6, నవంబర్ 2012, మంగళవారం

దత్తపది - 29 (శరణము - చరణము - కరణము - తరణము)

శరణము - చరణము - కరణము - తరణము
పై పదాలను పాదాదిని ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
శ్రీరాముని స్తుతిస్తూ పద్యం వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. శరణము సర్వ కాలముల సర్వ జనాళికి రామచంద్ర! నీ
    చరణమటంచు నమ్ముచును సాగిలి మ్రొక్కుదు నీదు మ్రోల ము
    క్కరణము లఛ్ఛమై యలర, కావుము నన్ను భవాబ్ధి నుండి వే
    తరణము నొందజేయు మిక ధర్మ మహాలయ! జానకీప్రియా!

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. శరణము దశ రధ నందన !
    చరణము లే మీవి మాకు తరణము లయ్యా !
    కర ణ ములు సేయ మంచివి
    వరమగు సద్బుద్ధి నిమ్ము వరదుడ ! రామా !

    రిప్లయితొలగించండి
  4. శరణము నీవే రామా !
    చరణములను బట్టుచుంటి స్మరణము నీదే !
    కరణము కాదిది తరణము
    క్షరమిది ప్రాప్తించెను భవసాగర మీదన్ !

    కరణము = దేహము ; తరణము = నావ ; క్షరము = నశించునది

    రిప్లయితొలగించండి
  5. చరణములను విడువక నీ
    శరణమునే గోరు వారు సంసారమ్మున్
    తరణము చేయుటకే యుప
    కరణము నీవయ్య రామ ! సద్గుణ ధామా !

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు

    శరణము రామ భద్ర సిరి సాధనలో బడి మిమ్ము వీడి నా
    కరణము పాచి పోయె,మము గాచెడి వాడ ముకుంద బట్టె మీ
    చరణము జన్మ జన్మలకు స్వామివి నీవని నమ్మి వేడితిన్
    తరణము గల్గ జేయు మిక త్రాతవుగా మది నిల్చి శ్రీధరా |

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    హనుమ రావణునితో :

    01)
    _______________________________

    చరణము లంటు మిన కులుని
    శరణము వేడినను గాచు - శత్రువు నైనన్ !
    కరణము కాపాడు కొనుము
    తరణము నొందెదవు నీవు - దానవ శ్రేష్ఠా !
    _______________________________
    చరణము = పాదము
    కరణము = శరీరము
    తరణము = తరించుట

    రిప్లయితొలగించండి
  8. అయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యమునకు అన్వయము సులభ గ్రాహ్యము అగుట కొరకు చాలా చిన్న మార్పులు చేసేను. చూడండి:

    శరణము నీవె రామ! సిరిసాధనలో బడి మిమ్ము వీడి నా
    కరణము పాచిపోయె, మము గాచెడు వాడ! ముకుంద! పట్టి మీ
    చరణము జన్మ జన్మలకు స్వామివి నీవని నమ్మి వేడితిన్,
    తరణము గల్గజేయు మిక త్రాతవుగా మది నిల్చి, శ్రీధరా!

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. రాముని రాక కోసం యెదురు చూస్తున్న శబరి :

    02)
    _________________________________________

    శరణము నీవె నా కిలను - శాత్రవసింహమ ! పూరుషోత్తమా !
    చరణము లంట పాపముల - చట్టలు వాపెడి ధర్మరక్షకా !
    కరణము కోలుపోక మును - కన్నుల నిండుగ నిన్ను గాంచగా
    తరణము జేయు మయ్య నను - దానవ భంజన ! శిష్ట రక్షకా !
    _________________________________________
    చట్టలు వాపు = నశింప జేయు

    రిప్లయితొలగించండి
  10. శరణము గోరితి రామా
    చరణము లనువీడ లేను శంభుడ వనుచున్ !
    కరణము లేదన వేరొక
    తరణము వివరించు మయ్య ధన్యత నొందన్ !

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రులకు నమస్కృతులు.
    దత్తపదాలను మనోహరమైన పద్యాలలో సమర్థంగా ప్రయోగించి శ్రీరామ స్తుతి చేసిన ...
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    వరప్రసాద్ గారికి,
    వసంత కిశోర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    వరప్రసాద్ గారి పద్యాన్ని సంస్కరించిన పండిత నేమాని వారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. చరణము లంటి మ్రొక్కెదను చర్విత చర్వణ మంచు నెంచకన్
    శరణము నిచ్చి యేలగదె చయ్యన దీనుని కోతి రీతిగా
    కరణము కాక పోనయితి కమ్మని పండ్లిడ నైతి నావపై
    తరణము చేయనైతి నని తప్పుల నెంచకు మో రఘూత్తమా!

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్న గారూ,
    ఈనాటి మీ పద్యం ఆర్ద్రభావంతో మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  14. చరణములను విడువక నీ
    శరణమునే గోరు వారు సంసారమ్మున్
    తరణము చేయుటకే యుప
    కరణము నీవయ్య రామ ! కౌసల్య సుతా !

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి