరస నిలిపె,
    ఘన హ.వేం.స.నా.మూర్తి సద్ఘనతఁ గొలిపె.
    రాజ రాజేశ్వరక్క నన్ ప్రాజ్ఞుఁ జేసె,
    ఊకదంపు డుయ్యాలలో నూపెనన్ను.
    ఇందరికిఁ గూడ నేజేతు వందనములు.
    http://andhraamrutham.blogspot.in/2012/11/blog-post_15.html
    మీ
    చింతా రామ కృష్ణా రావు.
    http://andhraamrutham.blogspot.com/
    http://yuvatarangam.blogspot.com/
    http://chramakrishnarao.blogspot.com/

    రిప్లయితొలగించండి
  10. ఆదికవి నన్నయాదుల ఆత్మనుండి
    పుట్టివేలసిన భాషకు పట్టువిడక
    గిడుగు, గురజాడ అద్దిరి నుడుల సొగసు
    హాయిగా గ్రోల రారె యంధ్రామృతంబు.

    విశ్వమంతట విరసిన విమల భాష
    తెలుగు వారందరికి నిండు వెలుగు నిచ్చు
    మాతృ భాషను ప్రేమతో మదిని నింపు
    హాయిగా గ్రోలరారె యంధ్రామృతంబు .

    దేశ భాషలలోకెల్ల తెలుగులెస్స
    భవ్య, సుందర, సుమధుర భాష మనది
    అమ్మ బాస కంటే భాష కమ్మగుండు
    హాయిగా గ్రోలరారె యంధ్రామృతంబు .ఆదికవి నన్నయాదుల ఆత్మనుండి
    పుట్టివేలసిన భాషకు పట్టువిడక
    గిడుగు, గురజాడ అద్దిరి నుడుల సొగసు
    హాయిగా గ్రోల రారె యంధ్రామృతంబు.

    విశ్వమంతట విరసిన విమల భాష
    తెలుగు వారందరికి నిండు వెలుగు నిచ్చు
    మాతృ భాషను ప్రేమతో మదిని నింపు
    హాయిగా గ్రోలరారె యంధ్రామృతంబు .

    దేశ భాషలలోకెల్ల తెలుగులెస్స
    భవ్య, సుందర, సుమధుర భాష మనది
    అమ్మ బాస కంటే భాష కమ్మగుండు
    హాయిగా గ్రోలరారె యంధ్రామృతంబు .

    రిప్లయితొలగించండి