గురువు గారు, అల్పాయు(అల్పాయుష్కుడు)కు అన్నది తప్పేమో, అలాగే పితవు కమ్మని అనకుండా పిత కమ్మని అనడం తప్పేమో అనుకుంటున్నాను. ఇంకొక పూరణ చేయుటకు ప్రయత్నిస్తాను. సమస్యలో కూడా చిన్న సందేహము. వరమునొసగ / వరమొసగ ఏది సరి అయినది? కళవళమందెన్/ కళవళమొందెన్ వీటిలో కూడా ..? " ఒ" ఎక్కడ రావచ్చును? ఎక్కడ రాకూడదు? దయచేసి చెప్పగలరు.
ఒక భక్తుడు పరమేశ్వరుని ఈ విధముగా అడుగుచున్నాడు: స్వామీ! నీవు తిను ఆహారము గరళము; నీ ఆభరణము పాము; నీ వస్త్రము ఏనుగు తోలు; నీ వాహనము ఒక ముసలి ఎద్దు; మరి నాకు నీవు ఏమిటి ఈయగలవు? ఇవి యేవియును నాకు ఉపయోగపడవు కదా. సరే నీ పాద పద్మములలో భక్తి మాత్రమే ఇమ్ము - అదే నాకు కావలెను. చూచేరా - భక్తిని వరముగా ఇచ్చినచో కమ్మని వరమే కాని దానితో కళవళ పడ నక్కరలేదు.
రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * పండిత నేమాని వారూ, తెనాలి రామకృష్ణుని గురించిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, నేమాని వారే మెచ్చి ఆశీర్వదిస్తూ పద్యం వ్రాసారంటే మీ పూరణకు వేరే ప్రశంసాపత్రం అవసరం లేదు. మీకు నా హృదయపూర్వక అభినందనలు. మీ రెండవ పూరణ కూడా బాగుంది. ‘నళిన దళేక్షా’ అనాలి కదా! అది టైపాటు కాబోలు. * చింతా రామకృష్ణా రావు గారూ, ‘మెచ్చదు లోకమ్మని’ చేసిన మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. రెండవ పాదాన్ని ఇలా సవరిద్దాం... ‘ఇమ్ము తనయు నొకని నాకు నినుడా దయతోన్’ * లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘అల్పాయువునకు పిత’ అనవలసి ఉంటుంది. ‘క మ్మల్పాయువునకు పిత’ అందాం. ‘వర మొసగ, వరము నొసగ’ రెండూ సరైనవే. ‘అందు = పొందు, గ్రహించు’; ‘ఒందు = కలుగు, పొందు’ కనుక రెండూ సరైనవే. * నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
నమస్కారములు సోదరులు గన్నవరపు వారి పద్యం " గన్నా రసం కంటె మధు రంగా ఉంది.సరిగ్గా నాకూ అదే అలోచన వచ్చింది.ముని మంత్రం వలన సూర్యుడిచ్చిన వరం మధుర మైనదే ఐనా కుంతి కళవళ పడిందని వ్రాయాలను కున్నాను " కానీ నిద్ర కళ్ళకి పదాలు కూడ లేదు. తొందరగా వ్రాయాలన్న తపన . అది మీరు వ్రాసి ఆనందాన్ని కలిగించారు ధన్య వాదములు
అక్కయ్య గారికి వందనములు.ధన్యవాదములు. నాకు రాత్రి భోజనము తర్వాత 'చంద్రభాసురము ' త్రాగి నంత మత్తు కలుగుతుంది. నా రెండవ పూరణకు నాలుగు తప్పులు. నళిన దళేక్షా ! యని యశోదను సంబోధించానే యని ఉదయము నళిన దళేక్షీ ! యని సరిదిద్దాను. గురువు గారు టైపాటంటున్నారు. ఏమిటో ! టైపాటో , సాపాటో !
