22, నవంబర్ 2012, గురువారం

సమస్యా పూరణం - 884 (యముఁ గన పెన్నిధులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
యముఁ గన పెన్నిధులు పెక్కు లలరుచు నుండున్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రులకు ధన్యవాదములు.

18 కామెంట్‌లు:

  1. విమలాంతఃకరణుల హృద
    యముగన పెన్నిధులు పెక్కు లలరుచునుండున్
    ప్రమదము సద్గుణరాజియు
    సమాదృతియు భక్తి ప్రముఖ సాధనలగుచున్

    రిప్లయితొలగించండి
  2. మమతలు పంచెడి చెలిహృద
    యముగన పెన్నిధులు పెక్కు లలరుచు నుండున్ !
    రమణీయ మైన ప్రియసఖి
    సుమధుర పలుకులను మించి సుఖ మేముండున్ ??

    రిప్లయితొలగించండి
  3. కమలముఖియైయలరు శ్రీ
    రమ పదముల సన్నిధి యను రమ్యస్థల మా
    విమలంబయి యలరెడి నిల
    యముఁగన పెన్నిధులు పెక్కులలరుచు నుండున్.

    రిప్లయితొలగించండి
  4. సమతా భావము గ లుగుచు
    మమతల తో గూడి యుండు మనుగడ గలిగే
    విమలము నగునా సతి హృద
    యము గన పెన్నిధులు బెక్కు లలరుచు నుండున్ .

    రిప్లయితొలగించండి
  5. శ్రీ శంక రయ్య గురుదేవులకు గారికి ,శ్రీ నేమాని గురు దేవులకు పాదాభి వందనము, ధన్యవాదములు దెలుపుచు
    =====*====
    అమరుల వలె రాగ లపా
    యములకును స కాలమందు నవని జనులకున్
    సమ ధర్మము తోడ ను పా
    యము గన పెన్నిధులు పెక్కు లలరు చునుండున్

    రిప్లయితొలగించండి
  6. శ్రీ వరప్రసాద్ గారి పద్యము చిన్న చిన్న మార్పులతో:

    సుమతిన్ రాబోవు నపా
    యములకు దగు వేళలందు నవని జనులు భ
    ద్రములను గూర్చదగు నుపా
    యము గన పెన్నిధులు పెక్కు లలరుచు నుండున్

    రిప్లయితొలగించండి


  7. కుమతుల దూర్త ప్రబోధన
    సుమధురముగనుండు గాని శూన్యము జ్ఞానం,
    బమలాధ్యాత్మిక గురు హృద
    యముగన పెన్నిధులు పెక్కు లలరుచు నుండున్ .

    రిప్లయితొలగించండి
  8. అమ్మా! రాజేశ్వరిగారూ! శుభాశీస్సులు.

    మీ పద్యములో సుమధుర పలుకులు అని వాడేరు. అలా సమాసము చేయకూడదు. సుమధుర వాక్కులు అందాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. అయ్యా! శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు
    మీ పద్య పాదమును ఇలా సవరించుదాము:
    మమతలు తనరారుచుండు మనుగడ తోడన్
    స్వస్తి.

    అయ్యా శ్రీ లక్ష్మీనారయణ గారూ!
    మీ పద్యములో దూర్త అని టైపు తప్పు దొరలినది. ధూర్త అని చదువుకొందాము.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. సమయంబిదే సునాయా
    సముగన్ దోచగలమంచు సాగినవారల్
    సముపార్జించిన ఘన నిల
    యముఁగనపెన్నిధులుపెక్కులలరుచునుండున్!

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని వారూ,
    ‘హృదయమునకు ప్రమదము’ నిచ్చింది మీ పూరణ. చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ‘మమతలు పంచెడి హృదయము’తో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ‘రమా నిలయము’ను ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    ‘అనుకూలవతి అయిన సతి హృదయము’ను ఆవిష్కరించారు మీ పూరణలో. బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. నేమాని వారు సంస్కరించిన పద్యం మరింత బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    ‘సద్గురు హృదయము’ను విషయంగా చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ పండితుల వారికి ప్రణామములు

    మమతలు పంచెడి చెలి హృద
    యముఁ గన పెన్నిధులు పెక్కు లలరుచు నుండున్ !
    రమణేయ మైన ప్రియ సఖి
    సుమధుర భాషణల కంటె సుఖమే ముండున్

    రిప్లయితొలగించండి
  13. క్షమలో గనగా వేంకట
    రమణుడు కొలువైన మలయ రాజము నందున్
    విమల యశుడు వెలసిన నిల
    యముఁ గన పెన్నిధులు పెక్కు లలరుచు నుండున్

    రిప్లయితొలగించండి
  14. సమముగ తురాయి కలికి, ఘ
    నము చింతాకు పతకమ్ము, నమ్రత తోడన్
    క్రమముగ భద్రాచల నిల
    యముఁ గన పెన్నిధులు పెక్కు లలరుచు నుండున్

    రిప్లయితొలగించండి
  15. కమలము చిహ్నము జనతకు
    విమలపు మనమున పరుగిడి వింజామరతో
    తమ ముఖ్య మంత్రి కాషా
    యముఁ గన పెన్నిధులు పెక్కు లలరుచు నుండున్

    రిప్లయితొలగించండి