5, నవంబర్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 869 (తల్లికిఁ దనయకును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తల్లికిఁ దనయకును ధవుఁ డొకండె.

30 కామెంట్‌లు:

 1. భూమి తల్లి, తండ్రి పుండరీకాక్షుండు
  తనయ సీత భర్త దాశరథియు
  విష్ణు మూర్తి యగుట వింత యేమున్నది
  తల్లికి దనయకును ధవుడొకండె

  రిప్లయితొలగించండి
 2. ధరణి జాత కాయె ధవునిగా రాముండు
  అవని కేమొ భర్త హరియె జూడ
  హరియె తాను గాద నారామ చంద్రుండు
  తల్లికిఁ దనయకును ధవుఁ డొకండె.

  రిప్లయితొలగించండి
 3. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
  గురువుగారికి ధన్యవాదములు దెలుపుచు
  తండ్రి ,భర్త పేరు నొక్కటి గానున్న వనిత అర్జి యందు వ్రాయగా , విషయము దెలియని వారు ఈ రీతిన బల్కె
  =====*=====
  వనిత వ్రాసె తండ్రి ,పతి పేరు నొక్కటి
  గాను నర్జి యందు ,కలియుగమున
  వింత యనుచు బల్కె వివరము దెలియక
  తల్లికి దనయకును ధవు డొకండె

  రిప్లయితొలగించండి
 4. అయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ!
  శుభాశీస్సులు.
  మీ పూర్వపు పూరణ "తొలగును కష్టాలెల్లను" అని మొదలిడిన పద్యములో 2వ పాదములో ప్రాస వేయుటను మరిచినారు. సరిజేయండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 5. పండిత శ్రీ నేమాని వారికి, నమస్సులు.
  క్రావడి గురించి తెలియ జెప్పినందులకు ధన్యవాదములు.
  భవదీయుడు

  రిప్లయితొలగించండి
 6. పండిత నేమాని వారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. వరప్రసాద్ గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. ధరణి సుతకు ధవుడు దాశరధియ యౌను
  వసుమ తీ శు డనగ వాసు దేవె
  దాశరధియు ననగ వాసు దే వు డ గుట
  తల్లికి దనయకును ధవు డొ కండె .

  రిప్లయితొలగించండి
 10. తప్పులకు క్షమించగలరు ,ఎంతో ఓర్పుతో జ్ఞాన బిక్ష పెడుతున్న పండితోత్తములు సాహితీ కృషీ వలులు,శ్రీ నేమాని వారికి మరియు శ్రీ శంకరయ్య గురువుగారికి ధన్యవాదములు దెలుపుచు

  రిప్లయితొలగించండి
 11. మెచ్చి, తల్లి తలచెఁ, వచ్చిన తరినుండి
  దూరవాణి విడని దుహితను గాంచియే
  "లోక మనిన" నేడు, శ్రీకర సాధ్వీమ
  తల్లికిఁ దనయకును "ధవుఁ డొకండె".

  రిప్లయితొలగించండి
 12. శ్రీ రాముని దయ వల్ల అమెరికాలోనున్న మన తెలుగువారు అందరూ తుఫాను ప్రభావము నుండి క్షేమముగా బయట పడినందులకు చాలా సంతోషము. మన రాష్ట్రము నీలం తుఫానుకు గురి యగుట విచారణీయము. చాలా మంది జనులు ఇబ్బంది పడుచున్నారు .వీరిని కూడా జగద్రక్షకుడు కాపాడి రక్షింపమని ప్రార్థిస్తూ

  రిప్లయితొలగించండి
 13. సుబ్బారావు గారూ,
  మ పూరణ బాగుంది. అభినందనలు.
  రెండవ పాదం చివర 'వాసుదేవె' ?

  రిప్లయితొలగించండి
 14. రామకృష్ణ గారూ,
  'సాధ్వీమతల్లి' అనడం బాగుంది. బాగుంది మీ పూరణ. అభినందనలు.
  రెండవ పాదంలో ఆటవెలది లక్షణం లేదు. దుహితఁ గంచి' అంటే సరి.

  రిప్లయితొలగించండి
 15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 16. అవని నేలగ విభుడ వతారమును మార్చి
  యుగము దాటి యుగము యుగము నందు
  ధర్మ నిరతి విడక ధరనేలు తరుణాన
  తల్లికిఁ దనయకును ధవుఁ డొకండె !