రామకృష్ణ గారూ ! ధన్యవాదములు. < చిన్ని కృష్ణునకు ద్విత్వాక్షరాలు సమ్యుక్తాలు పలుకు తాయా ?> మరి అమ్మ పదము ద్విత్వమే కదా ! అసలు యిబ్బంది నా రెండవ పూరణ బాగా రాలేదు. భావన మంచిదే, అందుకే వదలివేయడము లేదు. ఈ మూడవ ప్రయత్నము చూడండి. మీరు కూడా ఓ ప్రయత్నము చేయండి.
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘కొమ్మక్కతి’ ... ‘కొమ్మొక్కతి’కి టైపాటు కదా! ‘కొమ్మ యొకతి’ అంటే సరి. * రామకృష్ణ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. మూడవ పాదంలో మొదటి గణం ‘రగణం’ అయింది. ‘కూర్చొన పలు జ/న్మమ్ములకు దంపతులుగా’ అంటే ఎలా ఉంటుంది?
గురువుగారూ , చూసుకొనలేదండీ .. కొత్త ఛందాలు నేర్చుకోవటానికి బదులు కందాలలో కొత్త తప్పులు చేయటం నేర్చుకుంటున్నట్టున్నాను .. సవరణకు ధన్యవాదములు... భవదీయుడు
ఇమ్ముగ పూజల నందుచు
రిప్లయితొలగించండినెమ్మనమున దీవెనలిడ నెయ్యము తోడన్ !
వమ్మగునని భక్తుల యెడ
కమ్మని వర మొసగ మిగుల కళ వళ మొందెన్ !
ఇమ్మని మోక్షము నడుగగ
రిప్లయితొలగించండిఅమ్మహదేవుని యొకండు యార్తిని వేడన్
ఇమ్మహిలో రాజువుగా
కమ్మని వరమొసఁగ మిగుల కళవళమొందెన్.
అమ్మా! చూచెద పాత్రల
రిప్లయితొలగించండినిమ్మా! యని వేగ రామకృష్ణుడు త్రాగెన్
పొమ్మనుచు వికటకవిగా
కమ్మని వరమొసగ మిగుల కళవళమొందెన్
నంస్కారములు
రిప్లయితొలగించండిశ్రీ పండితుల వారి పద్యం అద్భుతం ....మార్వలెస్ !
అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఏదో కమ్మని భావము తట్టినది - పద్యము వ్రాసేను. మీ ప్రశంసలకు చాల సంతోషము.
స్వస్తి.
అమ్ముని నేర్పిన మంత్రము
రిప్లయితొలగించండినెమ్మనమున దలచి తలచ నీరజ బంధున్
అమ్మవు గమ్మనె, కుంతియు
కమ్మని వరమొసగ మిగుల కళవళ మొందెన్
అమ్మను వరమడిగె నొకఁడు
రిప్లయితొలగించండిసొమ్ములఁగొన నమ్మ యొసగి శోభిలు మనుచున్,
సొమ్ములు గని మెచ్చదు లో
కమ్మని వరమొసఁగ మిగుల కళవళమొందెన్.
http://andhraamrutham.blogspot.in/2012/11/blog-post_23.html
తమ్ముడు చి. డా. నరసింహమూర్తి పూరణ బాగున్నది.
రిప్లయితొలగించండితమ్ముడు చేసిన పూరణ
కమ్మని రుచు లొలుకుచుండె కావున బళిరా!
కొమ్మని నే నాశీర్వా
దమ్ములిడుదు నినుమడింప తత్ప్రతిభ సదా
స్వస్తి.
