30, నవంబర్ 2012, శుక్రవారం

సమస్యా పూరణం - 892 (విద్య వినయమ్ము నిచ్చునా)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
విద్య వినయమ్ము నిచ్చునా వెఱ్ఱివాఁడ!

23 కామెంట్‌లు:

  1. విపణివీధిలో నిలుచునే వినయ మకట?
    విద్య వ్యాపారమయ్యెను విత్తముగల
    వాడె కొనుచుండె విద్య నీనాడు కనుక
    విద్య వినయమ్ము నిచ్చునే వెర్రివాడ?

    రిప్లయితొలగించండి

  2. బుద్ధి మంతుడ వీవురా - బుజ్జి కన్న !
    చదువు బుద్ధిని పెంచురా - చంటి వాడ !
    పరుష పదములు వీడు - నా పసిడి కొండ !
    విద్య వినయమ్ము నిచ్చు - నా వెఱ్ఱివాఁడ !

    రిప్లయితొలగించండి
  3. వేదవిద్యలు భాగవతాదిగాగ
    మాతృభాషనువదలిదుర్మార్గమైన
    కుత్సితంబులు ధనయోగ కుహరములగు
    విద్యవినయమ్మునిచ్చునా వెఱ్ఱివాడ.

    రిప్లయితొలగించండి
  4. మునుపు బోధించు పద్ధతి మూలబెట్టి
    పరుల సంస్కృతి మేలని పరుగులెత్తి
    ధనము తో ధనము కొఱకు తపన పెంచు
    విద్య వినయము నిచ్చునా వెఱ్ఱి వాడ!

    రిప్లయితొలగించండి

  5. విద్య ధరలోనఁ దగురీతి వృత్తి నిచ్చు
    వృత్తి పరిణామ మొందుచు విత్త మగును
    విత్త బలమున గన్నులున్ నెత్తి కెక్క
    విద్య వినయమ్ము నిచ్చునా ? వెఱ్ఱివాడ !

    రిప్లయితొలగించండి
  6. మిస్సన్న గారూ ! నమస్సులు. సంస్కృత శ్లోక మిదేనా ?

    విద్యా దదాతి వినయం
    వినయం ద్యాతి పాత్రతం
    పాత్రత్వా ధన మాప్నోతి
    ధనాత్ ధర్మం తతత్సుఖం

    రిప్లయితొలగించండి
  7. ఏమరుపాటున ముందుకు వెనుకకు వెళ్ళామా ,శంకరాభరణములో వ్యాఖ్యలు ద్విగుణీకృత మవుతున్నాయి !

    రిప్లయితొలగించండి
  8. డా. మూర్తి మిత్రమా! అందుకే చంద్రభాసురం వేసుకొని పద్యం వ్రాసే ప్రయత్నం చేయకండి. అసలే ఆకాశంలో చంద్రుడు వెలిగిపోతున్నాడీవేళ:-)

    రిప్లయితొలగించండి
  9. కోటివిద్యలు గరుపుట కూటి కొరకె
    కొన్నవిద్యలు కొంపలఁ గూల్చునటర
    చట్టుబండల పాల్జేయు సాఫ్టువేరు
    విద్య వినయమ్ము నిచ్చునా వెఱ్ఱివాఁడ!
    పిట్సుబర్గ్ రఘునందనా! పిచ్చివాడ!

    రిప్లయితొలగించండి
  10. తమ్ముడు చి. డా. నరసింహమూర్తికి శుభాశీస్సులు.
    ఆ శ్లోకమును ఈ క్రింద వ్రాయుచున్నాను:

    విద్యా దదాతి వినయం
    వినయాద్యాతి పాత్రతః
    పాత్రత్వాద్ధన మాప్నోతి
    ధనా ద్ధర్మం తతస్సుఖం

    దీనికి నా అనువాదము:

    విద్య వలన వచ్చు వినయమ్ము ధరలోన
    దాని వలన పాత్రతయును వచ్చు
    ధనము వచ్చు నటులె ధర్మము వలనను
    సుఖము గలుగుచుండు సుజన తతికి

    స్వస్తి



    రిప్లయితొలగించండి
  11. విద్య నేర్చిన వినయమ్ము మిథ్య జూడ!
    గర్వ పోతులఁ జేసియు కనులు మూయు!
    వినయ మన్నది సంస్కార విలువ లేను!
    విద్య వినయమ్ము గూర్చునా వెఱ్ఱవాఁడ!

