26, నవంబర్ 2012, సోమవారం

పద్య రచన - 172

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

 1. రోట గట్ట తల్లి రోదించ లేదతడు
  మద్ది చెట్ల జేరి మధ్య లాగె
  చెట్టు రూపు పోయి చేయెత్తి మ్రొక్కిరి
  శాప మంత తొలగి శౌరి కపుడు.

  రిప్లయితొలగించండి
 2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  వేగంగా స్పందించి చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
  ‘లేదతడు’ అన్నప్పుడు గణదోషం. ‘రోదించనేలేదు’ అందాం.

  రిప్లయితొలగించండి
 3. పాలుత్రాగగపూతనప్రాణమెగిరె!
  కాలితోడనెకాళీయుగర్వమడచె!
  రోలులాగగమ్రాకులరూపుమారె!
  చిన్నికృష్ణయ్యలీలలనెన్నతరమె!

  రిప్లయితొలగించండి
 4. సహదేవుడు గారూ,
  అద్భుతమైన పద్యం వ్రాసారు. అభినందనలు.
  పదాల మధ్య ఎడం (space) ఉండేట్టు చూడండి.

  రిప్లయితొలగించండి
 5. పట్టగరాని దుందుడుకు బాలుని యాగడముల్ సహింపకే
  కట్టె యశోద త్రాడు గొని గట్టిగ రోటికి బాలకృష్ణు నా
  పట్టియు నవ్వు చిందుచును పర్విడి యేగెను మద్ది చెట్టులై
  నట్టి విషణ్ణ చిత్తులకు నంతట శాపము బాపె సత్కృపన్

  రిప్లయితొలగించండి

 6. మాస్టరు గారూ! ధన్యవాదములు. నిజమే ..తొందరలో గమనించలేదు....
  సహదేవుడు గారి పూరణ లలితముగా చిన్ని కృష్ణుని నడకలా ఉన్నది
  శ్రీ నేమాని వారి పద్యపు నడక కన్నయ్య రోటిని త్వరగా దొర్లించుచున్న భావన కల్గించినది.

  మీరు చేసిన సవరణతో..

  రోట గట్ట తల్లి రోదించ నేలేదు
  మద్ది చెట్ల జేరి మధ్య లాగె
  చెట్టు రూపు పోయి చేయెత్తి మ్రొక్కిరి
  శాప మంత తొలగి శౌరి కపుడు.

  రిప్లయితొలగించండి
 7. చిట్టి బాలుని గోపమ్మ కట్టె రోట!
  గట్టి వాడాతడేగి ఢీ కొట్టె చెట్ల
  నిట్టె! కట్టుక జేతుల నెట్ట యెదుట
  పట్టికిని మ్రొక్క యక్షు లప్పట్టున గన.

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. ఎట్టెట్టూ! శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
  మీరు ఒక గట్టి పట్టు బట్టి గట్టిగ దట్టించేరు శబ్దాలంకారమును. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. కరుణన్ మమ్ములగావవచ్చితివి, నిక్కంబౌమహాత్ముండవే!
  వరమై శాపము- దర్శనంబొసగితే! పాలింప మమ్మిచ్చటన్
  చిఱు బాలుండుగ, ఱోటినిన్ జనని శిక్షింపంగ బంధంబునున్
  భరియింపంగ దయాళువై నిలిచితే! పంకేరుహాక్షా!హరీ!

  రిప్లయితొలగించండి
 12. మిత్రులారా!
  ఈనాటి చిత్రములోని శాప విముక్తులైన ఇద్దరు గుహ్యకులునూ (1) నలకూబరుడు మరియు (2) మణిగ్రీవుడు అను నామముల గల వారు - వారు కుబేరుని పుత్రులు. నారద మహర్షి శాపమున వారు మద్ది చెట్లుగా మారిపోయిరి. పిదప శ్రీ కృష్ణుని కృపచేత వారు శాపవిముక్తులైరి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 13. శ్రీగురుభ్యోనమః
  గురువుగారికి మరియు కవిమిత్రులు శ్రీగోలి వారికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 14. పండిత నేమాని వారూ,
  మనోహరంగా ఉంది మీ పద్యం. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  వృత్యనుప్రాసతో మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  అన్ని విధాల మీ పద్యం ప్రశంసార్హమై శోభిస్తున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. భక్త భవబంధముల ద్రెంచు బాలకృష్ణ !
  ఎవరు నిన్ను రోకటికి బంధించగలరు !?
  మద్ది చెట్లను పడగొట్ట నెద్ది లీల ?
  దివ్య పురుషులై నిలచిరి దీప్తితోడ

  రిప్లయితొలగించండి
 16. రోట గట్టి నంత రోయకుండ నతడు
  పరుగు నేగు దెంచె తరుల నడుమ
  ముక్తి నొంది వారు పొంది రసలు రూపు
  వెన్ను నకును మ్రొక్కి సన్ను తించె !

  రిప్లయితొలగించండి
 17. శబ్దాలంకారముల నుపయోగించి ఒక మంచి పద్యమును వ్రాసిన మిస్సన్న గారికి అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. నాగరాజు రవీందర్ గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  మిస్సన్న మహాశయుల స్ఫూర్తితో :

  మొద్దులను ముద్దు లొలుకునట్లు దిద్దిన ముద్దు కృష్ణుడు :

  01)
  _______________________________

  మొద్దు వంచును నిను దిద్ద - ముద్దరాలు
  ముద్దు ముద్దుగ నిను రుద్ద - నద్దె రోట
  మద్ది చెట్లను గుద్దిన - ముద్దు కృష్ణ
  మొద్దులను దిద్దినావదె - ముద్దు లొలుక !
  _______________________________

  రిప్లయితొలగించండి
 20. నేమాని పండితార్యా మీ ప్రశంస చాలా ఆనందాన్ని కల్గించింది.
  గురువుగారూ ధన్యవాదాలు.
  రవీందర్ గారూ ధన్యవాదాలు. మీ పూరణలు చాలా బాగుంటున్నాయి.

  రిప్లయితొలగించండి