30, నవంబర్ 2012, శుక్రవారం

పద్య రచన - 176

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

 1. ఆలు వండెద నొక పూట యనుచు బలుక
  సంతసింపక మగడు దిగ్భ్రాంతి జెందె
  నెటుల దినువాడ బాపురే యీమె వంట?
  ననెడు బాధతో సోలిపోయెను మగండు

  రిప్లయితొలగించండి

 2. వంట బట్టదు నీ చేతి వంట నాకు
  బట్ట కట్టరు బ్రతికి నీ వంట తినిన
  యనిన సరదాకె యనుకొంటి నదియు నిజమె
  వంట నే జేతు నన జేసె నొంటరిగను.

  రిప్లయితొలగించండి
 3. ఏమిటో మాస్టారూ, నామీద జోకు వేసినట్లున్నది:-)
  ముప్పూటల వండి పెడితి
  తప్పేమియు చేయలేదు తంటా వచ్చెన్
  తప్పను లేదొక్క దినమె,
  ముప్పునఁ బడవేసె నామె మురియుచు నింకన్!

  రిప్లయితొలగించండి
 4. కమ్మ నైన వంట కడుపారఁదినుచుంటి!
  నతని కొక్క మారు నంద జేయు
  భాగ్య మిమ్మనగనె బాల్చితన్నేడన్న!
  బాపు బొమ్మ జెప్ప ఫక్కు మనెమె?

  రిప్లయితొలగించండి
 5. నందివలె నటు కూర్చుండు మిందు వదన
  వంట నీచేత తినగ వైకుంఠ యాత్ర
  నన్ను వలదు రావలదంచు నరక మందు
  స్వర్గ నరకాలు వీడి నీ దుర్గ మునకు
  తిరిగి రాలేను ప్రియ సఖీ మరల లేను
  ------------------------------------------
  మూడెను నాకిక దినములు
  వేడితి నీ చేతి వంట వేడుక కైనన్ !
  కాడుకు బోవలె నెంచితి
  నీడగ రావలదు వెంట నీరజ నేత్రీ !

  కాడు = అడవి

  రిప్లయితొలగించండి
 6. ఎంత కాలమయ్యె ! నెన్నడు లేనిది
  వంట జేతు ననుచు పత్ని పలుక
  చిత్రమైన మాట జీర్ణించుకోలేక
  గుండె యాగిపోయె నండి పతికి

  రిప్లయితొలగించండి
 7. పండిత నేమాని వారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  తృతీయపాదాదిని యడాగమం రాదు. ‘తినిన /ననిన సరదాకె...’ అందాం.
  *
  చంద్రశేఖర్ గారూ,
  స్వీయరహస్యాలను ఇలా పబ్లిగ్గా చెప్పొచ్చా? :-)
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  చిత్రానికి సంపూర్ణ న్యాయం చేసే పద్యం మీది. అభినందనలు.
  ‘తన్నేడన్న’ అని వ్యావహారికం ప్రయోగించారు. ‘తన్నెను చూడు’ అందామా?
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  ‘స్వర్గ నరకాలు వీడి నీ దుర్గ మునకు
  తిరిగి రాలేను ప్రియ సఖీ మరల లేను’ ... చదువుతుంటే కృష్ణశాస్త్రి కవిత చదివినట్టుంది. చాలా బాగుంది.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  చిత్రంలోని భావానికి చక్కని పద్యరూపాన్ని ఇచ్చారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. గురువుగారికి వందనములు.
  ధన్యవాదములు.
  తన్నెనుచూడు అంటే అన్వయం సరిపోదని పిస్తుంది. ఇలాసవరిస్తే బాగుంటుందేమొ పరిశీలించ ప్రార్థన:
  కమ్మ నైన వంట కడుపారఁ దినుచుంటి
  నతని కొక్క మారు నంద జేయు
  భాగ్యమిమ్మనగనె బాల్చితన్నెగదన్న
  బాపు బొమ్మ జూడ ఫక్కు మనమె?

  రిప్లయితొలగించండి