    రిప్లయితొలగించండి

  12. నీతి నియమ సంస్కారము నేర్పునట్టి
    నాటి గురుకుల విద్యకు సాటి యేది?
    పొట్ట కూటి కొఱకు నేర్చు నట్టి నేటి
    విద్య వినయమ్ము నిచ్చునా వెఱ్ఱివాడ.

    రిప్లయితొలగించండి
  13. peddalanu Dhikkarimchu nee buDhi thagadu
    nearchinadarakora megula nearva valayu
    medimedi chaduvahamkaara mechhu raa , ya
    vidya vinayammu nechhuna verri vaada

    రిప్లయితొలగించండి

  14. పెద్దలను ధిక్కరించు నీ బుద్ధి తగదు
    నేర్చిన దరకొర మిగుల నేర్వవలయు
    మిడిమిడి చదు వహంకార మిచ్చురా, య
    విద్య వినయమ్ము నిచ్చునా వెర్రివాడ.

    రిప్లయితొలగించండి
  15. సజ్జనుడు కీర్తి గాంచును చదువు వలన
    విద్య నేర్చి దుర్జనుడును వినుతి కెక్కు
    అతి వినయము ధూర్త గుణమే యన ఖలునకు
    విద్య వినయమ్ము నిచ్చునా వెఱ్ఱి వాడ !

    రిప్లయితొలగించండి
  16. ' విద్యాఖని ' అన్నయ్య గారికి నమస్సులు,ధన్యవాదములు.

    చంద్రశేఖర్ గారూ, తప్పించడము కష్టముగానే నున్నది,అయినా తగ్గిస్తున్నాను !

    రిప్లయితొలగించండి
  17. పండిత నేమాని వారూ,
    వ్యాపార విద్య వినయాన్ని ఇవ్వదని చక్కగా పూరించారు. అభినందనలు.
    ‘విద్యా దదాతి వినయం’ శ్లోకానువాదం చాలా బాగుంది. ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    పరవిద్యలు వినయాన్ని ఇవ్వవని మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ధనసంపాదనే ధ్యేయమని చెప్పే విద్యను నిరసిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    విద్య వలన ఉపాధి, ఉపాధిలో సఫలత వలన ధనప్రాప్తి. దానితో గర్వం... అట్టి గర్వం కలిగిన విద్యావంతుని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    నిజమే... సాఫ్టువేరు ఉద్యోగుల ‘బాడి లాంగ్వేజ్’ ప్రత్యేకంగా వుంటుంది. కొందరిలో అతి వినయమూ కనిపిస్తుంది. మరికొందరిలో గర్వమూ తొణికిసలాడుతుంది. మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    అజ్ఞాత గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. బుద్ధి కుశలత లేకున్న వ్యర్ధ మగును
    వినయ మన్నది విలసిత వేడు కౌనె ?
    కొనగ పైకము చాలును కొసరి చదువ
    విద్య వినయమ్ము నిచ్చునా వెఱ్ఱి వాఁ డ ?

    రిప్లయితొలగించండి
  19. మూర్తి మిత్రమా! నాకు సంస్కృత శ్లోకం తెలియదు కానీ, నా చిన్నతనంలో మానాన్న గారు క్రింది పద్యం చదువుతూ ఉండేవారు.

    విద్య యొసగును వినయంబు వినయమునను
    బడయు పాత్రత పాత్రత వలన ధనము
    ధనము వలనను ధర్మంబు దాని వలన
    నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు.

    ఈ పద్యాన్ని కొంచెం మార్చి కాపీ కొట్టేద్దా మనుకొన్నాను కానీ పల్టీ కొట్టేను. అందుచేత విరమించుకొన్నాను.

    నేమాని పండితులవారి ద్వారా మూల శ్లోకాన్ని తెలుసుకో గలిగేను.

    ఉభయులకూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    `విలసిత వేడుకా సమాసం?
    *
    మిస్సన్న గారూ,
    అసలు కాపీ కొట్టింది నేను. నా సమస్యకు స్ఫూర్తి ఆ పద్యమే. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి



  21. విద్య యొసగును వినయమన్ పద్యపాద
    మద్ది పాతపాటయెకాదె యిద్దినాల
    చదువుచేత గర్వమ్మతిశయము గాంచు
    విద్య వినయమ్ము నిచ్చునా వెర్రివాడ!

    రిప్లయితొలగించండి