27, నవంబర్ 2012, మంగళవారం

సమస్యా పూరణం - 889 (మగవారికి పసుపు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మగవారికి పసుపు కుంకుమల నిడుట తగున్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రులకు ధన్యవాదములు.

18 కామెంట్‌లు:

  1. మగడున్న మగువ లందరు
    సిగలోపల పూలు దురిమి చెలువము మీరున్
    తగు వారు సోదరికి ప్రే
    మగ వారికి పసుపు కుంకుమల నిడుట తగున్.

    రిప్లయితొలగించండి
  2. నగజాత రూప లనుచును
    దగు రీతిగ నైదువల సదా గొల్చుచు ని
    మ్ముగ నోములలో ప్రే
    మగ వారికి పసుపు కుంకుమల నిడుట తగున్

    రిప్లయితొలగించండి
  3. మగువలు జగదభిరామం
    బుగ మన కడ కేగుదెంచ పూజించ వలెన్.
    జగమేలెడి తల్లులు ప్రే
    మగ, వారికి పసుపు కుంకుమల నిడుట తగున్.

    రిప్లయితొలగించండి
  4. వధూవరులు లక్ష్మీనారాయణులను భావంతో...
    తగువానిఁదెచ్చి చెల్లికి
    మిగుల ముదము గూర్చి,పెళ్లి మిన్నగఁగావిం
    చి,గుడి బనుపు రీతిగ ప్రే
    మగ వారికి పసుపు కుంకుమల నిడుటతగున్!

    రిప్లయితొలగించండి
  5. మగని సహోదరి వచ్చుట
    తగురీతిని ప్రీతి బడయ; ధనములకగునా?
    మగని మనమునెఱిగిన భా
    మగ వారికి పసుపు కుంకుమల నిడుట తగున్.

    తన ఇంటికి ఆడపడచులు వచ్చేది సోదరుని ప్రేమతోనే గానీ ఆస్తి కోసం కాదని తెలుసుకొని భామలు మసలుకొనవలెను.

    రిప్లయితొలగించండి
  6. పగలే మగువగ వేషము!
    నగలెన్నో దాల్చి వగల నడయాడుచు పం
    డుగలన్ వేడుక జేసెడు
    మగవారికి పసుపు కుంకుమలనిడుట తగున్!

    రిప్లయితొలగించండి
  7. ఒక సతి, యుద్ధరంగమునుండి పారిపోయివచ్చిన తన భర్తను జూచి అంటున్న మాటలు.....

    తెగువలఁజూపక రణమున్
    పగతులకడ ప్రాణభిక్షఁవడసితివేలా?
    నగుబాటుజెందు నీసరి
    మగవారికి పసుపుకుంకుమలనిడుట తగున్.

    రిప్లయితొలగించండి
  8. పగవారితోడ సమరము
    తగు క్షత్రియ పురుషులకును ; ధర్మం బదియే !
    బిగువున యుద్దము చేయని
    మగవారికి పసుపు కుంకుమల నిడుట తగున్

    రిప్లయితొలగించండి
  9. తగు నుత్తరీయము లిడుట
    మగవారికి ; పసుపు కుంకుమల నిడుట తగున్
    మగువలకు ; పిల్లవాండ్లకు
    దగు నాశీర్వచనములిడ; ధరలోనెపుడున్

    రిప్లయితొలగించండి
  10. pagadeeru samayamuna marala
    tagaulu tagavani palekedu Dharamasuthunithoo
    ragiledu Bhimudanenu ee
    magavariki pasupu kumkumala neduta tagun

    రిప్లయితొలగించండి

  11. పగతీరు సమయమందున
    తగవులు తగవని పలికెడు ధర్మసుతునితో
    రగిలెడు భీముం డనె నీ
    మగవారికి పసుపు కుంకుమల నిడుట తగున్.

    రిప్లయితొలగించండి
  12. జగతికి మగువలె మూలము
    తగు శుభ కార్యములకెల్ల దప్పక వారిన్
    మగవా రంపగ, బహు ప్రే
    మగవారికి పసుపు కుంకుమల నిడుట తగున్.

    రిప్లయితొలగించండి
  13. మొగమున కుంకుమ బొట్టిడి
    సగ భాగము వరకు పంచె సౌందర్యముగా !
    నిగుడించు పెండ్లి కొడుకగు
    మగ వారికి పసుపు కుంకుమల నిడుట తగున్ !

    శ్రీమతి లక్ష్మీ దేవి గారూ ! మీ పద్యాలు ఎప్పుడూ బాగుంటాయి.చెయి దిరిగిన పండితులు మీరంతా . మీరన్నట్టు , ఆడ వారు పుట్టింటికి , తల్లి దండ్రుల ప్రేమ కోసం , అన్నదమ్ముల ఆప్యాయత కోసం , ఎన్నో మమతలు మూట గట్టుకుని వెడతారు. ఆస్తుల కోసం కాదు ఆ అనురాగ బంధాలు వర్ణనా తీతం. చక్కగా చెప్పారు .ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  14. లక్ష్మీదేవిగారు, రాజేశ్వరక్కయ్యగారూ చెప్పాక నిజమే గాబోలు అనుకోవాలి. కానీ తరం మారిందేమో! ఆడపడుచులు కూడా అదిరించీ, బెదిరించీ ఆస్తి కొట్టుకుపోతున్నారు అన్నదమ్ములక్కర లేదనుకొని. కాలం మారింది,మరి కాలోహి దురతిక్రమ:.

    రిప్లయితొలగించండి
  15. సువాసినీపూజ సందర్భంగా:
    అగరు సుగంధంబు లలది
    సొగసందు సువాసినులకు సుందరు డగుపిం
    చగనే భోజనమిడి క
    మ్మగ; వారికి పసుపు కుంకుమల నిడుట తగున్.
    సుందరుడు=చందమామ

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రులకు వందనాలు.
    పనుల ఒత్తిడి వలన నిన్నంతా బ్లాగు చూడటం వీలుకాలేదు. మన్నించాలి.
    ‘ప్రేమగ, కమ్మగ’మగవారికి పసుపు కుంకుమ లందించే పూరణలను వైవిధ్యంగా, సమర్థంగా చేసిన కవిమిత్రులు....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    చింతా రామకృష్ణారావు గారికి,
    సహదేవుడు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    అజ్ఞాత గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    చంద్రశేఖర్ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. పేరంటము:

    అగజాతకు, వరలక్ష్మికి
    నగుమోమున పూజచేసి, నారీ వనికిన్;
    తగు రీతిగ వీడ్కోలిడి
    మగవారికి; పసుపు కుంకుమల నిడుట తగున్

    రిప్లయితొలగించండి
  18. వగచుచు నమేథి వీడుచు
    రగడకు భయపడి త్యజించి రక్కసి తోడన్
    జగడము చేయక పరుగిడు
    మగవారికి పసుపు కుంకుమల నిడుట తగున్

    రిప్లయితొలగించండి