కనుమరు గవుతున్న మన కళారూపాలలో ఒకటైన బుర్రకథ గురించి చక్కని పద్యాలను వ్రాసిన లక్ష్మీదేవి గారికి, సుబ్బారావు గారికి, పండిత నేమాని వారికి, రాజేశ్వరి అక్కయ్యకు, హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి, నాగరాజు రవీందర్ గారికి, జంగిడి రాజేందర్ గారికి అభినందనలు, ధన్యవాదాలు.
మిస్సన్న గారు,
రిప్లయితొలగించండిధన్యురాలను.
సరసపు బలుకుల కూడిన
చిఱకాలపు బుఱ్ఱ కథల చెప్పెడు వారే
కఱువైన కాలమకటా!
తరములు మారగ కళలను తరిమిన వేళన్.
బు ఱ్ఱ కధను వి నుటకు నో బుడత లార!
రిప్లయితొలగించండిరండు వేగమె మీరలు రచ్చ దరికి
చెప్పు చుండెను కధకుడు చెవుల కింపు
గాను శ్రీ కృష్ణ లీలల కధను నచట .
వినరండు వినరండు వీనుల విందుగా
రిప్లయితొలగించండి....నేను చెప్పెదను తందాన తాన
నవరసమ్ములు నింపి నానా కథలు మీకు
....నేను చెప్పెదను తందాన తాన
నా పాట కనువుగా నా సోదరుడు మీకు
....తగ వివరించు తందాన తాన
మా బావమరది యీ మాటకారి బళారె
....నవ్వించు మిమ్ము తందాన తాన
పుట్టి ఆంధ్ర ప్రదేశులో బుర్రకథల
దళము లాదరమొందె తందాన తాన
కాని ఈనాటి టీవీల కాలమందు
వాని యోగమ్మె మారె తందాన తాన
తానతం దాన యనుచును
రిప్లయితొలగించండిగానము చేయుచును వారు కధలే తెలుపన్ !
జానపద బుఱ్ఱ కధలన
నానాటికి కరువు గాదె నవ్య చరిత్రన్ !
తందనాన యంచు ధరణిలో జనులకు
రిప్లయితొలగించండినాట పాట గూర్చి యనుపమమగు
రీతి కథను జెప్పి చేతంబు దీపింప
జేయు బుర్రకథలు శ్రీకరముగ
వర్తమానమైన పౌరాణికంబైన
రాజచరితమైన రమ్యఫణితి
వర్ణనంబు చేసి కర్ణపేయంబుగా
పలుకుచుందు రిందు భవ్యముగను.
తెలుగువారి లోని వెలుగుల కీకళ
సాక్ష్య మాంధ్రదేశసంస్కృతులను
హాయిగొల్పునట్టు లద్దమందున జూపు
పుడమి వారె కెందు బుర్రకథలు.
తెలుగువారి లోని వెలుగుల కీకళ
రిప్లయితొలగించండిసాక్ష్య మాంధ్రదేశసంస్కృతులను
హాయిగొల్పునట్టు లద్దమందున జూపు
పుడమి వారి కెందు బుర్రకథలు.
చెంచు నాటకం హరికథ చెక్కభజన
రిప్లయితొలగించండిగొల్ల సుద్దులు కొఱవంజి కూచిపూడి
బుట్టబొమ్మలు జేగంట బుఱ్ఱ కథలు
తోలుబొమ్మలు పగటి వేషాలు దొమ్మ
రాటలు జడకోలాటము లాది తెలుగు
జానపద కళారూపాలు చతుర కళలు.
వినుట కింపు గాను వినిపించు కధలందు
రిప్లయితొలగించండిజాన పదుల పలుకు గాన మనగ
నవ రసమ్ము లొలుకు నవ్య రీతిని పాడు
ఒగ్గు కధలు వినగ నిగ్గు గాదె !
రిప్లయితొలగించండిఒగ్గుకథలు నేడు తగ్గుతుండెనయ
హరికథలు నెల్ల హరిని చేరెనయ
భజనకీర్తన లన్ని భస్మమౌతుండె
శ్రీరాజ శ్రీరాజ శివరామరాజ!
కనుమరు గవుతున్న మన కళారూపాలలో ఒకటైన బుర్రకథ గురించి చక్కని పద్యాలను వ్రాసిన
రిప్లయితొలగించండిలక్ష్మీదేవి గారికి,
సుబ్బారావు గారికి,
పండిత నేమాని వారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
జంగిడి రాజేందర్ గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
మీ బ్లాగు చాలా బాగుంది. దన్యవాదాలు.
రిప్లయితొలగించండిమీ బ్లాగు చాలా బాగుంది. దన్యవాదాలు.
రిప్లయితొలగించండి