శ్రీ శంకరయ్య గురుదేవులకు ,శ్రీ నేమాని గురు దేవులకు పాదాభి వందనము జేయుచూ కుటుంబ మరియు పరీక్షల సమస్యలతో బ్లాగునకు దూర మైతిని. గురుదేవులకు మరియు బ్లాగు వీక్షకులకు నా రచనలు (పద్యములు ) నొప్పించినచో క్షమించమని సవి నయముగా ప్రార్థిస్తూ =======*======== ఈ జాతికి గంధర్వులు మా బాహువు దట్టు గురువు,మాన్యులు భువిలో శ్రీ జానకీ సుత,సుకవి రాజ,విరాజితము శంకరాభరణంబౌ |
తాత్పర్యము: ఓ శంకరా! నాలో జడత్వము గాని (జలము వలె), పశుత్వము గాని (నంది వలె), కళంకితత్వము గాని (చంద్రుని వలె), కుటిల చరత్వము గాని (పాము వలె) లేవు కదా. ఒక వేళ అట్టి అర్హతలు ఉండినచో నీ ఆభరణము అగుటకు పాత్రుడుని అయే వాడిని కదా!. వ్యంగ్యముగా అర్థము స్ఫురించే రీతిలో దీనిని బట్టి సుమారు 1200 సంవత్సరముల క్రిందట కూడా రాజుల వద్ద ఉద్యోగమునకు కావలసిన అర్హతలను ఇందు పేర్కొనిరి. మంచి సంస్కారములు కలవానికి ఉద్యోగములు ఉండవని దుర్లక్షణములు కలవానికే లభించునని భావము కదా! స్వస్తి.
అయ్యా చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు. మీ పద్యము చాల బాగుగనున్నది. అభినందనలు. 2వ పాదములో తేజోమూర్తైనకి బదులుగ తేజోనిధియైన అంటే ఇంకా సొగసుగా నుంటుంది. చూడండి. స్వస్తి.
కవి మిత్రులకు నమస్కృతులు. నిన్న బంధువుల ఇంట్లో పెళ్ళికి ఊరికి వెళ్ళి రాత్రి ఎప్పుడో ఇల్లు చేరాను. అందువల్ల నిన్నటి పూరణలను కానీ, పద్యాలను కానీ చూసి వ్యాఖ్యానించే అవకాశం దొరకలేదు. మరి కాసేపట్లో కరెంటు పోతుంది. సాయంత్రం వరకు సమీక్షిస్తాను. ఎలాగూ పరస్పర వ్యాఖ్యలు, నేమాని వారి గుణదోష విచారణ కొనసాగుతున్నాయి కదా! అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
శ్రీజననీ సంకల్ప వి
రిప్లయితొలగించండిరాజితమును సకల లోక రంజకమును సం
పూజితము సుకవి పండిత
రాజ విరాజితము శంకరాభరణంబౌ
ఈజీ పద్యమొకటి కవి
రిప్లయితొలగించండిరాజవిరాజితము శంకరాభరణంబౌ
నీ జాల బ్లాగు నందున
మోజున వ్రాయగ దలంతు పూరణ లందున్
పూజల నందెడి గురువులు
రిప్లయితొలగించండితేజముగా పద్యమల్ల తెనుగున నేర్పన్
బీజము వృక్షంబగు కవి
రాజ విరాజితము శంకరాభరణంబౌ.
అయ్యా హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులుమీ పద్యము బాగున్నది.
రిప్లయితొలగించండి2వ పాదములో "పద్య మల్ల" కి బదులుగ "పద్య రచన" అంటే సొగసుగా ఉంటుందేమో. చూడండి.
స్వస్తి
రిప్లయితొలగించండితేజము తెలుగై ప్రోగిడి
యోజస్సున ఛంద మందు హొయలును జూపన్
భ్రాజిత తారలె కవులన
రాజవిరాజితము శంకరాభరణంబౌ !
