24, నవంబర్ 2012, శనివారం

పద్య రచన - 170

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

30 కామెంట్‌లు:

 1. నోరూరించారు, మాస్టారూ, ఆ ఊపులో కొన్నివ్యావహారికపదాలు పడ్డాయి:
  అబ్బా! భలే జిలేబిర
  దెబ్బకి తిని చూడు రెండు తియ్యనివా పై
  జబ్బలు చరిచెద వింకా
  దబ్బున తెండని మరిమరి తపియించెదవో!

  రిప్లయితొలగించండి
 2. బంగారు రంగు చూడ గ
  రంగా నుండగను వచ్చు ' రస ' మాధురితో
  సింగారించిన కన్నె వ
  రంగా కనబడి జిలేబి రమ్మని పిలిచెన్.

  రిప్లయితొలగించండి
 3. చంద్ర శెఖర్ గారూ! ఈరోజు జిలేబి విందు అందరికన్నా ముందారగించి జబ్బలు చరిచారు.

  రిప్లయితొలగించండి
 4. జిలేబిలో రసప్రశస్తి చెప్పబూనుచో సుధీ!
  బళారె! లేదు దాని సాటి భక్ష్యమేదియున్ ధరన్
  గళాన వేసుకొన్నచో సుఖమ్ము గూర్చు తీయనై
  సలాము దాని వన్నె జూడ స్వర్ణ సన్నిభమ్ముగా

  రిప్లయితొలగించండి
 5. శాస్త్రిగారూ, మీరు సింగారించిన కన్నె మోజులో పడ్డారనితెలిసి మీకంటే ఓ అడుగు ముందు వేశాను, అంతే:-)

  రిప్లయితొలగించండి

 6. చామంతుల సంకాశము
  భ్రామరమని భ్రమలు గొల్పు భళి జిహ్వలకున్
  కోమలమునకు జిలేబీ
  లేమందుము విందు లవియ యివి లేకున్నన్ !

  భ్రామరము = తేనె

  రిప్లయితొలగించండి
 7. గురువు గారూ ! అన్యాయము. బొమ్మ చూపించి మమ్మల్ని మోసం చేస్తున్నారు !

  రిప్లయితొలగించండి
 8. ఈ దినము చూడగా నే-
  కాదశి యుపవాసమాయె కట నోరూరెన్
  మీదు జిలేబీ చూడగ
  నేదీ తినుదారి న్యాయమే యిది మాన్యా!

  రిప్లయితొలగించండి
 9. నోరూరు చుండె ని య్యె డ
  యారాముగ దిందు నిపుడ యన్ని జిలేబు
  ల్నార య బంగ రు రంగును
  మీ రె ను గద వాటి జూడ మిలమిల మెఱ సీ

  రిప్లయితొలగించండి
 10. తీయని పాకంబున నిడ
  మాయని వన్నియ గలిగిన మధురమ్మిదియా? (కాదు.)
  నా యభిమానపు భక్ష్యము
  లో యను నాశ లడియాసలు చనెదనింకన్.

  రిప్లయితొలగించండి
 11. అయ్యో! జిలేబి గన మా-
  మయ్యకు నోరూరె గాని మధు బాధితుడే!
  ఇయ్యది చక్కెర రహితం-
  బయ్యిన చెపుడయ్య దీని నాతని కిత్తున్.

  (కొన్ని స్వీటు షాపుల్లో మధు బాధితులకోసం చక్కెర లేకుండా చేసిన
  జిలేబీ, జాంగీరు వగైరా మధుర పదార్థాలు ప్రత్యేకంగా చేసి అమ్ముతూంటారు కదా.)

  రిప్లయితొలగించండి
 12. నీమేన నహా! జిలుగులు
  నామాధుర్యమ్ముఁగనగనాశ్చర్యంబౌ
  నీ మార్పు కలిగెఁ గద శ్రీ
  శ్యామలరాయని శతకముఁ జదువ జిలేబీ?

  రిప్లయితొలగించండి
 13. మినప గుళ్ళు తెచ్చి మేలి రకమ్మును
  నీటిలోన నాన నిచ్చి పిదప
  పిండి రుబ్బవలయు నండి మెత్తగ దాని
  పులియ బెట్ట వలెను పూటబాటు.

