9, నవంబర్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 872 (సిగరెట్టులఁ గాల్చఁదగును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సిగరెట్టులఁ గాల్చఁదగును సేమము కొఱకున్.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

20 కామెంట్‌లు:

  1. సిగ పట్టులు సిగరెట్టులు
    తెగ మనిషిని పాడు చేయు దేహము చెడురా
    వెగటు పడి పోసి గుట్టగ
    సిగరెట్టులఁ గాల్చఁదగును సేమము కొఱకున్.

    రిప్లయితొలగించండి
  2. భుగభుగమని పొగ జిమ్మెడు
    సిగరెట్టుల గాల్చ దగును? సేమము కొరకున్
    పొగ త్రాగరాదు కదరా
    పొగ మానని యెడల నీవె చెడిపోదువురా

    (సిగరు అంటే చుట్ట అనే అర్థములో పూరించేను).

    రిప్లయితొలగించండి
  3. నగరము వెలుపల నరయగ
    సిగరెట్టుల గాల్చ దగును , సే మము కొఱకున్
    పగతుర జోలికి పోకుము
    పగ గలిగిన నిదుర రాదు పాడగు మతియున్ .

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
    ధన్యవాదములు దెలుపుచు

    శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి శ్రీరామ మానస పూజ
    చదివిన పిమ్మట భక్తితో వారికి నా కానుక
    =====*======
    అబ్బబ్బ రామ నామము
    గొబ్బున బట్టిన గురువులు కొందరు, మహిలో
    నబ్బురము "రామ జోగిగ"
    మబ్బులు ద్రుంచ నుదయించె మన నేలపయిన్

    రిప్లయితొలగించండి
  5. పొగఁబట్టెడి సిగరెట్టుల
    భుగభుగమనికాల్చి హాని పొందుటకన్నన్
    పొగ హాని మాపు విద్యుత్
    సిగరెట్టులఁ గాల్చఁదగును సేమము కొఱకున్.

    రిప్లయితొలగించండి
  6. పొగ త్రాగుట దుష్కృత్యం
    బగణిత రుగ్మతల గూర్చు హానిద మటపై
    వగ గలిగించును, ప్రోవిడి
    సిగరెట్టుల గాల్చదగును సేమము కొరకున్

    రిప్లయితొలగించండి

  7. పొగఁ ద్రాగుట హానికరము
    మగధీరులు వీధి వీధి మంటలుఁ బెట్టీ
    పగ దీరగ సెగ వుట్టగ
    సిగరెట్టులఁ గాల్చఁ దగును సేమము కొఱకున్

    రిప్లయితొలగించండి
  8. మగడికి స్వస్థత చెడగనె
    సిగరెట్టుల దాచ దగును షెల్ఫున సతియే !
    భుగభుగనె పొయ్యిన విసిరి
    సిగరెట్టుల గాల్చదగును సేమము కొఱకున్ !

    సగటున కాన్సరు వలె నన
    సిగరెట్టుల గాల్చదగును ; సేమము కొఱకున్
    పొగ త్రాగుట విడువ వలయు ;
    పొగ త్రాగినచో యమపురి బోవుట తథ్యం !

    రిప్లయితొలగించండి
  9. మా శ్రీరామ మానస పూజ గురించి ఆనందమను గొలుపు వ్యాఖ్యలను వ్రాసిన శ్రీ కంది శంకరయ్య గారికి శ్రి హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి శుభాశీస్సులు.

    శ్రీ హరి వారూ! మీరు విజయనగరము జిల్లాలో ఎక్కడ నుంటున్నారో మాకు తెలియజేయండి. నా విలాసములు:
    ఫోను: 0891 - 2565944 / 9440233175

    మీ ఫోను పిలుపుకై ఎదురు చూచుచుంటాను.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. మగువలు మెచ్చని ఘాటగు
    పొగ త్రాగుట తప్పుగాదు పొందగ సుఖముల్ !
    దిగులును పెంచక మితముగ
    సిగరెట్టులఁ గాల్చఁ దగును సేమము కొఱకున్ !

