15, నవంబర్ 2012, గురువారం

సమస్యా పూరణం - 878 (పలికిరి దైత్యులెల్ల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పలిిరి ైత్యులెల్ల బలిపాడ్యమి పండుగటంచు సాజమే.
(లేదా)
బలిపాడ్యమి పండుగ యని పలికిరి దైత్యుల్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రులకు ధన్యవాదములు.

16 కామెంట్‌లు:

 1. తెలియగ పాడ్యమి నేడే
  ఇలలో వత్సర మొదలిది ఇదిగో వినుడీ !
  వలదనకుండిద్దము మరి
  బలి, పాడ్యమి పండుగ యని పలికిరి దైత్యుల్.

  రిప్లయితొలగించండి
 2. కలిమి హరించెనె విష్ణువు?
  కలకాలము బంటు వోలె కాపుగ లేడా?
  తులలేని భాగ్యమిది! మా
  బలి పాడ్యమి పండుగ యని పలికిరి దైత్యుల్

  రిప్లయితొలగించండి
 3. కలిమి హరించి పోయినది కాని జగమ్మున కేగినాడు మా
  కులవిభుడంచు మీరనిన కొద్దియె ? శ్రీహరి సేవకుండుగా
  నిలువడె ద్వారబంధమున నిత్యము? నోడిన దెవ్వరియ్యెడన్?
  పలికిరి దైత్యులెల్ల బలిపాడ్యమి పండుగటంచు సాజమే!

  రిప్లయితొలగించండి
 4. ఇలనీపాలనచాలును
  కొలువైపాతాళమేలకోరియువటుడై
  బలికిపదోన్నతినిడ హరి
  బలిపాఢ్యమిపండుగయనిపలికిరిదైత్యుల్!

  రిప్లయితొలగించండి
 5. బలమున మించు వారెవరు? పంతముఁ బూనిసురేశు గెల్చితిన్.
  కలడొకొ నన్ను ద్రుంచునని గర్జన జేయుచునుండ నప్పుడా
  బలి నిక ద్రొక్క వచ్చి; పరిపాలకు జేసిన నాడిదంచునున్
  పలికిరి దైత్యులెల్ల బలిపాడ్యమి పండుగటంచు సాజమే.

  (శిక్షింప వచ్చిన వాడు కూడా మెచ్చి రాజును చేసినాడనే ఆనందం దైత్యులు ప్రకటించారని భావన.)

  అలిగిన వైరి మనంబును
  మెలకువ తోడ మసలి బలి మెప్పును పొందెన్.
  పలు లోకంబుల కధిపతి-
  "బలి"పాడ్యమి పండుగ యని పలికిరి దైత్యుల్.

  రిప్లయితొలగించండి
 6. "కలడొకొ ద్రుంచు వైరి యని " అని రెండవ పాదము సవరణ గా భావించవలసినది.

  రిప్లయితొలగించండి
 7. గెలిచె నజయాఖ్య మాయను
  గెలిచె నజునిమానసంబుఁ గినువడక నటన్
  గెలిచె పదవి మరి మాకగు
  బలిపాడ్యమి పండుగ యని పలికిరి దైత్యుల్

  రిప్లయితొలగించండి
 8. కందుల వరప్రసాద్గురువారం, నవంబర్ 15, 2012 8:37:00 PM


  పగవారిని మెండుగ జం
  పగ బలికిరి దైత్యులెల్ల బలిపాడ్యమి పం
  డుగటంచు సాజమే ప
  న్నగ శయనుడు రణమునందు నాయకు డగుటే.

  రిప్లయితొలగించండి
 9. అలఘుతరంబులైప్రథితమౌనటులాడినమాటకున్ వదా
  న్యులుతమజీవితంబున ననూహ్యముగానొకకీడుకల్గినన్
  కలతలనొందబోరు, బలి గణ్యవిధంబుశిరంబునిచ్చెనే
  పలికిరిదైత్యులెల్ల బలిపాడ్యమి పండగటంచు సాజమే.

  రిప్లయితొలగించండి
 10. బలి దైత్యుల ప్రభు వైనను
  అల వైకుంఠ మునుదిగి యాచించు హరిన్ !
  కల కాదని సంతస మున
  బలి పాడ్యమి పండుగ యని పలికిరి దైత్యుల్ !

  రిప్లయితొలగించండి
 11. బలబలిచక్రవర్తితిధిఁ బాధ యెసంగగఁ విష్ణుదూషణా
  ర్ధులు జలధుల్ వనంబులను రొప్పుచు రోయుచు దాటి ఒక్క దే
  వళమునుజేరి,దూరకను, భక్తులఁ గూడియె, విష్ణుమాయచే
  పలికిరి దైత్యులెల్ల బలిపాడ్యమి పండుగటంచు సాజమే

  రిప్లయితొలగించండి
 12. ఫలితము లెక్కజేయకను పంచుచు, దానము జేయుచున్ మహా
  బలి గరువంబు జెంద గని వామన రూపము దాల్చి విష్ణువే
  బలి తల పైన మోపి తన పాదము పంపగ నాగలోకమున్
  పలికిరి దైత్యులెల్ల బలి పాడ్యమి పండుగటంచు సాజమే.

  రిప్లయితొలగించండి
 13. ఫలితము లెక్కజేయకను పంచుచు, దానము జేయుచున్ మహా
  బలి గరువంబు జెంద గని వామన రూపము దాల్చి విష్ణువే
  బలి తల పైన మోపి తన పాదము పంపగ నాగలోకమున్
  పలికిరి దైత్యులెల్ల బలి పాడ్యమి పండుగటంచు సాజమే.

  రిప్లయితొలగించండి
 14. గురువుగారికి నమస్సులు,
  వ్రాసిన పద్యము, గేయము
  గీసిన చిత్రము ఫలించు! కెరలువొడుచగన్
  చూసినగురువువిడమడచ,
  చేసినదానికితోడై సింగారమిడున్!
  మీ వ్యాఖ్యలకై ఎదురుచూస్తూ...

  రిప్లయితొలగించండి