శ్రీ శంక రయ్య గురుదేవులకు గారికి ,శ్రీ నేమాని గురు దేవులకు పాదాభి వందనము, ధన్యవాదములు దెలుపుచు
రిప్లయితొలగించండిఆంద్రప్రదేశ్ గవర్నరు నరసింహన్ గారిపై
======*====
రమ్ము నరసింహ!గైకొను
మిమ్ముగ నాంధ్రకును బోయి యేలుము వడిగా
నమ్మ బిలచి పారితోషమ్మున
కమ్మని వర మొసగ ,మిగుల కళకళ మొందెన్
శ్రీ నేమాని వారి రచనలపై
======*=====
రామ జోగి వారి రచనల రుచి జూడ
రామ రసము, భామ్మ రవ్వ హల్వ
జామ తేనె రుచులు జాల చేరిన జివ్హ
తామసమును దీర్చ తరము గాదు
రిప్లయితొలగించండిఅన్నయ్య గారికి, గురువు గారికి అభివాదములు !
పూరణఁ జేసే ముందట
నారాధన జేతు మిగుల నన్నల గురులన్
వారిత్తురు నాశీస్సులు
జేరువలో నున్న యట్లు జేకొన నేనున్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅమ్ముని దీ వన మేరకు
రిప్లయితొలగించండినిమ్ముము నొక పుత్రు నాకు యినుడా ! దయ తోన్
నమ్ము మని కుంతి బలుకను
కమ్మని వర మొసగ , మిగుల కళ వళ మొందెన్
ఇమ్మనుచు పుత్రభాగ్యము
రిప్లయితొలగించండినమ్మునివర్యుఁడు తపమ్ము నలయకఁ జేసెన్,
కొమ్మని, యల్పాయుకు పిత
కమ్మని వరమొసఁగ మిగుల కళవళమొందెన్.
గురువు గారు,
అల్పాయు(అల్పాయుష్కుడు)కు అన్నది తప్పేమో, అలాగే పితవు కమ్మని అనకుండా పిత కమ్మని అనడం తప్పేమో అనుకుంటున్నాను. ఇంకొక పూరణ చేయుటకు ప్రయత్నిస్తాను.
సమస్యలో కూడా చిన్న సందేహము.
వరమునొసగ / వరమొసగ ఏది సరి అయినది?
కళవళమందెన్/ కళవళమొందెన్ వీటిలో కూడా ..?
" ఒ" ఎక్కడ రావచ్చును? ఎక్కడ రాకూడదు?
దయచేసి చెప్పగలరు.
అమ్మ యొసగిన వరమ్ములు
రిప్లయితొలగించండివమ్ములు గావని యెఱిగిన వజ్రధరుడు దు
ర్గమ్మ యొక దైత్యు నధిపతి
కమ్మని వరమొసగ మిగుల కళవళ మొందెన్
యశోదా దేవి,
రిప్లయితొలగించండిఇమ్మటె మంటిని దినుటకు
నమ్మవటే నోట గనుము నళిని దళేక్షీ !
రమ్మా ! యని తన కొమరుఁడు
కమ్మని వరమీయ మిగుల కళవళ మొందెన్ !
మిత్రులారా!
రిప్లయితొలగించండివరము నిచ్చే విషయములో శివానందలహరి లోని ఈ క్రింది శ్లోకమును ప్రస్తావించు కొనెదము:
అశనం గరళం, ఫణీ కలాపో
వసనం చర్మచ, వాహనం మహోక్షః
మమ దాస్యసి కిం కిమస్తి శంభో?
తవ పాదాంబుజ భక్తిమేవ దేహి
ఒక భక్తుడు పరమేశ్వరుని ఈ విధముగా అడుగుచున్నాడు:
స్వామీ! నీవు తిను ఆహారము గరళము; నీ ఆభరణము పాము;
నీ వస్త్రము ఏనుగు తోలు; నీ వాహనము ఒక ముసలి ఎద్దు;
మరి నాకు నీవు ఏమిటి ఈయగలవు? ఇవి యేవియును నాకు ఉపయోగపడవు కదా.
సరే నీ పాద పద్మములలో భక్తి మాత్రమే ఇమ్ము - అదే నాకు కావలెను.
చూచేరా - భక్తిని వరముగా ఇచ్చినచో కమ్మని వరమే కాని దానితో
కళవళ పడ నక్కరలేదు.