గాజుల సవ్వడి గలగల
రిప్లయితొలగించండిరాజేశ్వరి యక్క,చెల్లి లక్ష్మీ కవితల్
జాజుల పరిమళ భరితము !
రాజవిరాజితము శంకరాభరణంబౌ !!
నరసింహమూర్తి గారూ!
రిప్లయితొలగించండి:))
శ్రీ శంకరయ్య గురుదేవులకు ,శ్రీ నేమాని గురు దేవులకు పాదాభి వందనము జేయుచూ
రిప్లయితొలగించండికుటుంబ మరియు పరీక్షల సమస్యలతో బ్లాగునకు దూర మైతిని. గురుదేవులకు మరియు బ్లాగు వీక్షకులకు నా రచనలు (పద్యములు ) నొప్పించినచో క్షమించమని సవి నయముగా ప్రార్థిస్తూ
=======*========
ఈ జాతికి గంధర్వులు
మా బాహువు దట్టు గురువు,మాన్యులు భువిలో
శ్రీ జానకీ సుత,సుకవి
రాజ,విరాజితము శంకరాభరణంబౌ |
నతుల నొసంగెద నమ్రతతోడ ఘనమ్మగు కానుక నాకిదియే.
రిప్లయితొలగించండిరాజిలు పాదము నొక కవి
రాజ విరాజితము నేను రచియింపంగా,
సాజముగా మెచ్చుకొను కవి
రాజవిరాజితము శంకరాభరణంబౌ.
అమ్మా! లక్ష్మీ దేవి గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
ఒక మాత్ర ఎక్కువ అయినది 3వ పాదములో. టైపు -పొరపాటేమో. సాజముగ మెచ్చుకొను కవి అందామా? స్వస్తి
చక్కని సవరణ చూపిన శ్రీ పండిత నేమాని గారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండివారు చూపిన సవరణ తో..
పూజల నందెడి గురువులు
తేజముగా పద్య రచన తెనుగున నేర్పన్
బీజము వృక్షంబౌ కవి
రాజ విరాజితము శంకరాభరణంబౌ.
నిజమేనండి. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశ్రీ వర ప్రసాద్ గారు!శుభాశీస్సులుమీ పద్యము 2వ పాదములో ప్రాస లేదు. పద్యము యొక్క భావము నాకు తెలియుట లేదు. స్వస్తి.
రిప్లయితొలగించండిబీజము పద్యమ్ములకును
రిప్లయితొలగించండిఓజము కవిపండితులకు నొరవడి దిద్దన్
రాజిలునది నానా కవి
రాజ విరాజితము శంకరాభరణంబౌ
పూజార్హులు గురువర్యులు
రిప్లయితొలగించండితాజా విషయాల కవులు తగ జెప్పగ బే
రీజుల నడిపించెడు గురు
రాజ విరాజితము శంకరాభరణంబౌ!
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిశంకరుని ఆభరణముగా అవాలంటే కావలసిన అర్హతలను శివానందలహరిలో వ్యంగ్యంగా ఇలా వర్ణించేరు.
జడతా పశుతా కళంకితా
కుటిల చరత్వంచ నాస్తి మయి దేవ!
అస్తి యది రాజమౌళే
భవ దాభరణంచ నాస్మి కిం పాత్రం?
తాత్పర్యము:
ఓ శంకరా! నాలో జడత్వము గాని (జలము వలె), పశుత్వము గాని (నంది వలె), కళంకితత్వము గాని (చంద్రుని వలె), కుటిల చరత్వము గాని (పాము వలె) లేవు కదా. ఒక వేళ అట్టి అర్హతలు ఉండినచో నీ ఆభరణము అగుటకు పాత్రుడుని అయే వాడిని కదా!. వ్యంగ్యముగా అర్థము స్ఫురించే రీతిలో దీనిని బట్టి సుమారు 1200 సంవత్సరముల క్రిందట కూడా రాజుల వద్ద ఉద్యోగమునకు కావలసిన అర్హతలను ఇందు పేర్కొనిరి. మంచి సంస్కారములు కలవానికి ఉద్యోగములు ఉండవని దుర్లక్షణములు కలవానికే లభించునని భావము కదా! స్వస్తి.
