16, నవంబర్ 2012, శుక్రవారం

పద్య రచన - 162

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8 కామెంట్‌లు:

  1. మగనా యాడన చూడగ
    సగసగమై నిలచినాడు శంభుడు నిజమే
    జగమెల్ల తామె నిండుచు
    సగములు గలసొక్కటైన సాగును సరిగా.

    రిప్లయితొలగించండి
  2. ఆది శక్తివి నీవు ఆది దేవుడ వీవు
    ....ప్రకృతి పురుషులగు వారు మీరు
    తల్లివి నీవమ్మ! తండ్రివి నీవయ్య!
    ....సకల లోకముల పోషకులు మీరు
    వాక్కులు నీవమ్మ! భావమ్ము నీవయ్య!
    ....స్రష్టలు మీరు వాఙ్మయ జగతికి
    చేతమ్ము నీవమ్మ! చైతన్యమీవయ్య!
    ....మూలమ్ము మీరెల్ల భూత తతికి
    ఒక్క గాత్రమ్ముతోడనే చొక్కుచుండు
    నుభయమూర్తులు జగతికి శుభములిచ్చు
    మిమ్ము దర్శించు భాగ్యమే మేలు మేలు
    సురభి సేవించు మిము గొల్తు వరదులార!

    రిప్లయితొలగించండి
  3. కలువ కన్నులు గలిగిన కలికి తోడ
    మూడు కన్నుల మగవాని మురిపెముగను
    కలిపి చిత్తరువును దీర్చి ఘనత కెక్క
    నెల్లవారికిలను సాధ్యమెట్టులగును?

    రిప్లయితొలగించండి
  4. ఏదేవదేవుండు మోదంబునందుచు
    తనువులో నర్థంబు వనితకిచ్చె,
    ఏ మహాదేవుండు దామోదరాద్యన్య
    సురవంద్యుడై యొప్పుచుండె నెపుడు,
    ప్రకృతి పార్వతి, తాను పరమపూరుషుడౌచు
    నెవ్వాడు జగముల నేలుచుండు,
    కల్యాణకారియై కమనీయరూపాన
    నెవ్వాడు దర్శనంబిచ్చుచుండు
    నతని నర్ధనారీశ్వరు, ననుపమగుణు,
    కామితార్థదు, చంద్రశేఖరుని, భవుని
    భక్త(క్తి)సులభుని, శంకరు, బ్రమథనాథు
    హరుని సద్భక్తి గొలిచెద ననవరతము.

    రిప్లయితొలగించండి
  5. వెండి కొండ నుండు వేదవిదుడ వీవు
    ఆది శక్తి నీకు యర్ధ నారి
    మూడు కన్ను లుండి ముల్లోకముల నేలు
    గరళ కంఠు డైన ఘనత నీది

    రిప్లయితొలగించండి
  6. కైలాసాచలకాలుడు
    శ్రీలలితాంబయెసగమయిచిరునగవులిడన్
    చాలననితగ్గెజాబిలి!
    శూలముగొనినందిపైనశుభమిడ రారే!

    రిప్లయితొలగించండి
  7. నా పద్యము 3వ పాదములో యతిని గమనించలేదు. ఆ పాదము 2వ భాగము --

    స్రష్టలు మీరు వాఙ్మయ జగతికి -- కి బదులుగా --
    ఇలా మార్చుదాము: స్రష్టలు వాఙ్మయ జగతి మీరు

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  8. యేం చెయ్యాలో తెలియక శ్రీనాధుణ్ణి పట్టుకొన్నాను. క్షమింతురు గాక.

    చంద్ర మౌళి యతండు చంద్రాన నామెయౌ
    .........................నీలగళుండును నీలవేణి
    శ్వేత గాత్రుడతండు శ్వేత లోచని యామె
    .........................మదనాంతకుండును మదను మాత
    నాగ భూషి యతండు నాగ గామిని యామె
    .........................భువనైక పతియును భువన కర్త్రి
    గిరియల్లు డతడును గిరి కొమరిత యామె
    .........................లోక గురుండును లోక జనని

    పార్వతీ పరమేశ్వరు లిర్వురిచట
    కొల్వు దీరిరి కనరారె కల్వ కనుల
    ఆది దంపతులకు మ్రొక్కు డధిక భక్తి
    ముక్తి కది మార్గ మౌనది పుణ్యులార.

    రిప్లయితొలగించండి