కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పరువు నిలిపె రణము వీడి పారి పోయి యయ్యెడన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రులకు ధన్యవాదములు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పరువు నిలిపె రణము వీడి పారి పోయి యయ్యెడన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రులకు ధన్యవాదములు.
సరస వాగ్విలాసు డొకడు సన్నుతించుచున్ సమా
రిప్లయితొలగించండిదరము తోడ బలికె నిటుల ధర్మనందనా! బళా!
త్వరగ ఘోషయాత్రలోన భానుజుడు భయార్తుడై
పరువు నిలిపె రణము వీడి పారిపోయి యయ్యెడన్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
గ్రామానికి ప్రాతినిథ్యం వహించ వచ్చిన ఒక మల్లయుద్ధ ప్రవీణుడు :
01)
_______________________________
పురము నందు మల్ల యుద్ధ - పోటి యందు పాల్గొనన్
విరతి లేక విసువు లేక - వెఱ్ఱి యయ్యె సాధనన్ !
విరిగె కాలు, కుక్క యొకటి - వేగ వెంట తరిమినన్ !
పరువు నిలిపె రణము వీడి - పారి పోయి యయ్యెడన్ !
వెరపు లేని మనసు , మిగుల - వేద నందు మునుగగన్ !
_______________________________
రిప్లయితొలగించండిసరగు రథము నిలుపుమయ్య చావు వచ్చె నంచు ను
త్తరుడు పలికె జారె గుండె దైర్యమింత లేక ను
త్తరము నిడక విజయు జూచి, తల్చె తండ్రి యిట్లనున్
"పరువు నిలిపె రణము వీడి పారి పోయి యయ్యెడన్"
ఇది ఉత్సాహము అనుకొనుచున్నాను.
రిప్లయితొలగించండివిరాటరాజు సభలో ప్రకటన జేయుట
సురపతి తనయుడును శౌరి శూరవరుడు నేడు మా
పరువు నిలిపె;రణము వీడి పారి పోయి యయ్యెడన్
తురగములను ద్రిప్పుమనగ తోడు నిల్చె నప్పుడు
త్తరునకునిటు;గెలుపు నిచ్చి దయను జూపె పార్థుడే.
ఉత్సాహము :
రిప్లయితొలగించండిపరుగున రథమెక్కి వెడలె పార్థు డనికి కౌరవుల్
విరటుని కడనున్న యాల వెంటగొన విరటునకున్
పరువు నిలిపె ; రణము వీడి పారిపోయి యయ్యెడన్
భీరు వయ్యె నుత్తరుండు విజయు డంత గెలువగన్
ఉత్తరకుమారుని ఊహించికొనుచూ చెప్పిన పద్యము........
రిప్లయితొలగించండివిరటరాజసూనుడితడు వీరవర్యుడీస్థలిన్
పరుషపదములాడిమీదు పౌరుషప్రతాపముల్
పొరిగొనంగ పార్థుఁదెచ్చి పూనెసారథిక్రియన్
పరువునిలిపెరణమువీడి పారిపోయి యయ్యెడన్.
రిప్లయితొలగించండిఓడిన పతితోడన్ ముగ్గు రాడువార
మైతి మని రెచ్చగొట్టి యర్ధాంగి సతుల
పరువు నిలిపె; రణము వీడి పారిపోయి
యయ్యెడన్ జేరినట్టి తిక్కన్న కుమిలె.
మురిసి యూర్వసి సరసాల ముంచుమనచుఁగోరినన్
రిప్లయితొలగించండివరుస కాదు తొలగ మనగ,పార్థ! పేడి గమ్మనన్
పరువు నిలిపె 'రణము' వీడి పారి పోయి యయ్యెడన్!
వరమె! క్రీడి కది విరాట ప్రభువుఁజేరు వేళలో!
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిఘోషయాత్రా ఘట్టంతో చక్కని పూరణ నందించారు. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ మల్లయుద్ధ వీరుని పూరణ బాగుంది. అభినందనలు.
‘యుద్ధ పోటి’ అని సమాసం చేయరాదు కదా!
‘వేదనందు’ను ‘వేదనమున’ అని సవరించండి.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఉత్తరుడు విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘సరగున’ అనాలి కదా! అక్కడ ‘సరగున నిక నిలుపు రథము...’ అంటే ఎలా ఉంటుంది?
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘శౌరి’ అంటే శూరుని మనుమడు - విష్ణువు. మీరు అర్జున పరంగా వ్రాసారు. ‘శౌరి శూరవరుడు’ను ‘శౌరి సుహృదయుండు’ అందాం. శౌరి = కృష్ణునకు, సుహృదయుండు = స్నేహితుడు - అర్జునుడు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
నిజమే గురువుగారు,
రిప్లయితొలగించండిమన్నించగలరు.
సవరణకు ధన్యవాదములు.
మరి నా పూరణల, పద్యాల గుణదోష విచారణను చేసే మిత్రు లెవరు?
రిప్లయితొలగించండిగురువు గారు,
రిప్లయితొలగించండితేట గీతి చక్కటి తేట తెలుగులోఉత్సాహంగా చెప్పితిరి కదా!
మొత్తముమీద ఆ తిక్కన్న గారి అర్థాంగి మీ మెప్పును అప్పుడప్పుడూ పొందుతూ ఉంటుంది.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమాస్టరు గారూ ! ధన్యవాదములు ..మీరు చూపిన సవరణ తో..తేరుకొని...
రిప్లయితొలగించండిసరగున నిక నిలుపు తేరు చావు వచ్చె నంచు ను
త్తరుడు పలికె పగిలె గుండె గుండె దైర్యమింత లేక ను
త్తరము నిడక విజయు జూచి, తల్చె తండ్రి యిట్లనున్
"పరువు నిలిపె రణము వీడి పారి పోయి యయ్యెడన్"
బరువు మోడి పట్టు బట్టి భాగ్య మొందగానటన్
రిప్లయితొలగించండిసురను గ్రోలి రాహులుండు సుద్దు లెల్ల పల్కుచున్
జ్వరము వచ్చె నాకటంచు జైత్రయాత్ర వీడుచున్
పరువు నిలిపె రణము వీడి పారి పోయి యయ్యెడన్