18, నవంబర్ 2012, ఆదివారం

సమస్యా పూరణం - 881 (తమ్ము గోరి మరుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తమ్ము గోరి మడు ాహమ్మ జేసె.
ఈ సమస్యను పంపిన కవిమిత్రులకు ధన్యవాదములు.

17 కామెంట్‌లు:

  1. అమరపతి ప్రోత్సహింపగ నసుర నాశ
    నమ్మవశ్యమ్మనుచు భువనమ్ములకు హి
    తమ్ము గోరి మరుడు సాహసమ్ము జేసె
    త్ర్యంబకునిపై ప్రయోగించె నంబకమ్ము

    రిప్లయితొలగించండి
  2. హరుని గిరివర సుత మనో హరుని జేరి
    మరులను మదిలోన నిలుపు మనగ సురులు
    మనగ లేనని తెలిసియు జనెను జగహి
    తమ్ము గోరి మరుఁడు సాహసమ్ముఁ జేసె.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    చిన్న చిన్న సవరణలతో మీ పద్యమును ఇలా చదువుకొనెదము:
    హరుని గిరిరాట్సుతా మనోహరుని జేరి
    మరులను మదిలోన నిలుపు మనగ సురలు
    మనగ లేనని తెలిసియు జనె జగద్ధి
    తమ్ము గోరి మరుడు సాహసమ్ము జేసె

    రిప్లయితొలగించండి
  4. గిరికి బాలగా జనియించి గెలిచి శివుని
    మదిని, తారక సంహారమట్లు జరుగ
    వలయు నని యెంచి సురపతి పంప పర హి
    తమ్ము గోరి మరుఁడు సాహసమ్ముఁ జేసె.

    రిప్లయితొలగించండి
  5. ఈశ్వరాజ్ఞానుసారమీవిశ్వమందు
    సకలకార్యంబు నిచ్చలు జరుగుచుండు
    ననుచు సంశయములవీడియపుడు జనహి
    తమ్ముఁగోరిమరుఁడు సాహసమ్ముఁజేసె

    రిప్లయితొలగించండి
  6. కామితార్థద జగదంబ కామితంబు
    తీరునట్లుగ, సౌఖ్యంబు త్రిజగములకు
    నమరునట్లుగ, నమరహితము, శుభము స
    తమ్ము గోరి మరుడు సాహసమ్ము జేసె.

    రిప్లయితొలగించండి
  7. ఆ కుమారసంభవముకైయంగజుగని
    ఆది దంపతులఁగలుపఁనడుగ సురులు
    తారకాసురుఁగూల్చుటత్వరితమను హి
    తమ్ము గోరి మరుఁడుసాహసమ్ముజేసె

    రిప్లయితొలగించండి
  8. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
    మీరు దేవతలు అనే అర్థములో "సురులు" అని వాడేరు -- "సురలు" అని వాడాలి. రాక్షసులకు మాత్రము అసురులు అంటారు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ పండిత నేమాని గారూ ! నా పూరణ లోని దోషములను సరిచేసి చక్కని సవరణలను చేశారు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  10. తమ్ము లంతమ్మునగల శబ్దమ్ము లలర
    నద్భుతమ్ముగ గూర్చె పద్యమ్మును కవి
    వర్యు డేల్చూరి తత్కవిత్వమ్ము మెండు
    సొమ్ములును దమ్ములును గల్గి చొక్కుచుండు

    రిప్లయితొలగించండి
  11. డా.ఏల్చూరి వారి పునరాగమనం సంతోషదాయకం. మీ పూరణతో మంచి పద్యం చదివిన అనుభూతి కలిగింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ గురువులకు, పెద్దలకు ప్రణామములు!
    మాన్యుల బహుకాలదర్శనం!

    ప్రణవపూర్వకమంత్రపాపఠ్యమానేష్టిసమిధాజ్యముల నగ్ని సడలఁజేసి
    పద్మజ పద్మాక్ష ఫాలాక్షులకు నర్పితాహుతిచయ మెల్లఁ దానె మెసవి
    శతపూతక్రతుకృత్యసంభృతదేవేంద్రపదవిని ననుచితప్రభుతఁ గాంచి
    పితృదేవ యతిదేవ క్రతుభుక్కులకు నెల్ల ఋణమీఁగు తెరవుల నణఁచి వైచి

    తమ్ము నొంచు తారకుని యంతమ్ముఁ గోరు
    తమ్ములైన వేల్పులకు శాంతమ్ము సంత
    తమ్ముఁ గలుగ నీశ్వరుని చిత్తమ్ము ననుమ
    తమ్ముఁ గోరి మరుఁడు సాహసమ్ముఁ జేసె.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  13. పార్వతీ పరమేశ్వర పరిణయమ్ము
    సాధ్యమైనంతనె కుమారసంభవ మగు
    నతని కారణమున తారకాసురుని హ
    తమ్ముఁ గోరి మరుఁడు సాహసమ్ముఁ జేసె.

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమాని వారూ,
    ‘భువన హితమ్ము’తో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘జగ హితమ్ము’తో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ ‘పర హితమ్ము’ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ~జన హితమ్మును’ గోరిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. ‘హితము సతమ్ము’ గోరిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘సురలు’ గురించి నేమాని వ్యాఖ్యను గమనించారు కదా!
    ‘సంభవముకై’ అనకూడదు - ‘సంభవమునకై’ అనాలి. దానిని ‘సంభవమున కంగజు గని’ అందాం.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    సమర్థ శబ్దోపేతమై, శబ్దాలంకార శోభితమై మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. శివుని సంతతి యుండిన శ్రేయ మగును
    అనుచు నింద్రుడు నొకపరి మరుని బంపె
    ఏది యెటులైన గానిమ్ము తుదకు జనహి
    తమ్ము గోరి మరుడు సాహ సమ్ము జేసె !

    రిప్లయితొలగించండి
  16. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘శ్రేయ మగును + అనుచు’ అని విసంధిగా వ్రాయకూడదు కదా! అక్కడ ‘శ్రేయ మొసగు ననుచు’ అని నా సవరణ....

    రిప్లయితొలగించండి