17, నవంబర్ 2012, శనివారం

పద్య రచన - 163

దధీచి
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

Pandita Nemani చెప్పారు...

అమర హితము కొరకు నర్పించెను దధీచి
తన శరీర మంత దాని నుండి
చేసి యాయుధమును చెలగి యుద్ధమ్ములో
నసుర తతుల గెలిచె నమర విభుడు

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

వెన్నుని యనుజుని గెలుపున
కున్నది యొక మార్గ మిదియె ఓ ముని వర్యా
అన్నారని దేవతలకు
వెన్నిచ్చెను మన దధీచి వేగమె ప్రీతిన్.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

తనువున యెముకల నర్పణ
ముని దా చేసె,నసురులను మోదగ వజ్రం
బను నాయుధమున నమరుల
నని గెలిపించెనె, దధీచి యక్కర తోడన్.

మిస్సన్న చెప్పారు...

తనువు త్యాగమొనర్చెను ఘన దధీచి
యమర నాధుని కోర్కెపై నాయుధముగ
వెన్ను నీయగ వెరువక నెన్న తరమె
ఋషి ఋణమ్మును తీర్చగా నెవరి తరము?

పరుల కుపకార మొనరింప పరమ ధర్మ
పాలనమ్మను సూక్తిని జాల నమ్మి
ప్రాణ మైనను పణమిడు భారతీయ
భవ్య సంస్కృతి కిడుదము వందనమ్ము.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

చెడుపైసమరానికిముని
విడుమా నీకాయమనుచు వేడగ
సురులే
వడిగావజ్రాయుధమై
యడచ నసురులన్ దధీచి యమరుండాయెన్!

కంది శంకరయ్య చెప్పారు...

లోకకళ్యాణార్థం తనువును త్యాగం చేసిన దధీచి ప్రాశస్త్యాన్ని చక్కని పద్యాలలో వివరించిన....
పండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
లక్ష్మీదేవి గారికి,
మిస్సన్న గారికి
అభినందనలు, ధన్యవాదములు.

కంది శంకరయ్య చెప్పారు...

సహదేవుడు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

దనుజుల హతమా ర్చుటకని
వెనుకాడక తనువు నిచ్చె వేలుపు తానై !
ఇనునకు వజ్రా యుధమిడి
ముని గణ మందున దధీచి మోక్షము నొందెన్ !

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

అక్కయ్యగారు,
మీ పద్యము చాలా బాగున్నది.