13, నవంబర్ 2012, మంగళవారం

దీపావళీ శుభాకాంక్షలు


 మిత్రులారా!

  కలుగుచు పెక్కు సంపదలు కాంతిమయమ్ముగ మీ హృదంబుజం
బలరును గాక! శాంతిమయమై శుభ పర్వము మీకు పెక్కు కా
న్కల గొనితెచ్చు గాక! యని కమ్ర మనమ్మున గూర్తు దీవనల్
లలిత గుణాఢ్యులార! సుఫలమ్ముల నొందుడు శుద్ధ కీర్తులై


పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

4 కామెంట్‌లు:

 1. గురువర్యులు, కవిమిత్రులు, బ్లాగు వీక్షకులందరకు దీపావళి శుభాకాంక్షలు.

  ఈ వేళన దీపావళి
  ఈ వెలుగుల వరుసలన్ని ఇంతింతంతై
  ఈవలయుగాక యందరి
  జీవితమున వెలుగు రేఖ శ్రీకృష్ణుండే.

  రిప్లయితొలగించండి
 2. నేమాని పండితార్యులకూ, గురువులకూ, పెద్దలకూ, కవి పండితులకూ, మిత్రులందరికీ
  దీపావళీ శుభాకాంక్షలు.

  దీపము పరమ బ్రహ్మము
  దీపపు దీప్తుల్ హరించు తిమిరపు తతులన్
  దీపమున సాధ్య మెల్లను
  దీపమునకు మ్రొక్క రారె ధీయుతులారా!

  రిప్లయితొలగించండి
 3. ధన్యవాదశతము మాన్య! పండితవర్య!
  శుభకరంబులైన సూక్తులకును
  ఇనుమడించుయశము లీపర్వరాజంబు
  కూర్చుగాత మీకు కువలయమున.

  మిత్రులార! సతము మీకందవలెనెందు
  శుభము లందమైన విభవదీప్తి
  స్థిరత జీవనాన దీపావళీపర్వ
  మొసగు గాత సుఖము లుర్విలోన.

  రిప్లయితొలగించండి
 4. పూజ్య గురువులు శ్రీ పండితుల వారికి పాదాభి వందనములు. సోదరు లందరికీ దీపావళి శుభా కాంక్షలు

  రిప్లయితొలగించండి