22, నవంబర్ 2012, గురువారం

పద్య రచన - 168

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

7 కామెంట్‌లు:

  1. ధర పెక్కు వత్సరములే
    లిరి పాండవు లంత బూనిరి కనగ ముక్తిన్
    వరుసగ నరుగుచు నుండిరి
    యరిగిన దొక కుక్క వారి యందరి వెనుకన్

    రిప్లయితొలగించండి
  2. అరుగు చుండిరి పాండవు లైదు గురును
    వెనుక వారికి యొక కుక్క వెంట రాగ
    ముక్తి కొఱకునై జేరగ మోక్ష గృహము
    అంతి మంబున సర్వుల కదియె సుమ్ము .

    రిప్లయితొలగించండి
  3. తనదు వారలెల్లను జేర తమదు స్థాన
    మందు ; శునకమును విడువనంచు బలికె
    వెంట వచ్చిన వారిని విడక జనుట
    ధర్మమనుచును నమ్మిన ధర్మరాజు.

    రిప్లయితొలగించండి
  4. పాండవుల స్వర్గారోహణ ఘట్టానికి తగిన చక్కని పద్యాలను వ్రాసిన....
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. మర్మము తెలియని వారలు
    ధర్మము నకు కట్టు బడిన ధార్మికు లనగన్ !
    కర్మము తప్పని సరియని
    నిర్మల బుద్ధిని శునకము నేరుగ వెంటన్ !

    రిప్లయితొలగించండి
  6. ఒక్కొక్కరు పాండవులే
    త్రొక్కగ స్వర్గంపు త్రోవ తొలగెను ప్రాణం
    బొక్కడు ధర్మజుడు మిగిలె
    కుక్కొక్కటియును తెలిసి కొన కాలుండే.

    రిప్లయితొలగించండి