  పంచ దార దెచ్చి బాణలిలో పోసి
  నీరు జేర్చి సన్న నెగడు మీద
  లేత పాక మైన రీతిని కానిచ్చి
  ప్రక్క నుంచవలయు పదిలముగను.

  నూనెను మూకుడు లోనిడి
  మానుగ స్టౌ పైన బెట్టి మరిగిన పిదపన్
  పూనిక పులిసిన పిండిని,
  పానకమును ప్రక్కనుంచి పళ్ళెము లోనన్,

  కొబ్బరి చిప్పకు కొద్దిగ
  దబ్బనమున చిల్లు జేసి దానిలొ పిండిన్
  గొబ్బున నుంచిన పిమ్మట
  నబ్బురమగు చుట్ట వోలె నయ్యది దానిన్,

  కాగు నూనె లోన కమ్మగ వేయించి
  వేడి వేడి చుట్ట వేయ వలెను
  పాకమందు నాన బాగుగా తయ్యారు
  తీయనౌ జిలేబి తినగ పొండు.

  రిప్లయితొలగించండి
 14. మిస్సన్న మహాశయా ! ఈ పర్యాయము మీ ఎలమంచిలి వచ్చేటప్పుడు మీ చేతి జిలేబీ రుచి చూడాలి. అద్భుతము !

  రిప్లయితొలగించండి
 15. రింగులు చుట్టిన జిలేబి
  రంగుల ఘుమ ఘుమలు గనిన రసజ్ఞత నొందున్ !
  పొంగుచు రుచులను గోరుచు
  కంగారు బడకు వక్త్రమ కతుకుట కిపుడే !

  రిప్లయితొలగించండి
 16. అయ్యా మూర్తి మిత్రమా! నా భార్యకు మీ కామెంట్ వినిపిస్తే
  మేం కూత కరణాలమే గాని చేత కరణాలం కాదని చెప్ప మందండీ.

  రిప్లయితొలగించండి
 17. మిస్సన్నగారు మైదా
  మిస్సైతిరి, వట్టి పిండిఁ మెరుగున చుట్టన్
  కస్సున విడిపోవు గదా
  బుస్సనక కొలదిగ మైద పొడి కలపండీ!

  రిప్లయితొలగించండి
 18. కవిమిత్రు లందరూ ఈరోజు తమ పద్యాల్లో మాధుర్యాన్ని నింపారు. (మధుమేహ వ్యాధిగ్రస్తు లెవరైనా ఉంటే మన్నించాలి). తీయని పద్యాలను రచించి పరస్పరం ఛలోక్తులు విసురుకుంటూ విందు చేసిన...
  చంద్రశేఖర్ గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  పండిత నేమాని వారికి,
  గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
  మిస్సన్న గారికి,
  సుబ్బారావు గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  రామకృష్ణ గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 19. శంకరార్యా! ధన్యవాదములు.

  మిస్సన్నగారూ ! అన్యాయమండీ .. చక్కగా జిలేబి చేసి ..తినగ పొండు అంటే ఎలాగండీ..తినగ రండు..అంటారని ఎదురు చూసాను...మాకు కూడా కొంచం రుచి చూపండీ..

  రిప్లయితొలగించండి
 20. మిస్సన్నగారి జిలేబీ మహ కమ్మగా నున్నది !

  రిప్లయితొలగించండి
 21. మిత్రులందరికీ ఒక తీపి బహుమతి !

  అక్బర్-సలీం-అనార్కలి చిత్రంలోని
  సిపాయీ ! ఓ..సిపాయీ ! పాటకు
  అనుసరణ :
  ________________________________

  ******** జిలేబీ ********

  జిలేబీ ! ఓ... జిలేబీ !
  నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో -
  నా మనసు నడుగు అడుగు అడుగు చెబుతుందీ !
  జిలేబీ ! ఓ... జిలేబీ !

  జిలేబీ ! ఓ... జిలేబీ !
  నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో -
  నా మనసు నడుగు అడుగు అడుగు చెబుతుందీ !
  జిలేబీ ! ఓ... జిలేబీ !

