25, నవంబర్ 2012, ఆదివారం

పద్య రచన - 171

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22 కామెంట్‌లు:

  1. ద్యూతము కారణమ్మగుచు యోగము నంతయు మార్చు, మాయతో
    ద్యూతము ధర్మజాదులకు దుర్దశ లెన్నియొ కల్గజేసె, దు
    ర్నీతి పరాయణుల్ ధరణి నేలిరి కౌరవ నేతలై జగత్
    ఖ్యాత చరిత్రు లేవురు మహాటవి పాలయిరంత నక్కటా!

    రిప్లయితొలగించండి
  2. పాచిక లాడగ నప్పుడు
    పాచిక పారెను శకునిది పాండవు లంతా
    లేచిక పోవలె నడవికి
    పూచిక పుల్లైన వదలి పుణ్యస్త్రీ తో.

    రిప్లయితొలగించండి
  3. పరిపరి పిల్చెనంచు జని భాగ్యములెల్లను ధారవోసి యా
    వరణము వీడి కానలకు పాండవులందరు సాగిపోయిరీ
    ధరణిని "ద్యూతమాడు" కళ తప్పని నేర్చియు వీడకుండ నా
    తురతను కొందరాడుటను దొల్లియు నిప్పుడు గాంచుచుందుమే.

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    మాయాద్యూతము నందు :

    01)
    _______________________________

    దుర్మార్గంబుగ , ద్రోహ చింతన , నహో - దుర్వర్త క్రీడాస్థలిన్
    దుర్మేధుండు ,సుయోధనుం డకట , పో - ద్రోసెం గదా , కానలన్
    దుర్మిత్తిం గలిగింపగా దలచుటన్ ! - దుర్భాగ్య కాలంబునన్
    దుర్మిత్రోచిత కార్యము ల్నిలచునే ? - దుఃఖంబు తా పోవునే ?
    ధర్మేంద్రాదుల సంతు కైనను , సదా - ధర్మంబుగా నాడగన్ !
    _______________________________
    ధుర్మేధుడు = దుష్టుడు
    దుర్మిత్తి = దుర్మరణము
    దుర్మిత్రుడు = శత్రువు

    రిప్లయితొలగించండి
  5. జూదములాడేవారికి ఒక హెచ్చరికగా...........

    మోదముఁగల్గఁజేయునని మూర్ఖతనిండినవారుకొందరీ
    జూదములాడి జీవితము శూన్యము జేసికొనంగబోదురే
    పేదలుకారుతేజమున, వీరులుపాండవులేమిజేసిరా
    పాదసమస్తముల్ తొలగి ప్రాంతరమున్ వసియించజొచ్చిరే.

    ప్రాంతరము = అడవి

    రిప్లయితొలగించండి
  6. జూదము నాడకు నెప్పుడు
    జూ దమునే యాడి ధర్మజుడు నడవులకున్
    సోదర యుతముగ నరుగుచు
    పాదపముల నాశ్ర యించె బ్రతుకుట కొఱకున్

    రిప్లయితొలగించండి
  7. నిన్నటి పద్యరచన:
    మినప పిండితో జిలేబి చేస్తారనే భావంతో....
    దోసెతిన్నచక్రితొలిసారెదిగిరాగ
    చేతిచక్రమౌదుస్వీకరించు
    మనుచు మినుము కోర!నటులె జిలేబిగా
    మారు నీదు కోర్కె తీరు ననియె!

    నేటి పద్యరచన:
    జూదమాడమిగులమోదంబుగానెంచి
    ధర్మజుండువ్యసనదారిఁబట్ట
    సకలమొడ్డితుదకుసతినినిలుప
    ధార్త సభన వగచె ధర్మ పత్ని!

    రిప్లయితొలగించండి
  8. రెండవపాదసవరణ: (టైపాటు)
    'ధర్మజుండువ్యసన దారి బట్టి'

    రిప్లయితొలగించండి

  9. జూదము దుష్టాత్ముల కా
    మోదము, సజ్జనుల కెల్ల పొందఁగఁ జేయున్
    ఖేదము, కురుపాండవ సం
    వాదము వినలేదె; తగదు పాచిక లాడన్.

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యమును ఇలాగ సవరించి వ్రాస్తున్నాను:

    జూదమాడుట నతి మోదంబుగా నెంచి
    ధర్మరాజు చెడు పథమ్ము బట్టి
    సకల సంపదలను జాయనేనియు నొడ్డె
    నంత సాధ్వి మిగుల నార్తినొందె

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని వారూ,
    మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘అంతా’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘పాండవు లెల్లన్’ అంటే సరి.

    ‘లేచి + ఇక’ అన్నప్పుడు సంధి లేదు. ‘లేచి యిక’ అని యడాగమం వస్తుంది. అక్కడ ‘లేచి వనికి పోవలె నిక’ అంటే సరి. ‘పుల్లైన వదిలి’ని ‘పుల్లైన గొనక’ అంటే బాగుంటుందేమో!
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    ‘సాగిపోయిరీ’ - ‘సాగిపోయిరే’ అన్నదానికి టైపాటా?
    *
    వసంత కిశోర్ గారూ,
    ‘ర్మ’ప్రాసతో మీ పద్యం ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘ఆడకు మెప్పుడు’ అనండి.
    *
    సహదేవుడు గారూ,
    విష్ణుచక్రమే జిలేబీ అయిందా? బాగుంది మీ పద్యం. అభినందనలు.
    నేమాని వారి సవరణలతో ఈనాటి మీ పద్యం మనోహరంగా మారింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. సాగిపోయిరి+ఈ ధరణిని ద్యూతమాడు కళ తప్పని నేర్చియు
    తప్పంటారా?

    రిప్లయితొలగించండి
  13. లక్ష్మీదేవి గారూ,
    మన్నించాలి. తరువాతి పాదానికి అన్వయం చూసుకోలేదు. మీ భావమే సరియైనది.

    రిప్లయితొలగించండి
  14. మరి నా పూరణల, పద్యాల గుణదోష విచారణను చేసే మిత్రు లెవరు?

    రిప్లయితొలగించండి
  15. గురువు గారు,
    చక్కటి విరుపుతో గూడిన మీ హితబోధ చక్కటి పద్యమయినది.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా శ్రీ శంకరయ్య గారూ!
    శుభాశీస్సులు.
    మీ పద్యములలో గుణ దోష విచారణ చేయగల సత్తా ఎవరికి ఉంటుంది? అయినా నేనొక చిన్న ప్రయత్నము చేసేను. మీరు ప్రాస విషయములో ద్విప్రాసను వాడేరు. బాగున్నది. భావము మాటకు వస్తే మీరు పప్పులో కాలు వేసేరు. ద్యూతము ద్యూతమే - దుష్టాత్ములకు అయినా సజ్జనులకు అయినా ప్రభావము ఒకటే. పాండవ కౌరవ ద్యూతము మాయా ద్యూతము కాబట్టి ఏక పక్షము అయినది. లేకుంటే ధర్మరాజే గెలిచి ఉండేవాడేమో.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. వహ్వా ! శంకరార్యా ! వహ్వా !

    దుష్టాత్ముల కామోదము
    పొందఁగఁ జేయున్ ఖేదము
    కురుపాండవ సంవాదము

    ఇదేదో మామూలు పద్యంలా లేదు !
    దత్తపది పూరించినట్టుంది !

    రిప్లయితొలగించండి
  18. మాస్టారు గారూ ! ధన్యవాదములు..మీరు చూపిన సవరణతో..

    పాచిక లాడగ నప్పుడు
    పాచిక పారెను శకునిది పాండవు లెల్లన్
    లేచి కదల వలెనడవికి
    పూచిక పుల్లైన గొనక పుణ్యస్త్రీ తో.

    రిప్లయితొలగించండి
  19. పెద్దలకు నమస్కారములు. శ్రీరామాయణంలో కైక వరాలు, శ్రీ మహాభారతంలో మాయాద్యుతం దైవ సంకల్పాలేమో అనిపిస్తాయి, నామటుకు నాకు.

    రిప్లయితొలగించండి