శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు =======*======== శివుని ననవరతము స్థిరముగ గని బొందె వరము లెల్ల నంది , భక్తి తోడ వరము బొంద వచ్చె కరి బోతు యొక్కటి నంది ప్రక్క నిలచె నంది వలెను |
విశ్వనాథుని నేను సేవిస్తాను ! నువ్వింక కైలాసానికి వెళ్ళు! నీకు పదవీ విరమణ వయసు వచ్చేసింది ! నీ తరువాత వరుసలో నేనే ఉన్నానని రాతి నందితో చెబుతున్నట్టున్న సజీవ నంది :
01) _______________________________
విశ్వ నాథుని సేవింప - వేగముగను వెడలి గుడిముందు వరుసను - వేచియున్న వింత హంతువునకు దారి - విడువ , లెమ్ము ! విరమణను జేయ నీ కింక - వేళ యిదియె నందికేశుడ నీ కివే - వందనములు ! _______________________________ వరుస = క్రమము(queue) హంతువు = ఎద్దు విరమణ = పదవీ విరమణ(retirement)
పండిత నేమాని వారూ, మీ నందీశ్వర స్తుతి మనోహరంగా ఉంది. ధన్యవాదాలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ఒకటి రెండు వ్యావహారిక పదాలున్నా మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘అది + అదిరెను’ అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. రెండవ పాదాన్ని ‘నందియె యటు లుండె నచట...’ అందాం. * వరప్రసాద్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * రామకృష్ణ గారూ, మీ పద్యాలు ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
శ్రీవిశ్వేశ్వరు వాహనంబ వగుచున్ సేవించు నందీశ్వరా!
రిప్లయితొలగించండిదేవా! ధన్యము నీదు జీవితము నన్ దీవింపుమా సత్కృపన్
సేవాభాగ్యము కల్గజేయుము సదా శ్రీకంధరున్ శ్రీమహా
దేవున్ గొల్చుచు నీ సహాయకుడనై దీపింతు నే నాదృతిన్
నందీశుని పోటిగ నా
రిప్లయితొలగించండినందముతో ' పోజు ' జూపు నల్లని నందీ !
ఉందీ విబూది యట్లుగ
అందముగా నుదుట బొట్ట దదిరెను చూడన్.
నందికి దీటుగ వేరొక
రిప్లయితొలగించండినందియి యే యుండె నచట నల్లటి రంగు
న్నందము చిందించుచు మఱి
కందోయికి విందు గూర్చె కంటి రె మీరున్ ?
శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
రిప్లయితొలగించండి=======*========
శివుని ననవరతము స్థిరముగ గని బొందె
వరము లెల్ల నంది , భక్తి తోడ
వరము బొంద వచ్చె కరి బోతు యొక్కటి
నంది ప్రక్క నిలచె నంది వలెను |
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
విశ్వనాథుని నేను సేవిస్తాను !
నువ్వింక కైలాసానికి వెళ్ళు!
నీకు పదవీ విరమణ వయసు వచ్చేసింది !
నీ తరువాత వరుసలో నేనే ఉన్నానని
రాతి నందితో చెబుతున్నట్టున్న సజీవ నంది :
01)
_______________________________
విశ్వ నాథుని సేవింప - వేగముగను
వెడలి గుడిముందు వరుసను - వేచియున్న
వింత హంతువునకు దారి - విడువ , లెమ్ము !
విరమణను జేయ నీ కింక - వేళ యిదియె
నందికేశుడ నీ కివే - వందనములు !
_______________________________
వరుస = క్రమము(queue)
హంతువు = ఎద్దు
విరమణ = పదవీ విరమణ(retirement)
పొద్దున లేచియె కండ్రిక
రిప్లయితొలగించండివద్దకుఁజనుమునుపె పాలి వ్యవసాయముకై
పెద్దయ్యకుమ్రొక్కులిడెడు
బుద్ధినిగొనపూర్వజన్మ పుణ్యంబెద్దో!
నమకము చమకము నేర్వవు
నిమితములౌవిధులవియును నేర్వవు, సామీ
ప్యమెచాలని, శివుని గొలువ
విమలమనంబొకటెవలయు వివరము దెలుపన్.
అలవాటున "అంబా" యన
నిలమానవులవలె మౌనమెంతయొ బరువై
శిలలో నొదిగిన జడుడే
సలిలములైకరగు నిజము సతియే గురుతై.
నందికి మ్రొక్కెద రందరు
రిప్లయితొలగించండిఅందముగా నేను లేన యాక్షే పింపన్ ?
పొందగ నాకును మన్నన
డెందము నందట్టి కోర్కె నెర వేర్చరుగా ?
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమీ నందీశ్వర స్తుతి మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఒకటి రెండు వ్యావహారిక పదాలున్నా మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘అది + అదిరెను’ అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
రెండవ పాదాన్ని ‘నందియె యటు లుండె నచట...’ అందాం.
*
వరప్రసాద్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
రామకృష్ణ గారూ,
మీ పద్యాలు ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
guruvulaku dhanya vaadamulu
రిప్లయితొలగించండిగురువు గారూ..,
రిప్లయితొలగించండిధన్యవాదములు...
శంకరార్యా! ధన్యవాదములు. మీ సూచనతో.. నా సవరణ ...
రిప్లయితొలగించండినందీశుని పోటిగ యా
నందముతో ' పోజు ' జూపు నల్లని నందీ !
ఉందీ విబూది యట్లుగ
అందముగా నుదుట చూడ నదిరెను బొట్టై.