కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శివ శివ యంచు విష్ణు పద సీమను జేరెను భక్తు డొప్పుగా.
ఈ సమస్యను పంపిన కవిమిత్రులకు ధన్యవాదములు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శివ శివ యంచు విష్ణు పద సీమను జేరెను భక్తు డొప్పుగా.
ఈ సమస్యను పంపిన కవిమిత్రులకు ధన్యవాదములు.
శివుడును విష్ణు వొక్కరని చిత్తమునన్ గడు విశ్వసించుచున్
రిప్లయితొలగించండిప్రవిమల భక్తి భావమున భావన చేయుచు బ్రహ్మమొక్కటే
వివిధములట్లు చెప్పబడు విశ్వవిభుండని యోగివర్యుడై
శివ శివ యంచు విష్ణు పద సీమను జేరెను భక్తు డొప్పుగా
శివుఁడన విష్ణువే యనుచు, శ్రీహరి చిత్తము శైవమంచు నా
రిప్లయితొలగించండిశివునిఁ దలంచినన్ హరియు క్షేమము గూర్చునటంచు నొక్కఁడా
శివుని భజించు చిత్తమున శ్రీహరి మెచ్చగ. ఏమి చెప్పుదున్.
శివ శివ యంచు విష్ణు పద సీమను జేరెను భక్తు డొప్పుగా.
భవహరు డైన శ్రీహరిని పావన మూర్తిని తాను నమ్ముచున్
రిప్లయితొలగించండిస్తవముల జేయుచున్ హరిని తన్మయ మందుచు మిత్తి పిల్వగా
శివహరినాథ పేరుగల చిన్న కుమారుని చేరి పిల్చుచున్
శివ శివ యంచు, విష్ణు పద సీమను జేరెను భక్తు డొప్పుగా.
శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు,ధన్యవాదములు దెలుపుచు
రిప్లయితొలగించండినా పద్యములు మీకు నచ్చిన ఆ ఘనత,ప్రశంసలు నా గురు దేవులకు జెంద వలెను.పామరుని పండితుల మధ్యన నిలిపిన శ్రీ శంకరయ్య గురువుగారికి ,శ్రీ నేమాని గురువుగారికి జెంద వలెను,మరియు తప్పులున్న యడల అవి నావిగా భావించి సవరణలు సూచించమని సవినయముగా ప్రార్థిస్తున్నాను.
గురువుగారు ఇక్కడ "కంఠీరవ" క్రీడా ప్రాంగణము యున్నది.అందుచేత ఆ పదము నుపయోగించితిని.
నిత్యమూ శివ శివ యని స్మరించు తమిళనాడుకు
వెళ్ళిన హరి భక్తుడు శ్రీ విష్ణువుని శివ శివ యని పూజించెను .
==========*=======
శివ శివ యంచు నిత్యము నశేష జనాళి స్మరించు సీమకున్
శివ శివ యంచు నొక్క హరి సేవకుడొచ్చి భజించె శ్రీపతిన్
శివ శివ యంచు,కేశవుడు చిన్మయ రూపుడు గాచు భక్తులన్
శివ శివ యంచు ,విష్ణు పద సీమను జేరెను భక్తు డొ ప్పుగా
భవమను బంధపాశముల బారిని జిక్కిన భక్తులన్ సదా
రిప్లయితొలగించండిశివుడుగ కేశవుండుగను చెంతకు జేరిచి గాచ నొక్కడే
ధవుడని, బ్రహ్మమొక్కటని దల్చె మనమ్మున. బిల్చె " కేశవా,
శివశివ" యంచు విష్ణుపద సీమను జేరెను భక్తుడొప్పుగా
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి సమస్య శివ కేశవులకు అభేదము తెలిపే భావముతోనే యున్నది. విజ్ఞులు ఆలాగుననే బోధించుతారు. శివానంద లహరిలో విష్ణువు శివుని ఎన్నో విధములుగా సేవించు నటులు ఈ క్రింది శ్లోకములో వెల్లడి యగుచున్నది.
బాణత్వం వృషభత్వ మర్థవపుషా భార్యాత్వ మార్యాపతే
ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాది రూపం దధౌ
త్వత్పాదే నయనార్పణంచ కృతవాన్ త్వద్దేహభాగో హరిః
పూజ్యాత్ పూజ్యతర స్స ఏవహి నచేత్ కోవా తదన్యోధికః
తాత్పర్యము:
1. త్రిపురాసుర సంహారము చేయునపుడు ధనుర్ధారియగు పరమేశ్వరునిచే ప్రయోగింప బడిన బాణము నారాయణుడే.
