19, నవంబర్ 2012, సోమవారం

పద్య రచన - 165

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8 కామెంట్‌లు:

  1. మతసామరస్యమ్ము మనకు ముఖ్య మటంచు
    ....చెప్పుచు నున్నట్టి చిత్రమద్ది
    వింత వింతలు గొల్పు వేషముల్ వేసెడు
    ....నట్టి ప్రదర్శన మచట నుండు
    నల్లని బురఖాను నాళీక ముఖి యోర్తు
    ....దాల్చె నిస్లాముల తరుణివోలె
    వేణు గోపాలుని వేషమ్ములో ముద్దు
    ....గొల్పు చుండెను చిన్న కుర్రవాడు
    తల్లి చేయూతమున్ గొని పిల్ల వాడు
    సంతసమ్మున వీధిలో జనుచు నుండ
    చూచు వారల కెంతయు చోద్యముకద
    ప్రథమ బహుమతి వారికే వచ్చు నేమొ?

    రిప్లయితొలగించండి
  2. పిల్లన గ్రోవిని ఊదే
    అల్లరి కన్నయ్య చేతి 'నల్లా ' పట్టెన్
    చెల్లని వారలు చూడుడు
    అల్లన మత సామరస్య మనగా నిదియే.

    రిప్లయితొలగించండి
  3. బురఖాధరించువారికి
    సరదాలుండవె?మురళిని చక్కగకరమున్
    చిరుతడుఁబట్టగఁదీరదె
    మురిపెము తల్లికిఁ?దరింత్రుముస్లిములైనన్!

    రిప్లయితొలగించండి
  4. పసివాని కోర్కె దీర్చగ
    ముసిలిములే యైన గాని ముచ్చట కొఱ కై !
    అసలైన కృష్ణుడ ననుకొని
    నసమాని వెనుక నడచెను నవ్వుల ప్రోగై !

    రిప్లయితొలగించండి
  5. మతము మతమని పోరుట హితము కాదు
    రాజు పేదైన బ్రతికెడి రోజు లేడు
    మంచి కంటెను మించిన మైత్రి లేదు
    ఏల వగచెద రీపాటి హేల కొఱకు ?

    రిప్లయితొలగించండి