స్వస్తి.
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
తెనాలి రామకృష్ణుని గురించిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
నేమాని వారే మెచ్చి ఆశీర్వదిస్తూ పద్యం వ్రాసారంటే మీ పూరణకు వేరే ప్రశంసాపత్రం అవసరం లేదు. మీకు నా హృదయపూర్వక అభినందనలు.
మీ రెండవ పూరణ కూడా బాగుంది. ‘నళిన దళేక్షా’ అనాలి కదా! అది టైపాటు కాబోలు.
*
చింతా రామకృష్ణా రావు గారూ,
‘మెచ్చదు లోకమ్మని’ చేసిన మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
రెండవ పాదాన్ని ఇలా సవరిద్దాం... ‘ఇమ్ము తనయు నొకని నాకు నినుడా దయతోన్’
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘అల్పాయువునకు పిత’ అనవలసి ఉంటుంది. ‘క మ్మల్పాయువునకు పిత’ అందాం.
‘వర మొసగ, వరము నొసగ’ రెండూ సరైనవే.
‘అందు = పొందు, గ్రహించు’; ‘ఒందు = కలుగు, పొందు’ కనుక రెండూ సరైనవే.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
నేమాని వారికి ధన్యవాదములతో....
రిప్లయితొలగించండితినునది గరళము, మెడఁ దా
ల్చినదో సర్పమ్ము, త్వచము చీర, వహన మె
ద్దని శంకించెను; భక్తుఁడు
కమ్మని వరమీయ మిగుల కళవళ మొందెన్.
(భక్తుడవుగా కమ్మని వరమీయ / భక్తుడు కమ్మదనముగల వరమీయ)
నమస్కారములు
రిప్లయితొలగించండిసోదరులు గన్నవరపు వారి పద్యం " గన్నా రసం కంటె మధు రంగా ఉంది.సరిగ్గా నాకూ అదే అలోచన వచ్చింది.ముని మంత్రం వలన సూర్యుడిచ్చిన వరం మధుర మైనదే ఐనా కుంతి కళవళ పడిందని వ్రాయాలను కున్నాను " కానీ నిద్ర కళ్ళకి పదాలు కూడ లేదు. తొందరగా వ్రాయాలన్న తపన .
అది మీరు వ్రాసి ఆనందాన్ని కలిగించారు ధన్య వాదములు
అక్కయ్య గారికి వందనములు.ధన్యవాదములు. నాకు రాత్రి భోజనము తర్వాత 'చంద్రభాసురము ' త్రాగి నంత మత్తు కలుగుతుంది. నా రెండవ పూరణకు నాలుగు తప్పులు. నళిన దళేక్షా ! యని యశోదను సంబోధించానే యని ఉదయము నళిన దళేక్షీ ! యని సరిదిద్దాను. గురువు గారు టైపాటంటున్నారు. ఏమిటో ! టైపాటో , సాపాటో !
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగన్నవరపు వారూ! మొదటిది చక్కని ఔచిత్య పూరణ .
"కమ్మని పూరణము మిగుల కళ కళ లాడెన్."
హనుమఛ్ఛాస్త్రి గారూ ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఇమ్మని సంతానమ్మును
కొమ్మక్కతి చేసె పూజ, గోపతి యపుడున్
అమ్మా! యొక సుత కమ్మవు
కమ్మని వరమొసగ మిగుల కళకళ మొందెన్ .
నమ్మని సిద్ధునిముందరఁ
రిప్లయితొలగించండిగొమ్మకునెదురాడలేక కూర్చొనఁ గని జ
న్మమ్ములేడు దంపతులుగా
కమ్మని వర మొసగ మిగుల కళ వళ మొందెన్ !
నరసింహమూర్తి గారూ,
రిప్లయితొలగించండిచిన్నికృష్ణుడి నోట సంయుక్తాలు, దిత్వాలు పలుకుతాయంటారా, పైగా సమస్త లోకాలు ఉన్నాయి కదా ..