2. శివుని వాహనమయిన నంది విష్ణు స్వరూపుడే.
3. శివుని శరీరములో అర్థ భాగమయిన పార్వతీ దేవి విష్ణుస్వరూపిణియే. ఒకే తత్త్వము పురుష రూపములో అయితే విష్ణువనియు స్త్రీ రూపములో అయితే పార్వతి యనియు ఆర్యోక్తి. విష్ణువు శ్యామలుడు, పార్వతీ దేవి శ్యామల.
4. పార్థివ మహాలింగమునకు మూలమును కనుగొనుటకు విష్ణువు వరాహరూపుడయ్యెను అని దేవీపురాణము చెప్పుచున్నది.
5. జగన్మొహినీ రూపములో విష్ణువు శివునికి సఖి యయ్యెను.
6. శివుడు తాండవమాడు వేళ విష్ణువు మృదంగమును వాయించుచుండును.
7. నిత్యము విష్ణువు 1000 పద్మములతో శివ సహస్రనామ పూజ గావించు చుండును. ఒకనాడు ఒక పద్మమునకు బదులుగా తన నేత్ర పద్మమును సమర్పించుకొనెను.
ఆవిధముగా విష్ణువు పూజనీయులలో గొప్పవాడయ్యెను.
శివ కేశవ అభేదమే ఎల్లరు పాటించ వలసి యున్నది. విష్ణు రూపాయ నమశ్శివాయ అనిన తిక్కన గారి మార్గమే అనుసరణీయము. స్వస్తి.
భవము హరింప దేవతలు పావన విఘ్రహ మూర్తులందరున్
రిప్లయితొలగించండిభువి వెలుగొందు చున్నరని, భేదము లేదని, వారిలోపలన్
అవికల చిత్త శుద్ధు డొక డర్చన జేసెను రామ, శ్రీహరీ
శివ శివ యంచు, విష్ణు పద సీమను జేరెను భక్తుడొప్పగా.
ఎవరెటుచేరగన్ నుదుట నీశ్వరురాతయెనిర్ణయించుగా?
రిప్లయితొలగించండినవనినదాటగాఁదరమెనందలమెక్కినవారికైనయున్
శివశివయంచుభక్తుడటుఁజిక్కితుఫానునగంగపాలవన్
శివశివయంచువిష్ణుపదసీమనుజేరెనుభక్తుడొప్పుగా!
(విష్ణుపాదాలచెంతపుట్టినగంగ లోకలిశాడన్నభావంతో)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి[నందీశ్వరుడు క్రుమ్మగా గజాసురుడు ప్రాణములు విడిచుచు విష్ణుపాదముల వద్ద ఒరిగి ఉంటాడను ఊహ చేస్తూ వ్రాశానండీ, మూడో పాదం లో యతి కిట్టించానో లేదో తెలియదు]
రిప్లయితొలగించండిప్రవిమలభక్తిదాల్చి,ఘన రాక్షస దీక్షను బూనియున్ సదా
శివునిగురించి తా తపము జేసి,వరమ్మునుపొంది కుక్షి స్థా
ణువుకువిలాసమైవరల నోపని నందియె క్రుమ్ముచుండగన్
శివ శివ యంచు విష్ణు పద సీమను జేరెను భక్తు డొప్పుగా.
శివుడ వనంగ నిన్ను గళసీమను శేషుడు చుట్టి వేయగా
రిప్లయితొలగించండిభవుడ వటంచు నిన్ను గని పార్వతి ప్రేమగ పెండ్లి యాడె కే
శవుడు గనెంచి నీదు పదసేవలు జేయుచు నుండె లక్ష్మియౌ
శివ శివ యంచు విష్ణు పదసీమను జేరెను భక్తు డొప్పుగా !
చవిగొని భారతావనిది చక్కని ఫ్లైటున కైలసమ్ముకున్
రిప్లయితొలగించండిభువినిక వీడుచున్ జనగ బుద్ధిగ పైలటు నిద్రపోవగా
చివరకు దారి తప్పుచును చిందులు వేయగ యాత్రికుల్ భళా!
శివ శివ యంచు విష్ణు పద సీమను జేరెను భక్తు డొప్పుగా
భారతావని ఫ్ల్లైటు = Air India Flight