    రిప్లయితొలగించండి
  11. ఈనాటి సమస్యకు అందరూ సరసమైన పూరణ లందించారు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారు ‘సిగరెట్లను గుట్టగా పోసి తగులబెట్టా’ లన్నారు. బాగుంది.
    *
    పండిత నేమాని వారు ‘సిగర్ ఎట్టుల కాల్చదగును?’ అని ప్రశ్నార్థకంగా మార్చి చక్కని పూరణ నిచ్చారు.
    *
    సుబ్బారావు గారు ‘నగర ప్రజల ఆరోగ్యం కోరి నగరం వెలుపల పొగ త్రాగా’ లని సలహా ఇచ్చారు. బాగుంది.
    *
    చింతా రామకృష్ణారావు గారు ‘పొగ బెట్టని విద్యుత్ సిగరెట్లను కాల్చ’మన్నారు. ప్రశస్తంగా ఉంది.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారు ‘ప్రోవిడి సిగరెట్టుల కాల్చదగు’ నన్నారు. ప్రోవిడి అంటే?
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారు చాలా కాలానికి కలానికి పని కల్పించారు. వీరూ సిగరెట్లను తగులబెట్టమన్నారు. బాగుంది. ‘బెట్టీ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘మంట లెగయగా’ అందాం.
    *
    నాగరాజు రవీందర్ గారు రెండు చక్కని పూరణలు అందించారు. రెండవ పూరణలో సమస్యను విరిచి విశేషార్థాన్ని సాధించారు. బాగుంది.
    ‘భుగభుగనె’ ?
    *
    రాజేశ్వరి అక్కయ్య సిగరెట్లపైన కంట్ర్రోల్ విధించారు. పూర్తిగా వెంటనే మానడం కష్టం కదా... అందుకని పరిమితంగా తాగమన్నారు. బాగుంది.
    *
    వరప్రసాద్ గారు ‘రామజోగి మందు’ గొని ఆనందంతో చక్కని పద్యం వ్రాసారు.
    *
    అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. ఆర్యా!
    నమస్కారములు.
    ప్రోవు+ఇడి - ఒక్కచోట చేర్చి కాల్చివేయాలనే అర్థంలో వ్రాశాను.

    రిప్లయితొలగించండి
  13. నేమాని వారికి నమస్సులు.

    మీ పూరణలో ఆఖరిపాదమైన "పొగ మానని యెడల నీవు చెడిపోదువురా" లో యతి సరిపోవునా? అది సరియైన కొద్దిగా వివరించగలరు..

    రిప్లయితొలగించండి
  14. మా పద్యము ఆఖరి పాదములో యతిని గమనించలేదు. ఆ పాదమును ఇలా మార్చుచున్నాను:
    "పొగ మానని వారలు చెడి పోవుదు రకటా!"
    యతి గురించి జ్ఞాపకము చేసిన మిత్రునికి అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. నారోజు రాజమౌళి, హుస్నాబాద్ఆదివారం, నవంబర్ 11, 2012 6:38:00 PM

    పొగగొట్టగ మరిసోకని
    తెగ గొట్టుట వల్ల బతుకు తెగానార్చునదిన్
    విగతుని జేసియు కూల్చగ
    సిగరెట్టుల? కాల్చదగును సేమము కొరకున్

    రిప్లయితొలగించండి
  16. నారోజు రాజమౌళి, హుస్నాబాద్ఆదివారం, నవంబర్ 11, 2012 6:39:00 PM

    పొగగొట్టగ మరిసోకని
    తెగ గొట్టుట వల్ల బతుకు తెగానార్చునదిన్
    విగతుని జేసియు కూల్చగ
    సిగరెట్టుల? కాల్చదగును సేమము కొరకున్

    రిప్లయితొలగించండి
  17. నారోజు రాజమౌళి, హుస్నాబాద్ఆదివారం, నవంబర్ 11, 2012 6:41:00 PM

    పొగగొట్టగ మరిసోకని
    తెగ గొట్టుట వల్ల బతుకు తెగానార్చునదిన్
    విగతుని జేసియు కూల్చగ
    సిగరెట్టుల? కాల్చదగును సేమము కొరకున్

    రిప్లయితొలగించండి
  18. బ్రహ్మచారి (1965):

    వగలను మాపుట కొఱకున్
    సొగసుగ హీరోల వోలు షోకుల కొఱకున్
    మగువల మెప్పుల కొఱకున్
    సిగరెట్టులఁ గాల్చఁదగును సేమము కొఱకున్

    రిప్లయితొలగించండి
  19. మగువల ధాటిని తాళక
    జగమెరిగిన సాంబశివుడు జపతపములతో
    తగవులు జగడములు వదలి
    సిగరెట్టులఁ గాల్చఁదగును సేమము కొఱకున్

    రిప్లయితొలగించండి