నా తల్లీ రా/వమ్మా అంటే?
"ఇత్తురు నాశీస్సులు" ఒప్పేనంటారా? చెవికింపుగా లేదండీ.
భవదీయుడు
రామకృష్ణ గారూ ! ధన్యవాదములు. < చిన్ని కృష్ణునకు ద్విత్వాక్షరాలు సమ్యుక్తాలు పలుకు తాయా ?> మరి అమ్మ పదము ద్విత్వమే కదా ! అసలు యిబ్బంది నా రెండవ పూరణ బాగా రాలేదు. భావన మంచిదే, అందుకే వదలివేయడము లేదు. ఈ మూడవ ప్రయత్నము చూడండి. మీరు కూడా ఓ ప్రయత్నము చేయండి.
రిప్లయితొలగించండిఇమ్మటె మన్నుయు దినుటకు
కొమ్మా ! నా నోట గలవె కుఘ్రాణమ్ముల్?
అమ్మా ! కనుమని లేమకు
కమ్మని వరమొసగ మిగుల కళవళ మొందెన్ !
కు = భూమి ,కుఘ్రాణము = మట్టి వాసన.
రామకృష్ణ గారూ ! ఈ సవరణ చూడండి !
రిప్లయితొలగించండిఅన్నయ్య గారికి, గురువు గారికి అభివాదములు !
పూరణఁ జేసే ముందట
నారాధన జేతు మిగుల నన్నల గురులన్
వారిచ్చెడి యాశీస్సులు
జేరువ నున్నటుల నేను జేకొందు నిటన్ !
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘కొమ్మక్కతి’ ... ‘కొమ్మొక్కతి’కి టైపాటు కదా! ‘కొమ్మ యొకతి’ అంటే సరి.
*
రామకృష్ణ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
మూడవ పాదంలో మొదటి గణం ‘రగణం’ అయింది. ‘కూర్చొన పలు జ/న్మమ్ములకు దంపతులుగా’ అంటే ఎలా ఉంటుంది?
గురువుగారూ , చూసుకొనలేదండీ .. కొత్త ఛందాలు నేర్చుకోవటానికి బదులు కందాలలో కొత్త తప్పులు చేయటం నేర్చుకుంటున్నట్టున్నాను .. సవరణకు ధన్యవాదములు...
రిప్లయితొలగించండిభవదీయుడు
నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ వాక్యానుసారం ప్రయత్నిస్తున్నాను. ఎన్ని తప్పులో మీరే చెప్పాలి మరి.
ఇమ్మటె మన్నుయు దినుటకు?
నమ్మవె నామాట?నాననాఘ్రాణముచే
నమ్మా! నిజమెరుఁగ మనుచు
కమ్మని వరమొసగ మిగుల కళవళ మొందెన్ !
నామాటను + ఆనన+ ఆఘ్రాణము
భవదీయుడు
రిప్లయితొలగించండికౌర వాదుల నిల కడతేర్తు నేనంచు
పలుక సాగె గొప్ప బలుని వోలె
ఉత్తరుని నుడులకు నూ కొట్టె బ్రార్థుడు
కాకి నృత్యమాడె కేకి వొగడె.
రామకృష్ణ గారూ మీ పద్యము మధురము !
రిప్లయితొలగించండిఇమ్ముగ భస్మాసురునకు
రిప్లయితొలగించండినమ్ముచు మెచ్చుచు భళియని నౌరా యనగా
వమ్మును వేగమె జేసెడి
కమ్మని వరమొసఁగ; మిగుల కళవళమొందెన్
వమ్ము = నాశనము
ఇమ్ముగ ప్రత్యక్షమయిన
రిప్లయితొలగించండిపిమ్మట భస్మాసురుండు ప్రీతిని కోరన్
గమ్మున భోళా వేలుపు
కమ్మని వరమొసఁగ మిగుల కళవళమొందెన్