  చరణం 1:

  మదిలోన నిన్నూ తలచితే - నోరూరు తప్పక నిజములే
  నోట్లోన నిన్నూ చేర్చితే
  నోట్లోన నిన్నూ చేర్చితే
  మది యంత హాయిగా మారునులే !
  జిలేబీ ! ఓ... జిలేబీ !

  మా తలపులలో కదలాడునులే - నీ తీపి గుర్తులే
  ఆ గుర్తులలో చెలరేగునులే
  ఆ గుర్తులలో చెలరేగునులే
  మాలోని కోరికే !
  జిలేబీ ! ఓ... జిలేబీ !

  చరణం 2:

  మది గెలిచిన నీ రుచి గొప్పదే - నర జాతికి నీవొక వరములే
  సురలోక మందున అమృతం
  సురలోక మందున అమృతం
  భూలోక మందున నీవెగా
  జిలేబీ ! ఓ... జిలేబీ !

  యీ రూపములో ఉదయించితివీ - మా భాగ్య వశమునా
  తియ తియ్యని రుచులను పంచుటలో
  తియ తియ్యని రుచులను పంచుటలో
  నీసాటి నీవెలే
  జిలేబీ ! ఓ... జిలేబీ !
  ________________________________

  రిప్లయితొలగించండి
 22. ఆ సినిమాలోని పాట :

  చిత్రం: అక్బర్ సలీం అనార్కలి (1978)
  సంగీతం: సి.రామచంద్ర
  గీతరచయిత: సినారె
  నేపధ్య గానం: మహమ్మద్ రఫీ, పి.సుశీల

  ________________________________

  పల్లవి:

  సిపాయీ.. సిపాయీ..
  సిపాయీ.. సిపాయీ..
  నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో...
  ఈ వాలుకనులనడుగు అడుగు చెపుతాయీ..
  సిపాయీ.. ఓ..సిపాయీ..

  హసీనా.. హసీనా..
  నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
  ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా..
  హసీనా.. ఓ.. హసీనా..

  చరణం 1:

  జడలోనా మల్లెలు జారితే... నీ ఒడిలో ఉన్నాననుకున్నా..
  చిరుగాలిలో కురులూగితే.. చిరుగాలిలో కురులూగితే..
  నీ చేయి సోకెనని అనుకున్నా..

  ఆ.. మల్లెలలో కదలాడినవి నా కలవరింపులే..
  ఆ గాలిలో..చెలరేగినవి.. ఆ గాలిలో చెలరేగినవి..
  నా నిట్టూరుపులే... హసీనా..

  చరణం 2:

  తడి ఇసుకను గీసిన గీతలు.. అల తాకితే మాసి పోతాయి..
  ఎదలోన వ్రాసిన లేఖలు..ఎదలోన వ్రాసిన లేఖలు..
  బ్రతుకంతా వుండి పోతాయి..

  ఆ.. లేఖలలో ఉదయించినవి నా భాగ్యరేఖలే..
  మన ఊపిరిలో పులకించినవి.. మన ఊపిరిలో పులకించినవి..
  వలపు వాకలే.. సిపాయీ...
  ________________________________

  రిప్లయితొలగించండి
 23. శ్రీ వసంతకిశోర్ గారి అనుకరణలు గులాబీలను జిలేబిలను మించి యున్నవి. అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 24. వసంత కిశోర్ గారూ,
  మీ పేరడీ ‘మధురం’గా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 25. చంద్ర శేఖరా జిలేబీ మైదాతో చేయవచ్చు మినప పిండితో నైనా చేయవచ్చు నంటే అలా వ్రాశాను.
  మైదా అయితే కడుపు నొప్పి వస్తుందేమో నని........... అదన్న మాట.
  .

  రిప్లయితొలగించండి
 26. హనుమచ్ఛాస్త్రి గారూ ముందు రండందామనే అనుకొన్నాను కానీ
  తీరా మీరందరూ వచ్చి జిలేబీ పెట్ట మంటారేమోనని పొండన్నాను మాట.

  రిప్లయితొలగించండి
 27. కిశోర మహోదయా మీ జిలేబి చుట్టలు మాంఛి తీపిగా ఉన్నాయి.

  రిప్లయితొలగించండి