  రిప్లయితొలగించండి
 17. అయ్యా! శ్రీ నాగరాజు రవీందర్ గారూ! శుభాశీస్సులు.
  గాఢ + అనుబంధము = గాఢానుబంధము (సవర్ణ దీర్ఘ సంధి) అవుతుంది. యడాగమము రాదు. పరిశీలించి మీ పద్యమును సరిజేయండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 18. నేమాని గురువర్యులకు కృతజ్ఞతలు. మీ సూచన ప్రకారం నా పద్యమును యిలా సవరించి వ్రాయుచున్నాను.

  అలవిగాని యటుల ననుబంధ ముండును
  తల్లి దనయలకును ; ధవుడొకండె
  ధర్మ మాచరించి ధరను పాలించినన్
  ప్రజలు సైత మట్లు బరగు చుండ్రు

  రిప్లయితొలగించండి
 19. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ ప్రాథమిక అవసరాలు తీరుతూ, ఇబ్బందులు తొలగిపోయాయనుకుంటాను.
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణలోని వైవిధ్యం అలరిస్తున్నది. చక్కని విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. ప్రస్తుతం పరిస్తితులు మెరుగు బడ్డాయి ఇప్పుడు బాగానే ఉన్నాము .
  మీ సోదరు లందరి శుభా కాంక్షల కుంభ వృష్టి ముందు ఏ తుఫానులూ , ఏమీ చేయ లేవు ధన్య వాదములు తమ్ముడూ !

  రిప్లయితొలగించండి
 21. యాత్రయందు జూడ నలసట కలిగెను
  తల్లికిఁ దనయకును, ధవుఁ డొకండె
  ప్రతిదినంబు చేయు వ్యాయామశక్తిచే
  విశ్రమింతు ననక వెళ్ళుచుండె

  రిప్లయితొలగించండి
 22. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  కాలు విరిగి కదలలేని భార్య ! ఆకలితో అలమటించే కూతురు !
  ఆ తల్లీపిల్లలకు వంట చేసిన భర్త ! అయ్యా అదీ సంగతి :

  01)
  _______________________________

  తనకలి బడి కాలు - తరుణికి విరిగెను
  తల్లడిల్లుచుండె - పిల్ల పసిని
  తళియ జేసి పెట్టె - తన శక్తి మేరకు
  తల్లికిఁ దనయకును - ధవుఁ డొకండె !
  _______________________________
  తనకలి = ఆపద = ప్రమాదము
  తరుణి = స్త్రీ (దార )
  పసి = ఆకలి
  తళియ = వంట

  రిప్లయితొలగించండి
 23. శంకరార్యా !
  అమెరికాలో పరిస్థితి మెరుగుపడి
  అక్కడి మిత్రులందరూ తేరుకున్నందుకు
  ఆనందముగా నున్నది !

  ఇక్కడి పరిస్థితే ఇంకా చక్కబడ లేదు !

  రిప్లయితొలగించండి
 24. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  విరుపుతో విశేషార్థాన్ని సాధించి చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ఇంతకీ అతడెవరి ధవుడు?

  రిప్లయితొలగించండి
 25. జంగిడి రాజేందర్మంగళవారం, నవంబర్ 06, 2012 7:21:00 AM


  భారతమ్మునందు భామ కుంతి తలచు
  వాక్కు నీతి పలుకువాడు తలచు
  చెలిమి నిత్య మనుచు చెలికాడు తలచిన
  తల్లికిఁ దనయకును - ధవుఁ డొకండె !

  రిప్లయితొలగించండి
 26. శంకరార్యా ! ధన్యవాదములు !
  ఇక్కడసలు సందేహానికి తావే లేదు ! మీకెందుకొచ్చిందో ?
  ఒక భర్త తన భార్యా పిల్లలకు(తల్లికి ,తనయకు )వండి పెట్టాడు !
  అతడు తల్లికి ధవుడు ,తనయకు తండ్రి !
  మీరు ఇంకొక్కసారి చదివి చూడండి

  రిప్లయితొలగించండి
 27. గురువు గారూ..,

  మీ సవరణకు ధన్యవాదములు...

  రిప్లయితొలగించండి
 28. వసంత కిశోర్ గారూ,
  ఏదో సరదాకి అన్నమాట అది...

  రిప్లయితొలగించండి