గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, ‘త్రివిధ శ్రీదముల’ గురించిన పద్యం మనోహరంగా ఉంది. ధన్యవాదాలు. * శ్రీపతి శాస్త్రి గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * సుబ్బారావు గారూ, ఆయన తల్చుకుంటే ‘పంగుం లంఘయతే’... రప్పించుకొనడం ఎంత సేపు? మంచి పద్యం చెప్పారు. అభినందనలు. వేంకటేశ్వర క్షేత్ర దర్శన ప్రాప్తిరస్తు! * సహదేవుడు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది కానీ చివర దేవుణ్ణి ‘శోషించ’మన్నారేం? * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, భక్తిరసప్రపూర్ణాలై మీ పద్యాలు అలరించాయి. అభినందనలు.
నామము శంఖము చక్రము
రిప్లయితొలగించండినామమునే చెప్పకుండ నామము తెలుపున్
నీమముతో గొల్చినచో
క్షేమంబుల గూర్చు, వాడు శ్రీవాసుండే.
శ్రవణానందము పాంచజన్యకృతమౌ సంవిన్నినాదమ్ము దు
రిప్లయితొలగించండిష్టవికారఘ్న సుదర్శనమ్ము శ్రితరక్షన్ గూర్చు నశ్రాంతమున్
భవబంధమ్ముల బాపు నామ విభవ ప్రాశస్త్య మీ సంపుటిన్
త్రివిధ శ్రీదములన్ దలంచి ప్రణతుల్ వేవేలు కావించెదన్
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఆగమ శాస్త్ర విహారీ
వేగమె నీ నామమెల్ల విశ్వములోనన్
శ్రీగణనాథుడు చేర్చెను
రాగ ద్వేషములు తొలుగ రామా గొలుతున్.
ఏడు కొండల మీదున్న వేంకటేశ!
రిప్లయితొలగించండిమమ్ము గాపాడ దిగిర మ్ము మంగతోడ
ముసలి పండుల మైతిమి ముదిమి వలన
మేము రాలేక గోరితి మిమ్ము సామి !
మారెడు పశ్చాత్తాపము
రిప్లయితొలగించండికారాగారమునఁగూడిగర్వములడగన్!
దారులుఁజూపగదైవము
కారాగారమ్ములొసగుకైవల్యమ్మున్!
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిపొరపాటున పద్యరచనలో సమస్యపూరణ పంపాను మన్నించండి.
పద్యరచన:
శ్రీనివాసునినామమ్ముశిరముఁదాల్చి
మదిని శంఖమ్ముపూరించిమొదలుబెట్ట
కార్యవిజ్ఞాలచక్రమ్మునిర్వహించ
విజయముల గణనాధుండువేడ్కజేయు!
చక్రము శంఖముల్ నుదుట చక్కని నామము దాల్చి సర్వదా
రిప్లయితొలగించండివక్రపు బుద్ధి దీర్చు కడు పావన మూర్తికి వేంకటేశుకున్
సక్రమరీతులన్ క్రతువు సర్వము జేయగ - వేడుకొందునా
వక్రపు తుండము గలిగి పాపము బాపెడు విఘ్ననాథునిన్.
అమ్మా! లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యములో కొన్ని కొన్ని సవరణలు చేసేను - అన్వయసౌలభ్యము కొరకు.
చక్రము శంఖమున్ నుదుట చక్కని నామము దాల్చి సర్వదా
వక్రపు బుద్ధి దీర్చు విభు భావనజేయుదు వేంకటేశ్వరున్
సక్రమ రీతులన్ క్రతువు సాగగ జేయుమటంచు వేడుదున్
వక్రపు తుండమున్ గలిగి పాపము బాపెడు విఘ్ననాథునిన్
అయ్యా! సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము మొదటి పాదములో యతి సరిపోవుట లేదు. ఆ పాదమును ఇలాగ మార్చుదాము:
ఏడు కొండల శ్రీ వేంకటేశ! శ్రీశ!
స్వస్తి.
అయ్యా! శ్రీ సహదేవుడు గారూ!
రిప్లయితొలగించండిమీ పద్యములో 3వ పాదమును పరిశీలించండి. యతి సరిపోలేదు. కార్య విగ్జాల అనే ప్రయోగము అర్థము అగుట లేదు. స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅయ్యా! శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యములో 3వ పాదమును ఇలా మార్చుద్దాము:
"కార్య విఘ్నకృచ్చక్ర భగ్నమ్మొనర్చి"
నీమము లేకున్న గాని
రిప్లయితొలగించండినామము పఠియించి నంత నయమగు నిడుముల్ !
సేమము గోరుచు మాయెడ
సోముడవై నిలచినావు శోషింప గదే !
కలియుగంబునందు కలుషంబులను బాపి
రిప్లయితొలగించండిభక్తకోటి గాచి వరములొసగ
తిరుమలేశుడౌచు దివ్యతేజంబుతో
వేంకటేశ్వరుండు వెలసె ధరను.
పాంచజన్యమైన భవ్యశంఖము బూని
ధర్మరక్షయౌ సుదర్శనంబు,
నిరుపమంబులైన తిరునామములతోడ
వేంకటేశ్వరుండు వెలసె ధరను.
భక్తితోడ నేడు ప్రణతులర్పింతును
కలియుగాధినాథు గొలుతు నెపుడు
వేడు కొందు నెందు నేడుకొండలవాని
ధర్మమూర్తి నెపుడు దలచుచుందు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
‘త్రివిధ శ్రీదముల’ గురించిన పద్యం మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
ఆయన తల్చుకుంటే ‘పంగుం లంఘయతే’... రప్పించుకొనడం ఎంత సేపు?
మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
వేంకటేశ్వర క్షేత్ర దర్శన ప్రాప్తిరస్తు!
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది కానీ చివర దేవుణ్ణి ‘శోషించ’మన్నారేం?
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
భక్తిరసప్రపూర్ణాలై మీ పద్యాలు అలరించాయి. అభినందనలు.
రిప్లయితొలగించండిశంఖు చక్రములను శంకలేకుండను
మదిని నిల్పు హిందు మాత పూజ
నిలువునామ మన్న నిజరూప మది యని
తనువు పులకరించు జనుల కెల్ల.