భోజుని యాస్థాన మీకవి
రిప్లయితొలగించండిరాజ విరాజితము శంకరా భరణంబౌ !
జాజులు మల్లెల సౌరులు
రాజిలు నీకొలువు నందు రంజిల్ల మదిన్ !
సోదరులు గన్నవరపు వారి అభి మానానికిధన్య వాదములు
రిప్లయితొలగించండిపదముల సవరణతో,
గాజుల గలగల సవ్వడి
రాజేశ్వరి యక్క,చెల్లి లక్ష్మీ కవితల్
జాజుల పరిమళ భరితము !
రాజవిరాజితము శంకరాభరణంబౌ !!
నా మొదటి పూరణకు సవరణ,
రిప్లయితొలగించండితేజము తెలుగై ప్రోగిడి
యోజస్సున ఛంద మందు హొయలును జూపన్
భ్రాజిత సుకవీ తారల
రాజవిరాజితము శంకరాభరణంబౌ !
రాజిలు పద్యము లల్లుట
రిప్లయితొలగించండిపూజగ భావించి బుధులు పొగడెడి రీతిన్
మోజుగ రచియించెడు కవి
రాజవిరాజితము శంకరాభరణంబౌ !
రాజై సంగీతమ్మున
రిప్లయితొలగించండితేజోమూర్తైన స్వాతి తిరునాళ్ పాడన్
రాజిలె రాగంబుల స్వర
రాజ విరాజితము శంకరాభరణంబౌ.
అయ్యా చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము చాల బాగుగనున్నది. అభినందనలు. 2వ పాదములో తేజోమూర్తైనకి బదులుగ తేజోనిధియైన అంటే ఇంకా సొగసుగా నుంటుంది. చూడండి. స్వస్తి.
శ్రీనేమాని మహాశయులకు ధన్యవాదాలు. సరిగ్గా అక్కడే నాకలం చాలా సేపు ఆగిపోయింది. ఇప్పుడిలా మార్చాను. పరిశీలించండి:
రిప్లయితొలగించండిరాజై సంగీతామృత
తేజోనిధియైన స్వాతి తిరునాళ్ పాడన్
రాజిలె రాగంబుల స్వర
రాజ విరాజితము శంకరాభరణంబౌ.
తమ్ముడు చి. డా. నరసింహమూర్తి పద్యమునకు కొ9న్ని వన్నెలు దిద్దితే --
రిప్లయితొలగించండితేజము తెలుగై ప్రోగిడి
యోజస్సున ఛందమందు హొయలలరారన్
భ్రాజిత రసమయ సత్కవి
రాజ విరాజితము శంకరాభరణంబౌ
అయ్యా! చంద్రశేల్ఖర్ గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
మంచి వన్నె వచ్చినది మార్పులతో మీ పద్యమునకు. సంతోషము.
అమృతము అమృతమే. స్వస్తి.
కవి మిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినిన్న బంధువుల ఇంట్లో పెళ్ళికి ఊరికి వెళ్ళి రాత్రి ఎప్పుడో ఇల్లు చేరాను. అందువల్ల నిన్నటి పూరణలను కానీ, పద్యాలను కానీ చూసి వ్యాఖ్యానించే అవకాశం దొరకలేదు. మరి కాసేపట్లో కరెంటు పోతుంది. సాయంత్రం వరకు సమీక్షిస్తాను.
ఎలాగూ పరస్పర వ్యాఖ్యలు, నేమాని వారి గుణదోష విచారణ కొనసాగుతున్నాయి కదా!
అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
అన్నయ్యగారి రసమయాలంకరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండి