గురువుగారికి, సభలోని అందరికీ నమస్కారములు. నెట్, సిస్టమ్ సమస్యల వలన, మరికొన్ని పనుల వలన సభలో పాల్గొనలేకపోతున్నందుకు విచారంగా ఉన్నది. ఈ రోజు నుంచి మెఱుగవుతుందనుకుంటున్నాను. ఈ భద్రకాళి గురించి ఏమైనా చెప్పమని గురువుగారిని అడగాలని అనుకుంటూ ఉన్నాను గత కొద్దికాలంగా. గురువు గారే ప్రస్తావించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. భద్రకాళి అమ్మవారి దర్శనము, అన్ని పూరణలు మనసుకు ఆనందాన్ని కలిగించాయి. పండితులవారి హృద్రాజీవ విహారిణీ పదప్రయోగం అందంగా ఉంది.
భద్రము గూర్చగా తెలుగు వారికి మాలిమి నోరుగల్లులో క్షుద్రుల యాట గట్టి తన శూలము ఖడ్గము పాశ శక్తులన్, రుద్రుని రాణి కొల్వయెను రూఢిగ చూడుడు భద్రకాళియై! ఛిద్రము గాక సఖ్యతలు స్నేహము పెంచెడి నామె దృక్కులే.
ఓరుగల్లు భద్రకాళి దర్శించి భక్తిపారవశ్యంతో చక్కని పద్యాలు వ్రాసిన మిస్సన్న గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి పండిత నేమాని వారికి, సుబ్బారావు గారికి, లక్ష్మీదేవి గారికి, హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి, రాజేశ్వరి అక్కయ్యకు అభినందనలు, ధన్యవాదాలు. * లక్ష్మీదేవి గారూ, మీరు కోరినట్లు త్వరలోనే వరంగల్ భద్రకాళి క్షేత్ర ప్రాశస్త్యాన్ని వివరంగా తెలియజేస్తాను.
పండితులవారికి నమస్కారములు. భగవంతుని దయతో పదములను అందంగా మలచగలగడం తమరి నుంచి నేర్చుకోగలగాలి. ధన్యవాదములు. తమరు వ్రాసిన శ్రీరాముని మానసపూజ చదివి ఎంతో ఆనందించినాను. పట్టాభిషేకము వరకూ పూర్తిగా రామకథను వినిపించినారు. అద్భుతముగానున్నది.
అజ్ఞాత గారు వరదాభయప్రద కరీ గురించి అడిగేరు. నేను వ్రాసినప్పుడు కరములు కలది కరీ అని అనుకొనినాను. ఆలాగుననే భక్తి స్తోత్రములలో పునరుక్తి దోషము కాదు అని ఆర్యోక్తి. జగన్మాత యొక్క రూపము అన్ని వర్ణములు కావున క రీ అనే రెండు అక్షరములు కూడా అమ్మ నామములే అని కూడా అన్వయించుకొన వచ్చును. స్వస్తి.
భద్ర కాళి వగుచు భద్రముగా నేల
రిప్లయితొలగించండితెలుగు నేల పైన స్థిరముగాను
వెలసినట్టి తల్లి వేవేలు దండాలు
సహనమిచ్చి గాచు జాతి నెల్ల.
కరుణ జిలికెడి మోముతో కమల నయన
రిప్లయితొలగించండిభద్ర మిచ్చెద నంచు తా భక్తులకును
భద్ర కాళిగ నిలచెగా భయము విడచి
ఓరుగంటికి రండయా ఉరుకులిడుచు.
కరుణ జిలికెడి మోముతో కమల నయన
రిప్లయితొలగించండిభద్ర మిచ్చెద నంచు తా భక్తులకును
భద్ర కాళిగ నిలచెగా భక్తి మీర
ఓరుగంటికి రండయా ఉరుకులిడుచు.
భద్రంబుల్ పొనగూర్చుచుండు జననీ! భద్రేశ్వరీ! భాస్వరీ!
రిప్లయితొలగించండిచిద్రూపా! వరదాభయప్రద కరీ! శ్రీకాకతీయార్చితా!
అద్రీంద్రాత్మభవా! భవామయహరీ! ఆనందసంధాయినీ!
హృద్రాజీవ విహారిణీ! నతులు తల్లీ! భద్రకాళీశ్వరీ!
ఓరుగల్లున వెలసిన భద్ర కాళి !
రిప్లయితొలగించండిపూజ సేయంగ నేర్తు మా పురికి రమ్ము
నేను రాలేక దరికినీ నిన్ను గోరు
చుంటి నిక నీవు గరుణను జూపు తల్లి !
గురువుగారికి,
రిప్లయితొలగించండిసభలోని అందరికీ నమస్కారములు.
నెట్, సిస్టమ్ సమస్యల వలన, మరికొన్ని పనుల వలన సభలో పాల్గొనలేకపోతున్నందుకు విచారంగా ఉన్నది. ఈ రోజు నుంచి మెఱుగవుతుందనుకుంటున్నాను.
ఈ భద్రకాళి గురించి ఏమైనా చెప్పమని గురువుగారిని అడగాలని అనుకుంటూ ఉన్నాను గత కొద్దికాలంగా.
గురువు గారే ప్రస్తావించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.
భద్రకాళి అమ్మవారి దర్శనము, అన్ని పూరణలు మనసుకు ఆనందాన్ని కలిగించాయి.
పండితులవారి హృద్రాజీవ విహారిణీ పదప్రయోగం అందంగా ఉంది.
నా ప్రయత్నము.
అద్రీశ సుతయగు గిరిజ
భద్రముగ నిచట నిలిచెనె, పార్వతి గొల్తున్
నిద్రాదుల విడచి, మొఱను
తద్రూపముగా విని యిక దయ జూపగదే!
అమ్మా! లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యమును అన్వయ సౌలభ్యము కొరకు చిన్న చిన్న మార్పులతో ఇలాగ వ్రాసేను. చూడండి.
అద్రిసుత భద్రకాళిని
భద్రముగ నిచట నిలిచిన వరదాయిని నే
నిద్రాదులు విడిచి కొలుతు
సద్రసమయి! మొరను వినుము జననీ! యనుచున్
మరొక్క మాట. శ్రీరామ మానసపూజను నేను వ్రాసి మొన్న మన బ్లాగులోనే ఉంచేను. అవకాశమును బట్టి చూడండి. స్వస్తి.
భక్తితో జేరి నినుగొల్చువారి కెపుడు
రిప్లయితొలగించండిభద్రములు గూర్చి కోరిన వరములిచ్చి
కాచుచుందువు జగదంబ! కరుణతోడ
ప్రణతులొనరింతు గొనుమమ్మ భద్రకాళి!
భద్రము గూర్చగా తెలుగు వారికి మాలిమి నోరుగల్లులో
రిప్లయితొలగించండిక్షుద్రుల యాట గట్టి తన శూలము ఖడ్గము పాశ శక్తులన్,
రుద్రుని రాణి కొల్వయెను రూఢిగ చూడుడు భద్రకాళియై!
ఛిద్రము గాక సఖ్యతలు స్నేహము పెంచెడి నామె దృక్కులే.
పాపములను తొల గించగ
రిప్లయితొలగించండికాపాడుము జనుల నెల్ల కాళివి నీవై !
శాపముల నీయ కుండగ
మాపాలి కల్ప వల్లీ మముబ్రోవ గదే !
ఓరుగల్లు భద్రకాళి దర్శించి భక్తిపారవశ్యంతో చక్కని పద్యాలు వ్రాసిన
రిప్లయితొలగించండిమిస్సన్న గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
పండిత నేమాని వారికి,
సుబ్బారావు గారికి,
లక్ష్మీదేవి గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు
అభినందనలు, ధన్యవాదాలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీరు కోరినట్లు త్వరలోనే వరంగల్ భద్రకాళి క్షేత్ర ప్రాశస్త్యాన్ని వివరంగా తెలియజేస్తాను.
పండితులవారికి
రిప్లయితొలగించండినమస్కారములు.
భగవంతుని దయతో పదములను అందంగా మలచగలగడం తమరి నుంచి నేర్చుకోగలగాలి.
ధన్యవాదములు.
తమరు వ్రాసిన శ్రీరాముని మానసపూజ చదివి ఎంతో ఆనందించినాను.
పట్టాభిషేకము వరకూ పూర్తిగా రామకథను వినిపించినారు. అద్భుతముగానున్నది.
మిస్సన్న గారి స్ఫూర్తితో...
ఛిద్రము చేయనౌనె మము, క్షేమము తోడను కూడియుండగా
భద్రము జేయుమమ్మ! తగు పాలక శ్రేణిని బంపి గావుమా!
క్షుద్రుల యాటకట్టగను చోదక శక్తిని నింపరావె, మా
రుద్రుని పత్నివై దయను రోదన బాపవె కాళికాంబికా!
గురువుగారు, ధన్యవాదాలు.
లక్ష్మీదేవి గారూ ఏది ఏమైనా మీరు లేని లోటు కొట్టొచ్చినట్లు కనుపిస్తుందంటే నమ్మండి.
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి నమస్కారాలతో - 'వరద అభయ ప్రద ' తరువాత కరీ అంటే పునరుక్తి వస్తుందేమో కదా
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారు వరదాభయప్రద కరీ గురించి అడిగేరు. నేను వ్రాసినప్పుడు కరములు కలది కరీ అని అనుకొనినాను. ఆలాగుననే భక్తి స్తోత్రములలో పునరుక్తి దోషము కాదు అని ఆర్యోక్తి. జగన్మాత యొక్క రూపము అన్ని వర్ణములు కావున క రీ అనే రెండు అక్షరములు కూడా అమ్మ నామములే అని కూడా అన్వయించుకొన వచ్చును. స్వస్తి.
రిప్లయితొలగించండిఓరుగల్లునందు ఓపిక తోడను
రిప్లయితొలగించండివెలసినావు మాదు వెతలు దీర్చ
బాధ దీర్చి మమ్ము భద్రంగ కాపాడి
అపర భద్రకాళి వయ్యినావు!
జంగిడి రాజేందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం.
కాని భద్రకాళిని అపర భద్రకాళి అనడం ఎందుకు?
మీ పద్యానికి నా సవరణలు...
ఓరుగల్లునందు నోపికతోడను
వెలసినావు మాదు వెతలు దీర్చ
బాధ దీర్చి మమ్ము భద్రముగా బ్రోచు
భద్రకాళి నీకు వందనములు.