13, నవంబర్ 2012, మంగళవారం

పద్య రచన - 159

కవి మిత్రులకు, బ్లాగు వీక్షకులకు
దీపావళీ పర్వదిన శుభాకాంక్షలు!
 

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

 1. గురువర్యులకు, కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులందరకు దీపావళి శుభాకాంక్షలు.

  ఈ వేళన దీపావళి
  ఈ వెలుగుల వరుసలన్ని ఇంతింతంతై
  ఈవలయుగాక యందరి
  జీవితమున వెలుగు రేఖ శ్రీకృష్ణుండే.

  రిప్లయితొలగించండి
 2. జ్యోతి వెలుగుచు మిక్కిలి సుఖము గూర్చు
  చీకటుల బారద్రోలుచు జీవితమున
  శుభ పరంపరలిచ్చుచు సుధల నింపు
  నాత్మలందు స్వస్తిక్ చిహ్న మనవరతము

  రిప్లయితొలగించండి
 3. మింట వెలిగెడు సూర్యుడు మేలు చేసె
  కంట వెలుగును దైవము కాన్క యిచ్చె
  ఇంట వెలిగెడు దీపములిచ్చు కాంతి
  యంతరమ్మున జ్యోతులె యాత్మ శాంతి.

  రిప్లయితొలగించండి
 4. గురువుగారికి,అన్నయ్య గారికి, అక్కయ్య గారికి మిత్ర బృందమునకు దీపావళి శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 6. శ్రీకరమీ దీపావళి
  యాకరమై వెలుగుచుండు హర్షంబునకున్
  చేకొని దీపంబులనిక
  నేకాలము వెలుగజేయు డిమ్మహిలోనన్.

  దీపము బ్రహ్మాత్మకమై
  పాపంబుల నెల్ల బాపి భాగ్యములొస(గన్)గున్
  దీపించు హృదుల లోపల
  దీపము వెలిగించ నణగు తిమిరము వసుధన్.

  జగదాధారము దీపం
  బగణిత మహిమాన్వితంబు హర్షద మటపై
  నిగమస్తుత్యము కావున
  భగవంతుని రూపమంచు ప్రణతు లొనర్తున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్కని పద్యాలను అందించిన మీకు అభినందనలు శ్రీనివాస ప్రసాద్ తాడేపల్లి రామమూర్తి 09442533899

   తొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 8. భానుడు చింతతో పలికె పాపము ధాత్రికి వెల్గు లెట్టులౌ
  నేను చనంగ రాత్రి యని, నీవిక చింతను వీడు పోయి రా !
  నేనిడు దాన కాంతులను నెమ్మది, నీవరుదెంచు దన్క నా
  మేను గలుంగు దాక యనె మిత్రుని తోడను దివ్వె కూర్మితో.

  రిప్లయితొలగించండి
 9. గురు వర్యులకు కవిమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు.


  దీప్తులను విరజిమ్మును దీపకళిక
  సకల జనులకు కలిగించి సౌఖ్యములను
  జగము నెల్ల కాంతులను నింపగను తరలి
  వచ్చె నేడు దీపావళి పర్వదినము.

  రిప్లయితొలగించండి
 10. పూజ్య గురువులకు , ప్రియమైన సోదరులకు , సోదరి లక్ష్మీ దేవి గారికి , దీపావళి శుభా కాంక్షలు.

  నరకాసురునికి తల్లి చేతిలో మరణిచాలని భూదేవి వర మిచ్చిం దని ,అందువలన ఆమె సత్య భామగా అవత రించి నరకుని వధించిందనీ అనుకున్నాను. సవరణ చేసి నందులకు గురువులకు ధన్య వాదములు

  వలపు దీపము వెలిగించు కలల రాణి
  అలుక బూనకు ననుగాంచి నిలువ లేను
  నగలు చీరెలు లేవని వగపు వలదు
  యెదను నింపితి నీపైన మధుర ప్రేమ !

  రిప్లయితొలగించండి
 11. పాపపవృత్తికివైరము
  దీపముతోననవరతముతేజమువలనన్
  కూపమునందలిబడుగుల
  దీపమువెలిగించిగాచధీరులగుణమౌ!

  రిప్లయితొలగించండి