29, నవంబర్ 2012, గురువారం

పద్య రచన - 175

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

 1. సరస మనోంబుజాతముల సార మనోహర భావజాలముల్
  కర మలరారు చుండగ ముఖంబుల నూతన శోభలొప్పగా
  సిరియును శౌరియట్లలరు స్నిగ్ధ మనస్కుల కొప్పుగా వధూ
  వరులకు గూర్తు దీవెనలు వర్షశత మ్మలరార ప్రేమతో

  రిప్లయితొలగించండి
 2. Pandita Nemani వారూ

  సరస మనోంబుజాతముల సార మనోహర భావజాలముల్

  చక్కటి వర్ణన.

  రిప్లయితొలగించండి
 3. శ్రీ లక్కరాజు గారికి శుభాశీస్సులు.
  మీకు పద్యము నచ్చినందులకు సంతోషము.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 4. పృధివీ తలంబు నందున్
  వధూవరులకీ వివాహ బంధము సఫలం
  బది సఖ్యత, సౌమ్యత, పా
  రదర్శకమయి, తెరలేని రాగము గూడన్!

  రిప్లయితొలగించండి
 5. జీవనమెల్ల పాలనము చేయగ బాసను బూనుదంపతుల్
  పావనమైన శాస్త్రముల పై దగు నమ్మిక తోడ నిష్ఠతో
  పావకు సాక్షిగా క్రతువు పద్ధతి మీఱక జేయుచో సదా
  దీవన జేయ పెద్దలిక తీరరె బారులు, మోదమొప్పగా.

  రిప్లయితొలగించండి
 6. మధుర భావంపు కుసుమము లెదను పొదిగి
  తొలగి పోవంగ తెరలన్ని కలల పంట
  నిండు నూరేళ్ళు సుఖముల నుండు మనుచు
  సురలు దిగివచ్చి దీవించె విరులు కురియ

  రిప్లయితొలగించండి
 7. రాజేశ్వరి నేదునూరి గారూ

  మధుర భావంపు కుసుమము లెదను పొదిగి

  చూపులు కలిసిన శుభవేళ హృదయ కుసుమాలు మధురభావాలతో పరిమళిస్తున్నాయి. వావ్.

  రిప్లయితొలగించండి
 8. మరుగేలరా నీకు మాధవా యని తెర
  ......................చాటున సిగ్గిలు చపల నయన!
  తెర దీయరే చెలి తరియింప నినుజూచి
  ......................యెంత సేపని యెంచు కాంతు డివల!
  సుముహూర్త మునకింక సుముఖమే యంతయున్
  ......................రవ్వంత యాగుడన్ బ్రహ్మ గారు!
  చూపులు కలసెడు శుభవేళ యెప్పుడో
  ......................యిరువురకని చూడ నింతులచట!

  నాల్గు కన్నులు ప్రేమతో నవ్వు వేళ!
  రెండు హృదయాల వలపులు పండు వేళ!
  క్రొత్త భావాలు మదులలో కొసరు వేళ!
  పెళ్లి శుభ వేళ !ఎదలెల్ల త్రుళ్లు వేళ!

  రిప్లయితొలగించండి
 9. కవి మిత్రులకు నమస్కృతులు.
  నిన్న బంధువుల ఇంట్లో పెళ్ళికి ఊరికి వెళ్ళి రాత్రి ఎప్పుడో ఇల్లు చేరాను. అందువల్ల నిన్నటి పూరణలను కానీ, పద్యాలను కానీ చూసి వ్యాఖ్యానించే అవకాశం దొరకలేదు. మరి కాసేపట్లో కరెంటు పోతుంది. సాయంత్రం వరకు సమీక్షిస్తాను.
  ఎలాగూ పరస్పర వ్యాఖ్యలు, నేమాని వారి గుణదోష విచారణ కొనసాగుతున్నాయి కదా!
  అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి